వయసు 40 – అహంకారం తగ్గే వేళ : చదువు, తెలివితేటల కంటే అనుభవమే గొప్పదని అర్థమవుతుంది. లోకజ్ఞానం ముందు డిగ్రీలు తలవంచుతాయి.
వయసు 50 – రూపం మారే వేళ : ప్రకృతి ముందు అందం తాత్కాలికం. లోపలి వ్యక్తిత్వమే అసలైన నిరంతర సౌందర్యం అని బోధపడుతుంది.
వయసు 60 – హోదా వీడే వేళ : కుర్చీ ఉన్నంతవరకే గౌరవం, కుర్చీ దిగాక అందరూ సామాన్యులే. ‘నేను’ అనే అహంకారం ఇక్కడే సమాధి అవుతుంది.
వయసు 70 – అవసరం తగ్గే వేళ : సామ్రాజ్యాలు ఉన్నా, పడుకోవడానికి ఆరు అడుగుల స్థలం, పలకరించే నాలుగు మంచి మనసులు ఉంటే చాలనిపిస్తుంది.
వయసు 80 నుండి 100 – శూన్యం : ఇక్కడ సంపద, బంధాలు, చివరకు స్పృహ కూడా మనల్ని వీడతాయి.
మనం మోస్తున్న టెన్షన్లు, పగలు, అసూయలు అన్నీ ఒక నీటి బుడగ లాంటివి. రేపు ఎలా ఉంటుందో తెలియని ఈ జీవితంలో, ఉన్న కొద్దిపాటి సమయాన్ని నవ్వుతూ, నవ్విస్తూ గడపడమే మనం సంపాదించుకోగలిగే అతి పెద్ద ఆస్థి.