– రూ.125 కోట్ల నిధులకు ప్రతిపాదనలు
– అమృత్ పథకం పనుల పై సమీక్ష
– మంత్రి నారాయణతో కలిసి పెమ్మసాని ఎమ్మెల్యేల సమావేశం
గుంటూరు: గుంటూరును మరింత అభివృద్ధి పరచేందుకు పెమ్మసాని ఇన్నర్ రింగ్ రోడ్డుతో పాటు స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ ప్రతిపాదనలను సిద్ధం చేస్తున్నారు. ఇందుకు మున్సిపల్ శాఖ మంత్రి నారాయణతో స్థానిక ఎమ్మెల్యేలు నసీర్ అహ్మద్ , గల్లా మాధవి, రామాంజనేయులు తో కలిసి ఆయన తన క్యాంపు కార్యాలయంలో శనివారం సమీక్ష చేపట్టారు. ఇందులో భాగంగా రూ 48 కోట్లతో ప్రారంభం కానున్న ఇన్నర్ రింగ్ రోడ్డు పనులను తాత్కాలికంగా ఆపి, ఇన్నర్ రింగ్ రోడ్డు తో పాటు మరో రూ. 70 కోట్ల వ్యయంతో స్ట్రాం వాటర్ డ్రైన్ నిర్మాణం కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలని నిర్ణయించారు. వెరసి రూ. 128 కోట్ల వ్యయంతో ఇన్నర్ రింగ్ రోడ్డుతో పాటు స్ట్రాంగ్ వాటర్ ట్రైన్లను చేపడితే గుంటూరు శివారు ప్రాంతాల్లో రాకపోకల ఇబ్బందులు పూర్తిగా పరిష్కారం అవుతాయని సమీక్షలు చర్చించారు. ఇందుకు మంత్రి నారాయణ కూడా సుముఖత వ్యక్తం చేశారు.
అమృత్ పథకం ద్వారా చేపడుతున్న గోరంట్ల ట్యాంక్ పనులను కూడా వేగవంతం చేయాలని, అమృత్ 2.0 టెండర్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఈ సందర్భంగా చర్చించారు. ఈ సమావేశంలో జిఎంసి కమిషనర్ పులి శ్రీనివాసులు గారు, సి ఆర్ డి ఏ ఇంజనీరింగ్ చీఫ్ కృష్ణారెడ్డి గారు, పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ ప్రభాకర్ గారు తదితర అధికారులు పాల్గొన్నారు.