– సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గని శెట్టి సత్యనారాయణ
పరవాడ: బొగ్గు లారీలు ప్రేయాస్ లారీల కాలుష్యం అరికట్టాలని లంకెలపాలెం ప్రజల ఆరోగ్యాలను కాపాడాలని డిమాండ్ చేస్తూ లంకెలపాలెంలో సిఐటియు ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గని శెట్టి సత్యనారాయణ మాట్లాడుతూ, హిందూజా బొగ్గు లారీలు పరిమితికి మించి అధిక లోడలతో ప్రయాణించడం వలన తీవ్రమైన కాలుష్యం వెదజల్ల పడుతుందని , దీనికి తోడు ఎన్టిపిసి ప్రేయాస్ లారీలు అధికలోడుతో ఏ విధమైన తార్పానాలు కట్టకుండా ప్రయాణించడం వలన తీవ్రమైన ధూళి కాలుష్యంతో ఈ ప్రాంత ప్రజలు కాలుష్య కోరల్లో చిక్కుకొని అల్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
పరవాడ ఫార్మాసిటీ నుండి వెదజల్లుతున్న కాలుష్యానికి , బొగ్గు లారీలు కాలుష్యం లారీల కాలుష్యం తో ప్రజలు ఒక్కరి బిక్కిరి అవుతున్నారని అన్నారు. ఆర్టీవో పోలీస్ రెవెన్యూ అధికారులు ఈ వాహనాలపై దాడులు నిర్వహించి ప్రజల ఆరోగ్యాలను కాపాడాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో భారీ ఎత్తున ఉద్యమం చేపడతామని గనిశెట్టి హెచ్చరించారు.
లంకెలపాలెం లో షాపులు మూసుకోవాల్సి వస్తుందని, ఆటోలు నడపలేని పరిస్థితి ఏర్పడిందని ముఠా కార్మికులకు పనులు లేక పస్తులు గడుపుతున్నారని రోడ్డుకి ఇరువైపులా ఉన్నాయి. ఇంటిలో ఉండలేని పరిస్థితి ఏర్పడుతుందని వెంటనే బొగ్గు లారీలు ధూళి లారీలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు కర్ణం వెంకట్రావు, ఖాతా వెంకటస్వామి, వి పద్మ, ఎస్. నానాజీ అమ్మ, అప్పారావు, శ్రీను, కనకారావు, తదితరులు పాల్గొన్నారు