– మరోసారి చర్చకు వస్తావా అని అడుగుతున్నాడు
– నాగార్జునసాగర్ కట్టమీద కాదు కానీ మేడిగడ్డ బ్యారేజ్ మీద చర్చకు వస్తావా రేవంత్?
– రేవంత్ లాంటి దొంగలు, లంగలు పదవుల్లోకి వస్తారని అంబేద్కర్ ఊహించలేదు
– మేము కూడా తిట్లు వాడక తప్పడం లేదు
– ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి భారత రాష్ట్ర సమితి కేటీఆర్ సవాల్
తెలంగాణ భవన్ లో జరిగిన దళిత బంధు సాదన సమితి సమావేశంలో మాట్లాడిన కేటీఆర్
హైదరాబాద్: దమ్ముంటే రేవంత్ రెడ్డి కూలిందంటున్న మేడిగడ్డ బరాజ్ మీదనే చర్చ పెడదాం. దమ్మంటే రేవంత్ మేము విసిరిన సవాల్ స్వీకరించాలి. చర్చకు రా అని సవాలు విసిరి చర్చకు వెళితే రేవంత్ రెడ్డి పారిపోయిండు. చర్చకు వస్తవా అని పిలిచి పారిపోయిన పిరికిసన్నాసి రేవంత్ రెడ్డి.
మరొకసారి చర్చకు వస్తావా అని అడుగుతున్నాడు. మరోసారి నాగార్జునసాగర్ కట్టపైన చర్చకు వస్తావా అని సవాల్ విసిరిండు. రేవంత్ రెడ్డికి తెలివిలేక కాలేశ్వరాన్ని కూలేశ్వరం అంటున్నాడు. నాగార్జునసాగర్ కట్టమీద కాదు కానీ మేడిగడ్డ బ్యారేజ్ మీద చర్చకు రావాలని సవాలు విసురుతున్నాం.
ఇప్పటికే మా సీనియర్ నాయకులు మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి మేడిగడ్డ బరాజ్ వద్దకు వెళ్లి వచ్చి మరి ఈ మేరకు సవాల్ విసిరిండు. దమ్ముంటే రేవంత్ రెడ్డి మేడిగడ్డ బరాజ్ మీద చర్చకు మేము విసిరిన సవాల్ స్వీకరించాలి.
తుంగతుర్తి సూర్యాపేట నియోజకవర్గం చివరి మడి వరకు నిలిచిన నాయకుడు కేసీఆర్ అని రేవంత్ కు తెలుసు. అయినా కూడా రేవంత్ రెడ్డి అబద్దాలు మాట్లాతున్నాడు.
ముఖ్యమంత్రి దిగజారుడు మాటలు మాట్లాడుతున్నారు.
ముఖ్యమంత్రి తనను దొంగ లెక్క చూస్తున్నారని పదేపదే మాట్లాడుతున్నారు. ఇచ్చిన అమలు చేయమంటే ఏం చేస్తారో చేసుకోండి. నన్ను కోసుకు తింటారా అంటూ రంకెలు వేస్తున్నారు. ఏం పీక్కుంటారో పీక్కోండి అని ప్రజలను అంటున్నాడు.
రానున్న స్థానిక సంస్థల్లో ప్రజలు ఏం పీక్కుంటారో చూపిస్తారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాసినప్పుడు రేవంత్ రెడ్డి
లాంటి దొంగలు, లంగలు పదవుల్లోకి వస్తారని ఊహించలేదు. అందుకే ఐదు సంవత్సరాల పాటు పదవిలో ఉండే విధంగా రాజ్యాంగం రాశారు. లేకుంటే దేశంలో రేవంత్ లాంటి మోసాగాళ్లను రీకాల్ చేసే వ్యవస్థను దేశంలో కూడా ప్రవేశపెట్టేవారు.
రాజకీయాల్లో తిట్లు వాడడం మాకు ఇష్టం లేదు. కానీ రేవంత్ రెడ్డికి ఆయన భాషలో చెప్తేనే అర్థమవుతుందని మాట్లాడాల్సి వస్తుంది. కుక్క కాటుకు
చెప్పు దెబ్బ అన్నట్లు మేము కూడా తిట్లు వాడక తప్పడం లేదు.