రేవంత్ రెడ్డి కోవర్టు, సబ్ వర్ట్, పర్వర్ట్

- నువ్వొక బ్రోకర్, జోకర్
- ముష్టి, కుష్టు, నికృష్ట ప్రయత్నమే సిద్దిపేట సభ
- నాడు బాబు డబ్బు సంచులతో రెడ్ హ్యాండెడ్ గా దొరికిన దొంగ
- నేడు బాబు జల దోపిడిలో చేతులు కలిపిన ఇంటి దొంగ
- 25 ఏళ్లలో 5,6సార్లు పార్టీ మారిన చరిత్ర నీది
- ఆ డ్రైనేజీ ఉపన్యాసం కోసం అంతదూరం రావాల్నా?
- కుప్పానికి నీళ్లు.. పాలమూరుకు కన్నీళ్లు ఎందుకు?
- ఎవరో ఎందుకు?..సిద్దిపేటలో చేయ్.. ఇద్దరం తేల్చుకుందాం
- మాజీ మంత్రి, బిఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు
అబద్దపు మాటలు, టన్నుల కొద్దీ బూతులు రేవంత్ సిద్దిపేట సభ. 26 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి కాంగ్రెస్ కార్యకర్తల నుంచి తరలించి పార్టీ ప్లీనరీ పెట్టుకున్నరు. పోలీసు కమిషనరే పార్కింగ్ స్థలాల పేరిట బయటకు వెళ్లడించారు.
ముఖ్యమంత్రి ప్రసంగం బాడీ లాంగ్వేజ్ చూస్తే ఒక శాడిస్ట్ మెంటాల్టీ, ఫ్రస్టేషన్ కనిపిస్తున్నది. ఆంధ్రా నీటి దొంగతనానికి లోపాయికారిగా సహకరించి ఈ మొత్తం భ్రష్టత్వం నుంచి దృష్టి మళ్లించేందుకు చేసిన ముష్టి, కుష్టు, నికృష్ట ప్రయత్నమే నిన్నటి సిద్దిపేట సభ.
నీ ఎమ్మెల్యేలు అనిరుద్ రెడ్డి 20పర్సెంట్ కమిషన్ గురించి, నీ పాలన సక్కగ లేదని రాజగోపాల్ రెడ్డి కుండబద్దలు కొట్టినట్లు చెప్పిండు. నాడు బాబు డబ్బు సంచులతో రెడ్ హ్యాండెడ్ గా దొరికిన దొంగ. నేడు బాబు జల దోపిడిలో చేతులు కలిపిన ఇంటి దొంగ. కోవర్టు, సబ్ వర్ట్, పర్వర్ట్.. ఈ రేవంత్ రెడ్డి. కోవర్టు అంటే.. శత్రవుతో చేతులు కలిపినోడు. సబ్ వర్ట్ అంటే.. వ్యవస్థను భ్రష్టు పట్టించేవాడు. పర్వర్ట్..అంటే వికృత మనస్తత్వం ఉన్నవాడు. నిన్నటి సభలో 63సార్లు కేసీఆర్ పేరు, 53 సార్లు నా పేరు, 24 సార్లు కేటీఆర్ పేరు తీసినవు.
ఇందిరమ్మ జీవిత బీమా గురించి ఒక్క మాట లేదు. అంత ఫ్రస్టేషన్ నీకు. పత్రికల్లో యాడ్ ఇచ్చినవు. పథకం ప్రారంభిస్తా అన్నవు. ఏమైంది ఒక్క మాట చెప్పలేదు. నా పొడుగు గురించి, కేటీఆర్ గడ్డం గురించి వికృత వ్యాఖ్యలు చేయడం కోసం బోలేడంత ప్రజల సొమ్ము వ్యర్థం చేసి, సిద్దిపేట దాకా రావాలా? ఆ డ్రైనేజీ ఉపన్యాసం కోసం అంతదూరం రావాల్నా? వెయ్యి టీఎంసీల నీళ్లు ఆంధ్రకు వదిలేసి, నువ్వు తెలంగాణకు జల ద్రోహం చేసిన సంగతిని మేం సాక్షాదారాలతో నిరూపించినందుకు, నిలదీస్తున్నందుకు నీకు వశమైతలేదు.
