– ఆల్ రౌండర్లను ఎంపిక చేసిన వైకాపా!
చెప్పులు లేకుండా సిమెంట్ కాలువలో పాదాలు పెట్టి, తిరుపతిలో రోడ్డు ప్రక్కనే ఇలా కూర్చున్నాడు.
వైసీపీ ఆఫిషియల్ ప్యానలిస్ట్ గా ఈ పసుపులేటి సురేష్ ని జగన్ ఆదేశాలతో నియమించారు. ఇదే వారి స్థాయి, ఇదే వారి సంస్కృతి కాదు. సమాజంలో.. అందునా తిరుపతి నుండి ఇలాంటి వారు తప్ప ప్రజా సమస్యలపై మాట్లాడడానికి వైకేయులకు ఎవరూ దొరకరు కదా?!
ఇదే బాటిల్ ఇతను తీసుకెళ్లి.. అలిపిరి దగ్గర భక్తుల టికెట్ కౌంటర్ వద్ద లేదా మెట్ల మార్గంలో వదిలేసి వీడియో తీసుకుని వస్తే.. కోట్లాది భక్తుల మనోభావాల కోసం పోరాటం చేసుకోవచ్చు భూమన కరుణాకర్ రెడ్డి. ఇలా ఆల్ రౌండర్ ప్రతిభావంతులను ప్రత్యేకంగా ఎంపిక చేసినట్లున్నారు.
అందునా చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్, టీడీపీ, జనసేన నాయకులను విమర్శించే అర్హత వీరికే ఉందని, జగన్ తీవ్ర మేధో మథనం చేసి మరీ ఎంపిక చేసినట్లున్నారు. 5 రూపాయల పనిమంతులు ఇలాంటి వారి మాటలను తిప్పాలి. అది వారి పూర్వ జన్మ పాప కర్మ.
ఒక ఫోటో పెడితే ఊరుకోలేదు వైకాపా అభిమానులు! తమ అధినేత జగన్, కరుణాకర్ రెడ్డిల ముందుచూపు అందరికీ తెలిసేలా చేశారు.
వాలంటీర్ వాసు తరహాలోనే వైసీపీ అఫీషియల్ మీడియా ప్యానలిస్ట్ పసుపులేటి సురేష్ వైరల్ అయ్యాడు. ఆ ఫోటో చూసి, పక్కన ఉన్న మద్యం సీసా మార్ఫింగ్ అన్నారు. 5 హెచ్‌పీ మోటార్ ప్రెజర్‌తో.. నోరే ఒక ఇంచి పైపులా కక్కే ఈ వీడియో చూపే వరకు వదిలిపెట్టలేదు.
తిరుపతిలో ఆ సీసాలు, తినకుండా మిగిలిన బిర్యానీ ప్యాకెట్లు తీసుకెళ్లి భక్తులు రద్దీగా ఉండే అలిపిరి పరిసర ప్రాంతాల్లో పడేసి, వీడియోలు తీసుకొని, ఇంటికి వచ్చి తలస్నానం చేసి, భక్తుల మనోభావాల గురించి గుండెలు బాదుకునే ఆల్‌రౌండ్ ప్రతిభను వెలికితీయడానికి, భూమన రికమెండ్ చేస్తే.. జగన్ తమ పార్టీ మీడియా ప్యానలిస్ట్‌గా నియమించారా?
-చాకిరేవు