– విశాఖ పార్టీ ఆఫీసులో ప్రజలు, కార్యకర్తలకు మంత్రి లోకేష్ హామీ
విశాఖపట్నం: వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు విశాఖ చేరుకున్న విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్.. గురువారం సాయంత్రం విశాఖ పార్టీ కార్యాలయానికి పెద్దఎత్తున తరలివచ్చిన ప్రజలు, కార్యకర్తలను కలుసుకున్నారు. ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించి, పలు సమస్యలపై వారి నుంచి స్వయంగా అర్జీలు స్వీకరించారు. ప్రతి విజ్ఞప్తిని పరిశీలించారు. ఆయా సమస్యల త్వరితగతిన పరిష్కారానికి కృషిచేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం అందరితో కలిసి ఫోటోలు దిగారు.