కృష్ణా నీళ్లను అక్రమంగా దోపిడి చేయడం కోసం నాగార్జున సాగర్ కుడివైపు ఏపీ మరో టన్నెల్ అక్రమంగా నిర్మిస్తున్నదనే నిజాన్ని ఈ ముఖ్యమంత్రి దాచి పెట్టిండు. మేం నిలదీసిన ప్రతిసారీ బ్యాక్ డేట్ వేసి లేఖలు విడుదల చేయడం తప్ప మీకు చిత్తశుద్ది లేదా? ఆనాడు బనకచర్ల అక్రమ ప్రాజెక్టు విషయంలో బిఆర్ఎస్ నిలదీస్తే బ్యాక్ డేట్ వేసి లెటర్ విడుదల చేసి చేతులు దులుపుకున్నవు. ఈరోజు సాగర్ టన్నెల్ విషయంలో బ్యాక్ డేట్ వేసిన లెటర్ చూపి తప్పించుకుంటున్నవు.
అప్పుడైనా ఇప్పుడైనా ఏపీ జలదోపిడికి సహకరించి తెలంగాణకు వెన్నుపోటు పొడిచింది కాంగ్రెస్ పార్టీనే. తల్లిపాలు తాగి రొమ్ముగుద్దే నైజం ఉన్న రేవంత్ వంటి నాయకుల వల్లనే తెలంగాణకు తీరని ద్రోహం జరుగుతున్నది. పోతిరెడ్డిపాడు గురించి మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి..
పాలమూరు జిల్లా నోరు కొట్టి..పోతిరెడ్డిపాడు పొక్క పెంచి..కృష్ణా నీళ్లను తరలించింది ఎవరు? నాటి కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? పోయిన వారు తిరిగి వచ్చి నిజాలు చెప్పలేరని పచ్చి అబద్దాలు మాట్లాడతావా? పోతిరెడ్డిపాడు విషయంలో పదవులకు ఆశ పడి పెదవులు ముసుకున్నది ఎవరు?
మేము ఆ జీఓ వచ్చినప్పుడు మీ ప్రభుత్వంలోనే లేము. పెదవులు ముసుకున్నది మీ పక్కన ఉన్న నాయకులే.
మేము జూలై 4, 2005 మంత్రి పదవులకు రాజీనామా చేస్తే, 13 సెప్టెంబర్ 2005 జీఓ వచ్చింది.
మేము రాజీనామా చేసిన మూడు నెలలకు పోతిరెడ్డి పాడు జీవో వచ్చింది. మేం పదవుల్లో ఉన్నపుడు పోతితెడ్డి పాడు నిర్మాణం అయ్యిందని రేవంత్ పచ్చి అబద్దాలు ఎలా మాట్లాడారు? మాతో ఆరోజు చేతులు కలిపి ఒకే ఒక్క కాంగ్రెస్ నాయకులు పీజేఆర్. పదవుల కోసం పార్టీలు మారిన చరిత్ర నీది.
చనిపోయిన పెద్ద మనిషి నాయిని నర్సింహారెడ్డిని కూడా నీ చిల్లర రాజకీయాలకు వదలవా?
కడప ఇంచార్జీగా ఉండి, ఆయన పోతిరెడ్డిపాడుకు సపోర్టు చేసిండని అడ్డగోలుగా మాట్లాడుతవా?
