– పదో తరగతి పిల్లాడు హంతకుడైన విషాదం
– పిల్లలను పట్టించుకోని తలిదండ్రులదే ఆ బాధ్యత
– సంపాదన-పనుల్లో పడి పిల్లలను గాలికొదిలేస్తే ఎలా?
– మీ సంపాదన ఎవరికోసం?
– పిల్లలను పట్టించుకోని సంపాదన వల్ల ఫలితమేంటి?
కొద్దిరోజుల క్రితం పేపర్లు, టీవీల్లో చూసిన వార్త.. దాని నేపథ్యం చూస్తే, మనసున్న ఎవరికైనా హృదయం ద్రవించకమానదు. ఒక పదవ తరగతి విద్యార్ధి దొంగతనానికి పక్కా పథకంతో వెళ్లి, అక్కడున్న ఒక అమ్మాయిని 18 సార్లు కిరాకంగా పొడిచి చంపటం నాగరిక ప్రపంచానికే సిగ్గుచేటు.
అంత చిన్న వయసులో ఆ పిల్లవాడిలో నేరప్రవృత్తి పెరగడానికి, అలాంటి ఉన్మాద ఆలోచనలను ప్రాణం పోసుకునేందుకు కారణమేంటి? కారకులెవరు?.. పిల్లల తలిదండ్రులు ఏం చేస్తున్నారు? పిల్లలను స్కూళ్లలో చేర్పించి, ఫీజులు కట్టడంతోనే వారి బాధ్యత తీరిపోతుందా? తమ పిల్లలు ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? వాళ్లేం చేస్తున్నారు? వాళ్లకు ఏం కావాలి? అని ఎప్పుడైనా ఆలోచిస్తున్నారా? అసలు వారికోసం ఏమైనా సమయం కేటాయిస్తున్నారా?
బతకడానికి డబ్బు అవసరమే. కానీ అది పిల్లలతో గడిపి, వారిని సక్రమమార్గంలో నడిపించలేని డ బ్బు సంపాదించి ఏం లాభం? అసలు ఆ పదవ తరగతి పిల్లవాడు హంతకుడు కావడానికి కారకులు ఎవ రో ప్రతి తలిదండ్రీ ఆత్మవిమర్శ చేసుకోవాల్సిందే. ఇది ఓ సగటు మాతృమూర్తి ఆవేదనకు అక్షరరూపం. పదవ తరగతి అబ్బాయి దొంగతనానికి పక్కా స్కెచ్ వేసుకొని (బుక్ లో రాసుకొని) మరీ వెళ్లి, అక్కడ ఉన్న చిన్న పిల్లని అతి కిరాతకంగా 18 సార్లు పొడిచి చంపాడు అంటే..
వాడిలోని క్రూరత్వం ఏమిటో మీ ఊహలకే వదిలేస్తున్నాను. చెప్పాలంటే…
పిల్లలను పెంచాలంటే, ఇప్పుడు తల్లిదండ్రులలో ఏమాత్రం అవగాహన లేకుండా ఉన్నారు.
తండ్రేమో పిల్లలను చదివించాలి.. వారిని పోషించాలి అని బిజినెస్, ఉద్యోగాల రీత్యా బిజీగా ఉంటాడు. మిగిలిన సెలవు దినాలను ఎలా ఎంజాయ్ చేయాలి? ఎలా ట్రిప్పులు వేయాలి? ఎలా తాగాలి? ఎలా ఊగాలి అనే ప్లాన్లు వేస్తున్నాడు తప్ప.. పిల్లల్ని పట్టించుకోవట్లేదు.
