– సర్కారు తరుఫున ఒక్కొక్క కుటుంబానికి రూ.5 లక్షలు
– సీఎం చంద్రబాబు ప్రకటన
– వ్యాపారస్తులు.. ఒక్కొక్క కుటుంబానికి రూ.3 లక్షలు
– టీడీపీ నేత బూరుగుపల్లి… ఒక్కొక్క కుటుంబానికి రూ.20వేలు
దేవరాపల్లి: దేవరాపల్లి మండలం, చిన్నాయిగూడెం శివారులో జీడిపిక్కల వాహనం బోల్తాపడింది. ఈ ఘటనలో నిడదవోలు మండలం తాడిమళ్ల, కాటకోటేశ్వరం గ్రామాలకు చెందిన రోజువారి కూలీలు ఏడుగురు మరణించారు. బాధిత ఒక్కొక్క కుటుంబానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తక్షణమే స్పందించి సీఎంఆర్ఎఫ్ కింద రూ. 5 లక్షలు మంజూరు చేశారు.
అలాగే జీడిపప్పు వ్యాపారస్తులు మానవత దృక్పథంతో స్పందించి బాధిత ఒక్కొక్క కుటుంబానికి రూ.3 లక్షలు, నిడదవోలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మాజీ శాసన సభ్యుడు, ఇంఛార్జి బూరుగుపల్లి శేషారావు ఒక్కొక్క కుటుంబానికి 20 వేల రూపాయలు తక్షణ సహాయాన్ని ప్రకటించారు. ఈ సాయాన్ని కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు, గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట రాజు తో కలిసి కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రి లో బాధిత కుటుంబాలను పరామర్శించి ఆర్థిక సహాయాన్ని అందచేశారు.