– తన వ్యాసాలను ప్రచురిస్తున్నందుకు సాక్షికి కరణ్ థాపర్ డబ్బులు ఇస్తున్నాడా?
– కరణ్ థాపర్ వ్యాసాలు తెలుగు ప్రజలకు పనికొచ్చేవి కావు
– తెలుగు ప్రజలు మెచ్చేవి కావు
– అయినా సాక్షి ఎందుకు కరణ్ థాపర్ వ్యాసాలను తెగ ప్రచురిస్తోంది?
– కరణ్ థాపర్ వాంతులను దోసిళ్లతో పట్టి సాక్షి తెలుగు పాఠకులపై పోస్తూండడం గర్హనీయం
‘అడకత్తెరలో ఇండియా’ శీర్షికతో సాక్షి ఎడిట్ పేజ్‌లో ‘మహా మేధావి’ కరణ్ థాపర్ వ్యాసం చదివాక…
కరణ్ థాపర్ గురించి దేశమంతా తెలిసిందే! హిందువులు, దేశ ప్రయోజనాలు, దేశ సార్వభౌమత్వం, ప్రజాస్వామ్యం, కేంద్ర ప్రజా ప్రభుత్వం వీటికి వ్యతిరేకమైన పోకడతో, విదేశీ మతాలు, మాఫిఅలకు సానుకూలమైన పోకడతో కరణ్ థాపర్ తన ‘విపరీత మేధ’ను ‘అదేపనిగా’ వెచ్చిస్తూ పనిచేస్తూండడం మనకు చాలా కాలంగా స్పష్టంగా తెలుస్తూనే ఉంది.
దేశ ప్రయోజనాల వ్యతిరేకతతో, భారతీయతా వ్యతిరేకతతో ‘ఒక మేధావి’ అయిపోయిన కరణ్ థాపర్ ‘అడకత్తెరలో ఇండియా’ వ్యాసంలో ‘దేశం, దేశ ప్రతిష్ఠ అన్న స్పృహ’ లేకుండా అమేరిక అనుకూల భావజాలంతో తన మేధను మరోసారి వాంతి చేసుకున్నాడు.
ట్రంప్ ధోరణిని ఇండియా అత్యంత దీటుగా దెబ్బకొడుతూండడం క్షేత్రవాస్తవం! మొత్తం ప్రపంచం ఈ విషయంగా మనదేశాన్ని తప్పుపట్టలేకపోతోంది; దేశ ప్రజ కూడా మోదీ ప్రభుత్వానికి అండగా నిలబడింది! ఈ పరిస్థితిలో కరణ్ థాపర్ ఇలాంటి పనికిమాలిన వ్యాసం రాయడం అతడి అమేరిక బానిసత్వాన్ని, దేశ ప్రజా ప్రభుత్వ వ్యతిరేకతను గట్టిగా పట్టిస్తోంది
‘రష్యా కోసం మూల్యం చెల్లిస్తున్నామా?’ అని కరణ్ పేలాపన చెయ్యడం పూర్తిగా గర్హనీయం. రష్యా ఆది నుంచీ మనకు మిత్రదేశమే. మనదేశం రష్యాతో ఉండడం మనకు ఎప్పటికీ అవసరమే. ‘రష్యా కోసం మూల్యం చెల్లిస్తున్నామా?’ అనడం మనదేశ విధానంపై విషం చిమ్మే ప్రయత్నంగానే పరిగణించాల్సి ఉంటుంది.
అమేరిక ట్రంప్‌పై ప్రస్తుత పరిస్థితిలో ‘భారత కేంద్ర ప్రజా ప్రభుత్వ ఆత్మస్థైర్య విధానం’ తప్పు అన్న ఆలోచనను పరోక్షంగా కలిగించేదిగానూ, ఏ లోపాయకారీ లబ్ది కోసమోనో కరణ్ థాపర్ వెళ్లగక్కిన ‘విపరీత మేధ’ గానూ ఈ వ్యాసం తెలియవస్తోంది. ఏ కొందరినైనా దేశ విధానాలకు వ్యతిరేకం చెయ్యడమే, దేశ ప్రతిష్ఠను దెబ్బకొట్టడమే ‘ఈ వ్యాసం లక్ష్యాలు’ అన్న భయం కూడా కలుగుతోంది!
