సాగిపోయే ముచ్చట్లకు ఇరానీ తేనీరు ఇంకా ఉస్మానియా బిస్కెట్లు చిరకాల నేస్తాలు. ఒక నూఱంగి మునుపు మన నగరానికి వచ్చిన ఇరానీ వలసదారులు ఈ నాటు పానీయాన్ని తయారుచేసి, మెఱుఁగు పరిచారన్న సాంస్కృతిక ప్రాముఖ్యత తెలియకుండా చాలామంది హైదరాబాదీలు ఇరానీ తేనీరుని చాలా తేలికగా తీసుకుంటారు. విడ్డూరం ఏమిటంటే, అసలు ఇరానులో మంది త్రాగేది నల్ల తేనీరు మటుకే. మన కేఫేల్లో అమ్మే ఇరానీ తేనీరు లాంటిది తాగరు. ఎందుకంటే మన తెఱంగు తేనీరు, ఆకు ఇంకా పాలు గంటలు గంటలు మరిగాక కలిపితే తియ్యగా వస్తుంది. వాళ్ళది కాస్త చేదుగా, పాలు లేకుండా కషాయం లాగా ఉంటుంది.
ఈ ఇరానీ తేనీరు ఇంకా ఇరానీ కేఫేల పెద్దగా తెలుసుకోబడే గుర్తులల్లో చిన్న పింగాణీ కప్పులు ఒకటి.
అంతటనున్న ఈ కప్పు-సాసర్లను ఎందరో హైదరాబాదీలు తమ బ్రదుకులో వీటిని ఎంతో సేపు పట్టుకొని గంటలు తరబడి కబుర్లు చెప్పుకొనే ఉండింటారు. పింగాణీ గిన్నెలు అనగానే ఒక ఆసక్తికరమైన విషయం గుర్తొచ్చింది: పాత రోజుల్లో వడ్డించేటప్పుడు వేఱు రంగుల వడ్డన గిన్నెలలో అంటే హిందూ వాళ్ళకు పింకువి, ముస్లింలకు లేత ఆకుపచ్చవి ఇంకా పార్సీలు, క్రైస్తవులు ఇంకా యూదులకు తెలుపు రంగువాటిల్లో వడ్డించేవి కేఫేలు. వచ్చే వాళ్ళ తీరుతెన్నులన్ని కెఫే పనివాళ్ళు ఏది వదలకుండా ఆరపట్టేవారు మరీ.
ఇక కేఫేల చరిత్రకు తిరిగి వద్దాం. సుమారు 100 ఏళ్ళ ముందు ఇరాన్ కుఱ్ఱాళ్ళు ఆర్ధిక అక్కఱులు కొఱకు ఇరాన్ నుండి తరలి బ్రిటిష్ భారతదేశం రావడంతో కరాచీ, బొంబాయి ఇంకా హైదరాబాదులలో ఇరానీ కేఫే వ్యాపారాలు ఏర్పడ్డాయి.
హైదరాబాదులో ఉండటం వాళ్ళకి మేలు అనిపీయడానికి ఇక్కడ మాట్లాడే నుడి (దఖ్ని ఉర్దూ) ఇంకా అసఫ్ జాహీ రాజ్యం/నిజాములు ఏలుతున్న హైదరాబాద్-దక్కన్ రాష్ట్ర రా-నుడులు పెర్షియన్ మరియు ఉర్దూ కావడం కారణాలు. అంటే ఓ తీరుగా ఇప్పట్లో భారతీయులు ఎలా కొలువుల కొఱకు అమెరికా లేదా గల్ఫ్‌కు వెళ్తున్నారో అలానే వాళ్ళని అనుకోవచ్చు.
ఆర్థిక అక్కఱు కోసం ఏది మొదలయిందో కొంత కాలానికి అదే హైదరాబాద్ యొక్క ముఖ్యమైన సాంస్కృతిక గుర్తులలో ఒకటిగా నిలిచింది. అయితే విచిత్రం ఏమిటంటే, ఈ కేఫేలు చాలా కాలం పాటు వట్టి పనివానుల వింగడాలకు మటుకే అన్నట్లు ఉండేవి.
