శంషాబాద్: ప్రముఖ టెలివిజన్ వ్యాఖ్యాత, నటి సుమ కనకాల సోమవారం శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్లో సమతా మూర్తిని సందర్శించారు. 216 అడుగుల ఎత్తైన సమతా మూర్తి విగ్రహాన్ని ఆమె భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు. దర్శనం అనంతరం సుమ అక్కడి అన్నప్రసాద వితరణలో పాల్గొని సందడి చేశారు. స్వయంగా భక్తులకు అన్నప్రసాదాన్ని వడ్డించారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న భక్తులతో ముచ్చటిస్తూ, సామాన్యురాలిగా వారితో మమేకమై అందరినీ ఆకట్టుకున్నారు.
శ్రీ చిన్న జీయర్ స్వామివారిని సమతా మూర్తి కేంద్రంలోని 108 దివ్య దేశాలు మరియు క్షేత్రం యొక్క అద్భుత నిర్మాణ శైలిని ఆమె ప్రశంసించారు. “ఇక్కడి వాతావరణం ఎంతో ప్రశాంతంగా, ఆధ్యాత్మికంగా ఉంది. రామానుజాచార్యుల సమానత్వ సందేశం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం” అని ఆమె ఈ సందర్భంగా పేర్కొన్నారు.