అధికార పదవి కన్నా, ప్రజా విశ్వాసమే గొప్పది.
మన సమాజంలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు అంటే మేధస్సు, క్రమశిక్షణ, దూరదృష్టి అనే ప్రతీక.
అలాంటి ఇద్దరు ప్రముఖులు — (జెపి), (జేడీ) — తమ ఉన్నత ఉద్యోగాలను వదిలి రాజకీయాల్లోకి వచ్చారు. లక్ష్యం ఒక్కటే — సమాజ మార్పు.
కానీ రాజకీయాల్లో ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయారు. దీనిని పరాజయంగా చూడాలా? లేక సమాజానికి ఇచ్చిన గొప్ప పాఠంగా భావించాలా?
వారి ప్రయాణం చెబుతున్న నిజాలు….,
తెలివితేటలు ఉన్నంత మాత్రాన ప్రజా నాయకత్వం సాధ్యం కాదు. ప్రజా భావజాలం అర్థం చేసుకోవడం రాజకీయాల్లో కీలకం. నీ పార్టీ సిద్ధాంతం నీకు గొప్ప కావచ్చు, కాని ప్రజలకు అది అవసరం లేదు.
సిద్ధాంతం మాత్రమే సరిపోదు — ప్రజలతో అనుబంధం, మమేకం, ప్రజల పట్ల మాట తీరు, నీ ప్రవర్తన, నీ పద్దతి, నీ నడవడిక యిది గమనిస్తారు. వ్యవస్థను మార్చాలంటే ప్రజలే మారాలి. వారి ప్రయాణం మనకు ఒక గొప్ప సందేశం ఇస్తుంది. పదవి గొప్పది కాదు. ప్రజల విశ్వాసమే నిజమైన విజయము. విమర్శించడం సులభం. ప్రయత్నించడం కష్టం. అందుకే ప్రయత్నించిన వారిని చరిత్ర గౌరవిస్తుంది.
మీ అభిప్రాయం ఏమిటి? వారు రాజకీయాల్లో విఫలమయ్యారా? లేక సమాజానికి మార్గదర్శకులా?
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో కుల రాజకీయo, డబ్బు రాజకీయం ప్రముఖ పాత్ర పోషిస్తుంది. అలా అని వంద శాతం అదే కాదు. రాజకీయ అనిశ్చితి లేదు, అణిచివేత లేదు, దుర్మార్గం లేదు, క్రమశిక్షణ, ముందుచూపు, విజన్ ఉన్న నాయకత్వం ఉండటం వలన అవకాశం రాలేదు, అంతకు మించి ప్రజలు వీళ్ళని రాజకీయ నాయకులు లా చూడలేదు. ఒక విజ్ఞానవంతులు లా చూశారు. ప్రజలు ఏమి పక్కన పెట్టలేదు. రాజకీయ శూన్యం లేదు అంతే. అయినా ప్రజా సేవ కు రాజకీయాలు ఒక్కటే వేదిక కాదు. పలు రకాల మార్గాలు ఉన్నాయి. రాష్ట్ర అభివృద్ధి కి వారి యిద్దరి సలహాలు, సూచనలు అవసరం స్వీకరిద్దాం.
– మల్లిన రాధాకృష్ణ
తణుకు