– మంత్రి అనగాని సత్యప్రసాద్
అమరావతి: కోస్తాంధ్రకు భారీ వర్ష సూచన నేపథ్యంలో రెవెన్యూ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి. ఉపరితల అవర్తనం ప్రభావంతో కోస్తాంధ్రకు ఆరెంజ్ అలెర్జ్ జారీ చేయడంతో ఎక్కడిక్కడ అధికారులంతా సహాయ చర్యలకు సిద్దంగా ఉండాలని రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్, స్టాంప్స్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ సూచించారు. ఉత్తరాంధ్ర, అల్లూరి, ఏలూరు, ఉమ్మడి కృష్ణా జిల్లాల్లో ప్రజలను అప్రమత్తం చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు.
ప్రకాశం బ్యారేజీ నుండి 3 లక్షల క్యూసెక్యులకు పైగా నీరు వస్తుండడంతో కృష్ణా నది పరిహార ప్రాంత ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. లోతట్టు ప్రాంతాల ప్రజలను వెంటనే సురక్షిత ప్రాంతాలకు, ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు తరలించాలన్నారు. కోస్తాంధ్ర తీరంలో అల్పపీడనం నేపథ్యంలో మత్య్యకారులెవ్వరూ వేటకు వెళ్లవద్దని హెచ్చరిస్తున్నాం. ప్రజలెవరూ ఆందోళన చెందవద్దు. ఎటువంటి వరద విపత్తు అయినా ఎదుర్కొనేందుకు, ప్రజల ప్రాణ,ఆస్తి రక్షణకు రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధంగా ఉందన్నారు.