కేసీఆర్ ఆదేశం ఇస్తే.. అమెరికాలో ఉండి తెలంగాణ కోసం గవర్నర్ కు రాజీనామా లెటర్ పంపిన అసలు సిసలు తెలంగాణ వాది ఆయన. ఉద్యమ కారుల మీద తుపాకీ ఎక్కు పెట్టిన నువ్వు నాయిని గురించి మాట్లాడుతా? చెంపలేసుకుని, ముక్కు భూమికి రాసి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం.
చంద్రబాబుకు ఏజెంట్ గా ఉంటూ తెలంగాణకు వెన్నుపోటు పొడుస్తున్నడు. కేసీఆర్ ప్రాణత్యాగం చేసి తెలంగాణ సాధించారు. చంద్రబాబు పంచన చేరి తెలంగాణ ప్రయోజనాలకు తూట్లు పొడిచింది నువ్వు కాదా? గురుదక్షిణ చెల్లించుకునేందుకు వెయ్యి టీఎంసీల నీళ్లను ఏపీకి వదిలిపెట్టింది నువ్వు కాదా? 299:512 వాటాల విషయంలో మేం సంతకం పెట్టామని నిరూపిస్తే నేను నా పదవికి రాజీనామా చేస్తా. నిరూపించలేకపోతే నువ్వు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడానికి సిద్ధమా రేవంత్ రెడ్డి?
మేం 299కు ఒప్పుకుంటే.. సెక్షన్ 3 కింద కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని ఎందుకు కోరాం? అపెక్స్ కౌన్సిల్‌కు ఎందుకు వెళ్లాం? సుప్రీంకోర్టును ఎందుకు ఆశ్రయించాం? ఎందుకు ట్రిబ్యునల్ సాధించాం? మేమే 299:512 శాశ్వత ఒప్పందం చేసుకుంటే తెలంగాణకు న్యాయం చేయాలని ఇన్ని పోరాటాలు ఎందుకు చేస్తాం? మూడేళ్ల నుంచి వాదనలు వినిపించి అవార్డు సాధించే తెలివి లేదు. దాని గురించి మాట్లాడటం చేతగాని దద్దమ్మ నువ్వు మా గురించి మాట్లాడుతవా?
299 టెంపరరీ అగ్రిమెంట్. నువ్వు కూడా అదే చేస్తున్నవు. ఆ టెంపరరీ వాటా ప్రకారం కూడా నువ్వు నీళ్లు వాడటం లేదు. చరిత్రలో ఎన్నడూ లేనంత తక్కువ నీళ్లు మీ మూడేళ్ల ప్రభుత్వం వాడింది. ఎవర్ లోయెస్ట్ యుటిలైజేషన్ ఇన్ హిస్టరీ. కృష్ణా నీళ్లను అతి తక్కువ వినియోగించి తెలంగాణకు మోసం చేసింది ఈ రేవంత్. ఎన్ని నీళ్లు ఎత్తినవు, ఎన్ని నీళ్లు వదిలిపెట్టినవు శ్వేతపత్రం విడుదల చేయి రేవంత్ రెడ్డి.
700 కిలోమీటర్ల కుప్పంకు నీళ్లు ఎలా వెళ్లాయి. పాలమూరుకు ఎందుకు నీళ్లు రావు?
ఇది నీ ద్రోహం వల్ల కాదా? నువ్వొక బ్రోకర్, జోకర్. అసెంబ్లీ పెట్టు. ఆధారాలతో సహా నగ్నంగా నిలబెడతా. నువ్వు ఎట్ల ద్రోహం చేసినవో, ఎట్ల లేని కరువు తెచ్చినవో బట్టబయలు చేస్తా. అసెంబ్లీ పెట్టు మైక్ కట్ చేయకు. నీ ద్రోహ బుద్దిని బయట పెట్టకుంటనే నా పేరు హరీశ్ రావు కాదు. దేవాదుల, సీతారామ, కల్వకుర్తిలో నీళ్లు ఎట్ల లిఫ్ట్ చేయకుండా ద్రోహం చేసినవో చెప్పడానికి నేను సిద్దం నువ్వు సిద్దమా? అసెంబ్లీ పెట్టు. కుప్పానికి నీళ్లు తీసుకెళ్లే సోయి అక్కడి ప్రభుత్వానికి ఉంది. మన పాలమూరు ప్రాజెక్టులు నింపే సోయి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి లేదా? కుప్పానికి నీళ్లు.. పాలమూరుకు కన్నీళ్లు ఎందుకు?
