‘మార్ఫింగ్’ రత్నాలు.. పుడి వారి చిత్ర విచిత్రాలు!
వైకాపా పీ ఆర్ మీడియా విభాగం అంటే ఏదో ప్రెస్ నోట్లు రిలీజ్ చేసే చోటు అనుకుంటే పొరపాటే.. అది ఒక హై-టెక్ ‘ఫోటోషాప్ యూనివర్సిటీ’. అక్కడ వైస్ ఛాన్సలర్ మన శ్రీహరి గారు.
వీరి స్పెషాలిటీ ఏంటంటే:
కత్తి పెట్టడం: చంద్రబాబు గారి చేతిలో కత్తి పెట్టడం.. అది కూడా ఎంత ‘రియలిస్టిక్’గా అంటే, చూసేవాడికి కత్తి నిజమో కాదో తెలీదు కానీ, చేసేవాడికి బుర్ర లేదని మాత్రం గ్యారెంటీగా తెలిసిపోతుంది!
రక్తపు మరకలు: బట్టల మీద మరకలు అద్దడంలో వీరు వాషింగ్ పౌడర్ నిర్మ ను కూడా భయపెట్టగలరు. సెకన్లలో ఎవరినైనా ‘హంతకుడి’గా మార్చేయగల అద్భుత హస్తం వీరిది.
హ్యాష్‌ట్యాగ్ స్పెషలిస్ట్: “హంతకుడు_చంద్రబాబు” అని ట్యాగ్ పెడితే చాలు.. ఊరికే ఉండిపోతారా? దాన్ని ఊరూవాడా వైరల్ చేయడానికి ఊరుకొక సైకో 5 రూపాయల సోషల్ మీడియా సైన్యం!
ఆపరేషన్ ‘మార్ఫింగ్’ ఫెయిల్..
పాపం, శ్రీహరి గారు తన క్రియేటివిటీని తప్పుగా వాడారు. ల్యాప్‌టాప్, మ్యాక్బుక్ల్లో ‘ఎడిటింగ్’ చేసుకుంటే సరిపోతుంది అనుకున్నారు కానీ, పోలీసులు వచ్చి ‘డిలీట్’ బటన్ నొక్కకుండా నేరుగా ‘అరెస్ట్’ బటన్ నొక్కుతారని పాపం ఊహించలేదు.
ఇప్పుడు పరిస్థితి
ముందు “మేము సోషల్ మీడియా వారియర్స్” అని బిల్డప్ ఇచ్చారు. తీరా పోలీసులు పట్టుకునేసరికి, అటు నుంచి హైకోర్టులో ‘హేబియస్ కార్పస్’ పిటిషన్లు! అంటే “మా వాడు కనిపించడం లేదు.. ఎవరో సివిల్ డ్రెస్సులో వచ్చి ఎత్తుకెళ్లారు” అని కొత్త కథ. బాబోయ్.. ఈ స్క్రిప్ట్ రైటింగ్ లో కూడా వీరికి వీరే సాటి!
నీతి: ఫోటోషాప్‌లో లేయర్లను మార్చినట్టు.. నిజ జీవితంలో చట్టం ముందు లేయర్లు మార్చడం కుదరదు తమ్ముడూ!
బాంబుల డీఎన్ఏ వాడి దగ్గర ఉంటూ వేరే వారికి కత్తితో ఫోటోలు వేస్తే.. చివరకు ‘కటకటాలు’ లెక్కపెట్టాల్సి వస్తుంది.
బాటమ్ లైన్: నాడు “రావాలి జగన్.. కావాలి జగన్” అన్నారు.. ఇప్పుడు చూస్తే “రావాలి బెయిల్.. ఇవ్వాలి బెయిల్” అని శ్రీహరి గారి డ్రైవర్ కోర్టు మెట్లెక్కుతున్నారు.
– చాకిరేవు