కరణ్ థాపర్ వాంతులను దోసిళ్లతో పట్టి క్రమం తప్పకుండా సాక్షి పత్రిక ఎందుకు తెలుగు పాఠకులపై పోస్తోంది? వాస్తవానికి ఈ కరణ్ థాపర్ వ్యాసాలు తెలుగు ప్రజలకు పనికొచ్చేవి కావు; తెలుగు ప్రజలు మెచ్చేవి కావు. అయినా సాక్షి ఎందుకు కరణ్ థాపర్ వ్యాసాలను తెగ ప్రచురిస్తోంది?
తన వ్యాసాలను ప్రచురిస్తున్నందుకు సాక్షికి కరణ్ థాపర్ డబ్బులు ఇస్తున్నాడా? ‘దేశ వ్యతిరేక విదేశాల మాఫియాల నుంచి, కరణ్ లబ్ది పొందుతూంటాడు’ అన్న మాట దేశ వ్యాప్తంగా చాల కాలంగా వినిపిస్తోంది… అలాంటి కరణ్ థాపర్ వ్యాసాలను ప్రచురిస్తూ ‘సాక్షి కూడా దేశ, ప్రజా వ్యతిరేక లబ్ది పొందుతోంది’ అని అనుకోవచ్చా?
హిందూ వ్యతిరేక, కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక, దేశ వ్యతిరేక వ్యాసాలతో సాక్షి ఏ లాభాన్ని పొందుతోంది? సాక్షి లాభపడడానికి తెలుగు హిందువులు బలి కావాలా? ఆలోచించాల్సిన అతి ముఖ్యమైన విషయం ఇది. హిందువులు, దేశాభిమానులు అయిన తెలుగు పాఠకులు సాక్షి విషయంలో అప్రమత్తంగానూ, సరైన ఆలోచనతోనూ ఉండాలి.
ఆత్మస్థైర్యంతోనూ, ప్రధాని మోదీ నేతృత్వంలోనూ కేంద్ర ప్రజా ప్రభుత్వం ట్రంప్ దాష్టీకాన్ని సమర్థవంతంగా ఎదుర్కొంటున్న ప్రస్తుత పరిస్థితిలో కరణ్ థాపర్ ఇలాంటి దేశ వ్యతిరేక వాంతులు చెయ్యడం, ఆ కరణ్ థాపర్ వాంతులను దోసిళ్లతో పట్టి సాక్షి తెలుగు పాఠకులపై పోస్తూండడం తీవ్రంగా గర్హనీయం. సాక్షి దేశ, కేంద్ర ప్రజా ప్రభుత్వ వ్యతిరేక ఎకో సిస్టమ్ ప్రతినిధిగా వ్యవహరిస్తోందా?
‘అడకత్తెరలో ఇండిఅ ఉందా?’ దేశ వ్యతిరేకమైన ఈ ప్రశ్నకు పెద్ద శాతం దేశ పౌరులు ప్రశ్నను, ప్రశ్నించిన అధముల్ని అసహ్యించుకుంటూ “లేదు” అని గట్టిగా చెబుతారు! ఈ ‘క్షేత్రవాస్తవ స్పృహ’ కూడా లేకుండా అడకత్తెరలో ఇండియా ఉంది అన్న ‘భయాన్ని’ కలిగించే కరణ్ థాపర్ విపరీత మేధను, ఆ మేధను తెలుగుకు తెచ్చిన సాక్షిని లేదా సాక్షి సంపాదక ‘మేధా బృందాన్ని’ తెలుగువాళ్లమైన మనం ‘అసహ్యించుకోవడం సహజమైన పరిణామం’ అవుతుంది కదా?
– రోచిష్మాన్
9444012279