– దుర్గమ్మను ప్రార్థించిన మాధవ్
విజయవాడ: ఇంద్రకీలాద్రి పై దుర్గమ్మను బీజేపీ ఏపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా వేద పండితులు వేదాశీర్వచనం అందించారు. ఈ సందర్భంగా మాధవ్ మాట్లాడారు. గాయత్రి దేవి అలంకారంలో ఉన్న అమ్మవారిని దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నా… భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేసినందుకు సంతోషంగా ఉంది… చక్కటి ఏర్పాట్లు చేసిన ప్రభుత్వానికి, అధికారులకు అభినందనలు.
అమ్మవారి కరుణా కటాక్షాలు అందరిపైనా ఉండాలి. అందరి జీవితాలు అభివృద్ధి చెందాలని కోరుకున్నా.. మన ధర్మానికి ఆటంకం లేకుండా చూడాలని అమ్మవారిని ప్రార్థించినట్టు మాధవ్ తెలిపారు.