– మంత్రి లోకేష్
అమరావతి: గత ఏడాది డిసెంబర్ ఏడోతేదీన మెగా పీటిఎం బాపట్ల మున్సిపల్ హైస్కూల్లో అత్యంత ఘనంగా నిర్వహించాం. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పాఠశాల యాజమాన్య కమిటీ సీఎం దృష్టికి పాఠశాల సమస్యలు తీసుకొచ్చారు. అదే వేదికపై నుంచి హామీ ఇచ్చిన సీఎం, ఏడాదిలోగా అన్ని వసతులు కల్పించాలని మాకు ఆదేశాలు ఇచ్చారు. బాపట్ల మున్సిపల్ హై స్కూల్లో 24 గదులు, డైనింగ్ హాల్, ల్యాబ్స్‌తో కూడిన మౌలిక వసతుల కల్పన యుద్ధ ప్రాతిపదిక పూర్తి చేసిన కృషిలో భాగమైన అందరినీ అభినందిస్తున్నాను. మేం ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం. మంచి ఫలితాలు సాధించి బాపట్ల మున్సిపల్ హై స్కూల్ పేరు నిలబెట్టాలని విద్యార్థులు, ఉపాధ్యాయులను కోరుతున్నాను అని విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.