Suryaa.co.in

Telangana

పిచ్చుక మీద బ్రహ్మస్త్రమా?

– సాయిరెడ్డి ఇంటికి దారిలేకుండా గోడకట్టి ఏం సాధించారు ?
– పశువుల దవాఖానా పేరుతో ఇంటికి దారిలేకుండా గోడకట్టడంతో సీఎం సొంతూరు వంగూరు మండలం కొండారెడ్డిపల్లిలో మాజీ సర్పంచ్ సాయిరెడ్డి ఆత్మహత్య చేసుకున్న ఘటన పై మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి దిగ్బ్రాంతి

హైద‌రాబాద్ : పిచ్చుకల మీద బ్రహ్మస్త్రమా ? సీఎం రేవంత్ సొంత గ్రామం కొండారెడ్డిపల్లి లో మాజీ సర్పంచ్ సాయిరెడ్డి ఆత్మహత్యకు ప్రభుత్వం, రేవంత్ కుటుంబం బాధ్యత వహించాలి. గోటితో పోయే సమస్యలను గొడ్డలిదాకా తెస్తున్నారు. జీవిత చరమాంకంలో ఉన్న సాయిరెడ్డి ఇంటికి దారిలేకుండా గోడకట్టి ఏం సాధించారు ? సాయిరెడ్డి ఆత్మహత్యకు కారకులైన వారందరి మీద చర్యలు తీసుకోవాలి. కాంగ్రెస్ పాలనలో మనుషుల ప్రాణాలకు, వారి ఆకాంక్షలకు విలువ లేకుండా పోయింది.

LEAVE A RESPONSE