ఎమ్మెల్సీ అనంత బాబును శాసన మండలి సభ్యత్వాన్ని రద్దు చేయాలి

Spread the love

-ఎమ్మెల్సీ అనంత బాబును శాసన మండలి సభ్యత్వాన్ని రద్దు చేయాలని, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ శాసనమండలి చైర్మన్ కు వినతి
-రాజకీయ, దళిత, ప్రజాసంఘాల డిమాండ్

కాకినాడ జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ అనంత బాబు డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యంను హత్య చేసి రిమాండ్ లో వున్న ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్ శాసన మండలి సభ్యత్వం రద్దు చేయాలని, అదేవిధంగా డాక్టర్ బి.ఆర్: అంబేద్కర్ కోనసీమ జిల్లాగా కొనసాగించాలని కోరుతూ సిసిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్సీ జల్లి. విల్సన్ నాయకత్వంలో సిపిఐ, సిపిఐ (ఎంఎల్), న్యూడెమోక్రసీ, ఆర్ పిఐ, వికెసీ, దళిత
ap-state2-A-18 హక్కుల పోరాట సమితి, కెవిపిఎస్, తదితర ప్రజా సంఘాలు బుధవారం మధ్యాహ్నం శాసనమండలి ఛాంబర్ లో శాసన మండలి చైర్మన్ మోషేన్ రాజ్ ను కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కలిసిన వారిలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు. సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు ఎం. రామకృష్ణ, దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కరవది సుబ్బారావు, ఆర్.పి.ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిట్టా వరప్రసాద్, కెవిపిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు జి. నటరాజ్, వి. కె.సి.పార్టీ అధ్యక్షులు కృష్ణ, టిడిపి ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి దానం లాజర్ బాబు, డి హెచ్ పి ఎస్ రాష్ట్ర కార్యదర్శి రాయప్ప బృందం చైర్మన్ తో పలు అంశాలు చర్చించడం జరిగింది.

ఈ సందర్భంగా శాసనమండలి చైర్మన్ మాట్లాడుతూ చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని, శాసన మండలి రద్దు అనే అంశంపై పరిశీలన చేస్తామని, అధికారులతో చర్చిస్తామని ఆయన అన్నారు. అదేవిధంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పేరు మార్పు ఉండదని ఒకసారి ముఖ్యమంత్రి గారు అనుకున్న తర్వాత ఆ నిర్ణయం వెనక్కి వెళ్లదని ఆయన హామీ ఇచ్చారు.

మాజీ ఎమ్మెల్సీ జెల్లీ విల్సన్ మాట్లాడుతూ ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్ అనేక విరుద్ధ కార్యక్రమాలకు, అమాయక గిరిజన భూములు కబ్జా చేయడంలోనూ, గిరిజన మహిళపై లైంగిక వేధింపులు కేసులు అనేక కేసులు పెండింగ్ లో ఉన్నాయన్నారు. వైసిపి పార్టీ అనంతబాబును పార్టీ నుండి సస్పెండ్ చేసిందని. అదేవిధంగా వెంటనే శాసనమండలి సభ్యత్వం కూడా రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మహారాష్ట్ర తర్వాత దళితుల చైతన్య, ప్రాంతమైన కోనసీమ జిల్లాలో గత 30 సంవత్సరాలుగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పేరు పెట్టాలని పలు ఆందోళన జరిగాయన్నారు. ప్రతి రాజకీయ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇదే అంశాన్ని జోడించి ఎన్నికలకు వెళ్తాయని నేడు కొంతమంది కుట్ర చేసి అమలాపురంలో అల్లరి చేశారన్నారు. దీనిపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేయాలని కోనసీమ జిల్లాను అంబేద్కర్ జిల్లాగా కొనసాగించాలన్నారు.

Leave a Reply