– మంత్రి వర్గంలో 8 స్థానాలు ఇవ్వాలి
– ఇద్దరికే మంత్రి గా అవకాశం ఇచ్చారు
– ఢిల్లీ లో ధర్నా చేసిన తరువాత ప్రధాని, రాష్ట్రపతి కలిశారా ?
– రాష్ట్రంలో బీసీ కాంట్రాక్టర్స్ ఒక్కరు లేరు
– మ్యానిఫెస్టో ఇచ్చిన హామీల పై శ్వేతపత్రం విడుదల చేయాలి
– మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీ ఎల్ రమణ
హైదరాబాద్: కామారెడ్డి డిక్లరేషన్ తోనే కాంగ్రెస్ గెలిచింది. బీసీ ల ఓట్లు వేయించుకొని బీసీ లను కాంగ్రెస్ మోసం చేసింది. రాష్ట్రంలో బీసీ కాంట్రాక్టర్స్ ఒక్కరు లేరు. కాంగ్రెస్ కి బీసీ ల పై మనసు అంత విషమే.
కేసీఆర్ తెచ్చిన చట్టం ని సరవరించ వచ్చుకదా? పోయినంత కాలం కేసీఆర్ ని అంటే ప్రజలు కాంగ్రెస్ ని నమ్మరు. కేసీఆర్ ఒక్క ఎంపీ గా ఉండి తెలంగాణ తెచ్చారు. 311 మంది ఎంపీ లు ఉన్న మీరు ఎందుకు బీసీ బిల్ ని పాస్ చేయించడం లేదు? ఢిల్లీ లో ధర్నా చేసిన తరువాత ప్రధానమంత్రి ని రాష్ట్రపతి కలిశారా ?
ఆర్డినెన్స్ తెస్తా అన్నారు.ఏమైంది? గవర్నర్ పంపిన ఆర్డినెన్స్ పై ఇంకా క్లారిటీ రాలేదు. జీవో తెస్తున్నామని మళ్ళీ కాంగ్రెస్ కొత్త డ్రామా స్టార్ట్ చేసింది. ప్రతి పక్షాలు ఎందుకు కోర్ట్ కి పోతాయి? 20 నెలల నుంచి జీవో ద్వారా ఎన్నికలకు ఎలా పోవాలన్నది కాంగ్రెస్ కి తెలియలేదు. మా పార్టీ 42 శాతం కి వ్యతిరేకం కాదు. రిజర్వేషన్లు ఉంటే అక్కడ బీసీ లు గెలుస్తారు. మాకు భిక్ష కాదు. రాజ్యాంగం కల్పించిన హక్కు.
బీసీ లను అవమానపరుస్తున్నారు. చట్ట బద్దత తోనే ఎన్నికలకు పోవాలి. రకరకాల మోసం జరుగకుండా ఉండాలంటే రిజర్వేషన్లు అమలు చేయాలి. ఒక్కరే పార్లమెంట్ సభ్యుడు గా ఉండి కేసీఆర్ తెలంగాణ తెచ్చారు. తమిళనాడు మాదిరి కాంగ్రెస్ భూ స్థాపితం అవుతుందని, కామారెడ్డి డిక్లరేషన్ ప్రకటించారు. 5 ఏళ్లలో లక్ష కోట్లు బీసీ ల కోసం ఖర్చు అన్నారు. ఏమైంది ?
రాష్ట్ర మంత్రి వర్గంలో 8 స్థానాలు ఇవ్వాలి.ఇద్దరికి మంత్రి గా అవకాశం ఇచ్చారు. మోసానికి పరాకాష్ట కాంగ్రెస్. పిల్లి కళ్లు మూసుకొని పాలు తగినట్లు కాంగ్రెస్ ది ఇప్పుడు బయట పడుతుంది. రాష్ట్రపతి , ప్రధాని వద్దకు తీసుకెళ్ళలేదు. ఢిల్లీ లో తూతూ మంత్రంగా ధర్నా చేశారు. ఎన్నికల మ్యానిఫెస్టో ఇచ్చిన హామీల పై శ్వేతపత్రం విడుదల చేయాలి. కాంగ్రెస్ స్వార్ధపూరిత రాజకీయాలకు పరాకాష్ట.
ప్రెస్ మీట్ లో బీసీ కమిషన్ మాజీ సభ్యులు కిషోర్ గౌడ్ ,శుభప్రద్ పటేల్ ,బీ ఆర్ ఎస్ నేత గౌతం ప్రసాద్ పాల్గొన్నారు.