Suryaa.co.in

Andhra Pradesh

పీఎం స్వానిధిలో రాష్ట్ర స్థాయిలో 38 అవార్డులు

• పీఎం స్వానిధి అమలులో జాతీయ స్థాయిలో ఉత్తమ పనితీరు
కనపరిచిన అధికారులు, బ్యాంకర్లకు అభినందనలు
• పేదరిక నిర్మూలనే లక్ష్యంగా పీఎం స్వా నిధి పధకం అమలు
• రాష్ట్రంలో ప్రతి ఒక్కరి ఆదాయం రెట్టింపు చేయాలన్నదే ముఖ్యమంత్రి ఆశయం
• పీఎం స్వానిధి పథకాన్ని డ్వాక్రా సంఘాలు, చిరువ్యాపారులు వినియోగించుకోవాలి
• ఈ పథకంలో బ్యాంకుల నుంచి 7 శాతం సబ్సిడీ అందిస్తున్నాం
– రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి. నారాయణ

విజయవాడ: పేదలంతా పీఎం స్వానిధి పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర పురపాలక శాఖా మంత్రి పి. నారాయణ అన్నారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో పీఎం స్వా నిధి పధకం రాష్ట్ర స్థాయి అవార్డుల కార్యక్రమంలో మంగళవారం మంత్రి నారాయణ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వచ్చే ఏడాది జాతీయ, రాష్ట్ర స్థాయిలో ఇంకా ఎక్కువ అవార్డులు సాధించాలని ఆకాంక్షిస్తున్నానన్నారు. కోవిడ్ సమయంలో మొదట నష్ట పోయింది స్ట్రీట్ వెండర్స్ అని వారి కోసం కేంద్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు తీసుకొచ్చిందని అందులో ముఖ్యంగా పీఎం స్వానిధి పథకమన్నారు. ముఖ్యమంత్రి రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి ఆదాయం రెట్టింపు కావాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నామన్నారు.

రాష్ట్రంలో అందరి ఆదాయం రెట్టింపు కావాలని ముఖ్యమంత్రి ఆదేశించారనన్నారు. అందుకు అనుగుణగా మెప్మాలో అనేక కార్యక్రమాలు తీసుకుని పని చేస్తున్నామన్నారు. గతంలో పేదల ఆదాయం రెండింతలు చేయాలన్న ముఖ్యమంత్రి ఆదేశాలతో 2014 నుంచి 2019 వరకు మెప్మాలో అనేక పథకాలు అమలు చేశామన్నారు. ఇప్పుడు ప్రజలందరికీ మేలు చేయడానికి, అభివృద్ధిలో ముందుకు తీసుకుపోవాలన్న ఉద్దేశ్యంతో వివిధ పథకాలు అమలు చేస్తున్నామన్నారు.

అందుకే ఐఏఎస్ అధికారిని మెప్మా కు ఎండీ కావాలని ముఖ్యమంత్రిని అడిగి మరీ అధికారిని ని తీసుకొచ్చానన్నారు. అంతకుముందు ఈ శాఖకు ఐఏఎస్ అధికారి లేరన్నారు. కేంద్రం ఫండ్స్ ను సద్వినియోగం చేసుకోవడానికి అందరూ కృషి చేయాలన్నారు. పథకాన్ని సమర్థవంతంగా వినియోగించుకుని పేదరికం నుంచి బయటపడాలన్నారు.

LEAVE A RESPONSE