ఈ కేఫేలు హైదరాబాదీలకు కలుసుకోడానికి నచ్చిన చోటుగా మారడానికి ముందు, హైదరాబాద్‌లోని ‘మంచి/పెద్ద కుటుంబం’ గలవాళ్ళు వాటికి వెళ్ళడానికి, ముఖ్యంగా వాటిల్లో తినడానికి ఆంక్షలు పెట్టేవారట. ఇరానీ కేఫేలకు వెళ్ళే ఆస్తిపరులు ఇంకా ఉన్నత వర్గాల వాళ్ళని చిన్నచూపు చూసేవాళ్లట. ఎలాను చివరికి 60లల నుండి ఇరానీ కేఫేలు రాజకీయ చర్చలకు కేంద్రాలుగా మారాయి. ఈ తావులు 1950ల నుండి 1960లలో హైదరాబాద్‌లో అప్పుడు బాగా చొరవ ఉన్న కూటవానులకు(భారత కమ్యూనిస్ట్ పార్టీ ఉన్నప్పుడు) నీడిలి కూడా ఇచ్చేవట.
కేఫేలలో జ్యూక్బాక్స్లను పెట్టిన తర్వాత నుంచే వాటిల్లో మంది (ఎక్కువగా మగవాళ్ళు) హాయిగా కూర్చోవడానికి, తేనీరు త్రాగడానికి ఇంకా లోకంలో జరుగుతున్నదానీ గూర్చి ముఖ్యంగా రాజకీయాల గురించి మాట్లాడుకోడానికి ఉండే పేరున్న చోట్లుగా మారాయి. కాలం కొద్ది ఈ కేఫేల లోపలి అలంకారణలో కూడా మార్పు వచ్చింది. ఇప్పుడయితే అవి చవ్వగా మారాయి. అంతకుముందు వాటిల్లో చెక్క కుర్చీలు, పాలరాతి బల్లలు ఇంకా లోపల చాలా చోటు ఉందని చూపీయడానికి చుట్టూ గోడలపై అద్దాల అమర్చి మరీ ఉండేవి!
అన్ని కేఫేలలో, గ్రాండ్ పాత మెసవలిలలో ఒకటి అనే దానితో పాటు అదొక్కటే హైదరాబాద్‌లో నికాపానికి తిండి అందించేది కూడా. చాలా ఇతర ఇరానీ మెసవలిలు ఒట్టి చాయ్/బిస్కెట్/బేకరీ వస్తువులనే విక్రయిస్తాయి. బొంబాయి, కరాచీలో అయితే అన్నీ తిండి కూడా అందిస్తాయి.
ఒకానొక అదునులో హైదరాబాద్‌లో ఇరానీ కేఫెలు తెగ ఉండేవి. ఇవి చాలా వరకు మూలలలోనే ఉండేవి. ఎందుకంటే మూలన ఉండే భూములకు ‘చెడ్డ వాస్తు’ ఉందని అనిపించి చాలా హిందువులు వాటి జోలు వెళ్ళేవారు కాదు. కనుక ఆ నేలలే ఇరానీలకి దొరికేవి. అయితే గత కొన్ని పదాంగులలో చాలా కేఫేలను మూసేశారు. ఇక ఇప్పట్లో గ్రాండ్ హోటల్ లాంటి అతి పాత కేఫే (1935)తో పాటు, ఒలింపియా లాజీజ్, గార్డెన్, ఆల్ఫా, డైమండ్ లాంటివి మహా అయితే 100 ఉండవచ్చు (మునుపు 500 ఉండేవి). ఈ రోజు మనం చూస్తున్నవి కేవలం ఒక డజను ప్రాయం వచ్చినవి మటుకే (ఇంకా ఎక్కువగా రద్దీగా ఉంటాయి) మిగిలి ఉన్నాయి.
– సాయి మిలింద్