ఇక తల్లి ఏమో ఇంట్లో వంటలు చేయాలి. బయట పనులు అన్ని తనే చేసుకోవాలి. అన్ని సర్దుబాట్లు తనే చేస్తూ ఉండాలి. టీవీలు, సెల్లులకి అతుక్కుపోయి రీల్స్ చేస్తూ నలుగురులో గుర్తింపు పొందాలి. మేకప్ ఎలా వేయాలి? ఏ చీర కొనాలి? ఎలా బ్లౌజ్ కుట్టించుకోవాలి? పెళ్లిళ్లు, ఈవెంట్స్ లో అందరి అటెన్షన్ తన మీదే ఉండాలని ప్రయత్నిస్తున్న తల్లులే ఎక్కువమంది ఉన్నారు. ఇక్కడ రూ అలాగే ఉన్నారని కాదు. కానీ ఎక్కువమంది వ్యవహారశైలి ఇదేనన్నది నిష్ఠుర నిజం. కాదంటారా?.. ఒక్కసారి గుండెలపై చేయి వేసి చెప్పండి?!
ఇప్పుడు మాక్సిమం పిల్లలు సెల్లులకి అడిక్ట్ అయి ఫ్రెండ్షిప్ గోలల్లో చెడు అలవాట్లకు మరిగి, వాటికి బానిసలై అవి కొనాలంటే డబ్బులు కావాలి కాబట్టి, ఇంటా బయట చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ చెడిపోతున్నారు.
మాక్సిమం 7th, 8th క్లాస్ పిల్లాడి చేతిలో ఐఫోన్ ఉంటుంది.
టెన్త్ క్లాస్ పిల్లోడికి డ్యూక్, స్పోర్ట్స్ బైక్ కావాలి. గర్ల్ ఫ్రెండ్ ఉండాలి. అన్ని వికృతపు అలవాట్లు (సిగరెట్, మందు, డ్రక్స్). ఇంటర్ కి వచ్చేలోపే అలవడుతున్నాయి.
పిల్లలు ఇంతలా చెడిపోయేంత వరకు ఆ తల్లిదండ్రులు ఏం చేస్తూ ఉంటారు?
పిల్లల్ని కూడా పట్టించుకోలేనంత బిజీగా ఏం చేస్తుంటారు?
అసలు మీరు ఎంత బిజీ లైఫ్ అనుభవిస్తున్నది.. ఏదైనా చేయాలనుకుంటున్న దంతా పిల్లల కోసమే కదా?
మరి మీ బిజీ వల్ల ఆ పిల్లలే చెడిపోతుంటే మీరు ఎంత సంపాదించి ఏం లాభం?
ఇదిగో పరిష్కారం మార్గం..ఒక క్రైమ్ జరిగితే మీడియా లో దాని వివరాలు పూస గుచ్చినట్టు దృశ్య రూపంలో చూపుతారు.
ప్రజలు అయ్యో కుయ్యో అని పోస్ట్ లు పెడుతారు.
అంతే.. తర్వాత దాన్ని మరిచిపోతారు.
మరుసటి రోజు ఇంకో ఫ్రెష్ క్రైమ్.
ప్రభుత్వం- మీడియా. పోలీసులు- మేధావులు భలేభలే నిద్ర నటిస్తున్నారు.
1 . 18 లోపు పిల్లలకు మొబైల్ ఇవ్వకూడదు.
2 . ఓటిటి ఫిలిమ్స్ రీల్స్ సినిమాల్లో హింసాత్మక దృశ్యాలపై సెన్సార్ ఉండాలి.
3 . క్రైమ్ పోర్న్ లాంటివాటి డేటా వినియోగానికి, డేటా ఛార్జ్ లు వందరెట్లు పెంచాలి.
4 క్రైమ్ చేసిన వారిని బహిరంగంగా ఉరి తీయాలి.
5 . జువైనైల్ చట్టాన్ని సవరించి, హత్య చేసిన మైనర్ లకు కూడా పెద్దవారి లాగే శిక్ష విధించాలి.
– అడపా వరలక్ష్మి
(సోషల్ ఆక్టివిటీస్, హెవెన్ హోమ్స్ సొసైటీ ఎన్జీవో, ఫౌండర్ ప్రెసిడెంట్, సోషల్ ఎంటర్ ప్రైనర్)