– టీడీపీ గ్రీవెన్స్‌లో బాధితుల ఫిర్యాదు
– అర్జీలు స్వీకరించి సమస్యల పరిష్కారానికి కృషి చేసిన నేతలు
మంగళగిరి: ప్రకాశం జిల్లా, పెద్దచెర్లోపల్లి మండలం మలినేనివారిపల్లె గ్రామానికి చెందిన మలినేని మాలకొండయ్య సోమవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రజావినతుల స్వీకరణ కార్యక్రమంలో నేతలకు అర్జీ ఇచ్చి అభ్యర్థించారు. తమ పెద్దల నుంచి వచ్చిన వారసత్వ భూ సమస్య గురించి తమ కుటుంబ సభ్యులందరూ తహసీల్దార్ ను కలిశాం. తమ పూర్వీకుల భూమిని తమ పేర్లపై ఆన్ లైన్ చేయమని విన్నవిస్తే పట్టించుకోవడం లేదు. తమ సమస్యపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. నేతలు మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఏపీఈడబ్ల్యూఐడీసీ ఛైర్మన్ కుప్పం రాజశేఖర్‌లకు అర్జీ ఇచ్చి అభ్యర్థించాడు.
విజయనగరం జిల్లా, లక్కవరపుకోట గ్రామానికి చెందిన సంగం వెంకటరమణ గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ.. తమ గ్రామంలో నివాసం ఉంటూ ప్రైవేటు పాఠశాలను నడుపుతూ జీవిస్తున్నాను. 2008లో మల్లివీడు గ్రామంలో 5.55 సెంట్ల భూమిని కొనుగోలు చేశాను. డబ్బు సరిపడాలేనందున విశాఖపట్నం సీతమ్మధారకు చెందిన మేడపాటి రామలింగారెడ్డి, జగన్మోహనరెడ్డి వద్ద రూ.35 లక్షలు అప్పు తీసుకున్నాను. అప్పు ఇచ్చే సమయంలో ఆ భూమిని జనరల్ పవర్ ఆఫ్ ఆటార్ని రూపంలో వారిపేరున రిజిస్టర్ చేయించుకున్నారు. అప్పు, వడ్డీ చెల్లించిన తర్వాత తమ భూమి తిరిగి ఇస్తామని హామీ ఇచ్చినా తరువాత భూమిని స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేశారు.
2009లో వడ్డీ సరిగా చెల్లించడం లేదనే నెపంతో మరిన్ని భూములను కూడా జనరల్ పవర్ ఆఫ్ ఆటార్ని ద్వారా తమ పేరున రిజిస్టర్ చేయించుకున్నారు. 2016లో అప్పు తీర్చడానికి సిద్ధమని చెప్పినా, భూమిని తిరిగి ఇవ్వకుండా, “రిజిస్ట్రేషన్ మా పేరున అయింది కాబట్టి భూమి మాదే” అంటూ మోసం చేశారు. వారిపై చర్యలు తీసుకొని తమ సమస్యను పరిష్కరించాలని కోరాడు. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా లింగసముద్రం మండలం మొగిలిచర్ల గ్రామానికి చెందిన చీమలదిన్నె కొండయ్య గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ.. తను మిలటరీలో 35 సంవత్సరాలు కుక్ గా పనిచేసి 2002 లో రిటైర్డ్ అయ్యాను.
తను మిలటరీలో పనిచేసినందకు ప్రభుత్వం లింగసముద్రం మండలంలోని రాచెరువురాజుపాలెం రెవెన్యూ గ్రామంలో ఖాళీగా ఉన్న భూమి సర్వే నెంబర్ 275 విస్తీర్ణంలో యు.5.00 సెంట్లు ఇచ్చారు. ఈ స్థలాన్ని బాగుచేసుకొని మెట్ట పైర్లు వేసుకుంటున్నాను. ఇప్పుడు తమకు అక్కడ పొలం లేదని చెప్తున్నారు. తమ సమస్యను పరిష్కరించాలని కోరాడు.
గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం వెంగాళాయి పాలెం గ్రామానికి చెందిన దుద్యాలి సత్యవతి గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ.. తమ గ్రామంలో డ్వాక్రా గ్రూపులో చేరడానికి భూలక్ష్మీ అనే మహిళలకు ఆధార్ కార్డు, రేషన్ కార్డు, పాస్‌పోర్ట్ ఇచ్చాను. తమ భర్త డ్వాక్రా వద్దని చెప్పడంతో భూలక్ష్మీ దగ్గరికి వెళ్తే ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఇచ్చారు. ఫోటో ఇవ్వలేదు. 3 సంవత్సరాల తర్వాత జీడీసీసీ బ్యాంకు వారు వచ్చి లోను తీసుకున్నారు డబ్బులు కట్టాలని అడిగారు. తాం ఎప్పుడూ రుణం తీసుకోలేదు, ఎటువంటి పత్రాలపై సంతకం చేయలేదు అయినప్పటికీ తమ పేరుతో రుణ బకాయిలు ఉన్నాయని అంటున్నారు. తమ సమస్యను పరిష్కరించాలని అభ్యర్థించారు.
అల్లూరి సీతారామరాజు జిల్లా, మారేడుమిల్లి మండలం సున్నంపాడు గ్రామానికి చెందిన బట్టా రాజేశ్వరి గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ.. తమ తండ్రి కంగల వెంకటేశ్వర్లుకు దేవరపల్లిలో 10.68 ఎకరాల భూమి కలదు. సర్వే నెంబర్ 69/1లో ఒక ఎకరం భూమిని తమ ప్రమేయం లేకుండా అక్కిసబాలు అనే వ్యక్తి బినామీలతో అక్రమంగా పట్టా మార్చించుకున్నాడు. ఈ సమస్యపై ఐదేళ్లుగా పలుమార్లు అధికారులకు అర్జీలు ఇచ్చిన చర్యలు తీసుకోలేదు. పైగా తమపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారు. వారిపై చర్యలు తీసుకొని తమ సమస్యను పరిష్కరించాలని అభ్యర్థించారు