Suryaa.co.in

Andhra Pradesh

తోట త్రిమూర్తులును ఎమ్మెల్సీ పదవి నుంచి బర్తరఫ్ చేయాలి

– వెంకటాయపాలెం శిరోముండనం కేసు కోర్టు విచారణ పూర్తి చేసి, తోట త్రిమూర్తులు తో పాటు
దోషులు అందర్నీ కఠినంగా శిక్షించాలి!
– అక్టోబర్ 20 నుండి నవంబర్ 2 వరకు దళితులపై దాడులకు వ్యతిరేకంగా మండల కేంద్రాల్లో ఆందోళనలు చేపట్టాలి!
– నవంబర్ 3న కలెక్టరేట్ ముట్టడి!
కాకినాడ : దళిత, మైనారిటీ, హక్కుల, వామపక్ష, విప్లవ, ప్రజాసంఘాల ఐక్యవేదిక సమావేశం మంగళవారం ఉదయం కాకినాడ కచ్చేరిపేటలో గల సుందరయ్య భవన్ లో జరిగింది. ఈ సమావేశానికి ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్ రామేశ్వర రావు అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో రామేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి దళితులలు ప్రధాన భూమిక పోషించారని, కానీ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులపై దాడులు పెరిగిపోయాయని ఆయన విమర్శించారు.
దళితులపై దాడులు అరికట్టకపోతే జగన్ ప్రభుత్వానికి భవిష్యత్తు ఉండదని ఆయన హెచ్చరించారు. వెంకటాయపాలెం శిరోముండనం కేసులో ప్రధాన ముద్దాయి తోట త్రిమూర్తులు కు జగన్ ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం గర్హనీయమన్నారు. తోట త్రిమూర్తులు ను ఎమ్మెల్సీ పదవి నుంచి బర్తరఫ్ చేయాలని, ఆ కేసు విచారణ పూర్తి చేసి, తోట త్రిమూర్తులు తోపాటు దోషులను కఠినంగా శిక్షించాలని రామేశ్వరరావు డిమాండ్ చేశారు. దళితులపై దాడులకు నిరసనగా అక్టోబర్ 20 నుండి నవంబర్ 2 వరకు మండల కేంద్రాల్లో ఆందోళనలు నిర్వహించాలని, నవంబర్ 3న కలెక్టరేట్ ముట్టడి చేయాలని సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది.
ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దువ్వ శేష బాబ్జి, సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జె వెంకటేశ్వర్లు, కెవిపిఎస్ జిల్లా నాయకులు ఎం రాజశేఖర్, జన చైతన్య మండలి అధ్యక్షులు పావన ప్రసాద్, తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

LEAVE A RESPONSE