మూడు తరాల పథకాలు కొనసాగిస్తున్నాం అని రేవంత్ పచ్చి అబద్దం చెబుతున్నడు.
వైయస్ ప్రారంభించిన ఫీజు రియింబర్స్ మెంట్ ఎందుకు నిధులు ఇవ్వడం లేదు? మేం 19,500 కోట్లు నిదులు ఇచ్చినం. నువ్వు మూడేళ్లలో 600 కోట్లు కూడా ఇవ్వలేదు. పథకాలు రద్దు చేయలేదు అన్నవు. కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్, ఆరోగ్య లక్ష్మీ, దళిత బంధు, రైతు బీమా, గొర్రెల పంపిణీ, ఫీజు రియింబర్స్ మెంట్, రంజాన్ తోఫా, క్రిస్మస్ గిఫ్ట్ ప్యాక్, మన ఊరు మన బడి, కంటి వెలుగు ఇట్ల నువ్వు బంద్ పెట్టిన కేసీఆర్ పథకాల లిస్ట్ చాంతాడంత ఉంది.
మదన్ మోహన్ గురించి మాట్లాడిండు. నేను సొంత డబ్బులతో నా నియోజకవర్గంలో పెట్టిన మీరు ఎవ్వరూ పట్టించుకోలేదు. కేసీఆర్ కట్టిన మెడికల్ కాలేజీకి ఆయన పేరు పెట్టినవు. నువ్వేమైనా కట్టించినవా? ముత్యం రెడ్డి కి కేన్సర్ వస్తే రెండు కోట్లు ఖర్చు పెట్టి అమెరికాలో చికిత్స అందించిన గొప్ప మానవతావాది కేసీఆర్.
కేసీఆర్ శంకరమ్మకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి నిలబెడితే ఓడించింది మీ మంత్రివర్గంలో ఉన్న ఉత్తంకుమార్ రెడ్డి కాదా? నిజంగా ప్రేమ ఉంటే ఒక ఎమ్మెల్సీ సీటు ఇవ్వు. గెలిపించు. నాడు తెలంగాణ కోసం మేం రాజీనామాలు చేస్తే, నువ్వు జిరాక్స్ కాయితం ఇచ్చి వెన్నుచూపి పారిపోయినవు. రాష్ట్రం వచ్చిన వెంటనే తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చేందుకు చంద్రబాబుతో చేయి కలిపిన ద్రోహి నువ్వు. తొక్కుకుంటూ వచ్చిన అని చెప్పుకునే నిన్ను జనాలు తొక్కే రోజు దగ్గర్లోనే ఉంది రేవంత్. పండవెట్టి తొక్కుతరు. ఓట్లతో తొక్కుతరు.
ఎన్టీఆర్ అధికారం చేపట్టినంక 1989 కాంగ్రెస్ 181 సీట్లతో అధికారంలోకి వచ్చింది. 1994 ఎన్నికల నాటికి 26కు పడిపోయింది. 1994లో ఓడితే అధికారంలోకి రావడానికి పదేళ్లు పట్టింది. ఈసారి మాత్రం నీ చేతగాని పాలన, ఆకాశాన్నంటే అవినీతి, దగుల్బాజీ మాటలు కాంగ్రెస్ పార్టీ మరో 20 ఏండ్ల వరకు లేవకపోవడం ఖాయం.
సిద్దిపేటలో పోటీ చేసి గెలిస్తే మంత్రి పదవి ఆఫర్ చేస్తున్న రేవంత్ రెడ్డి.. వాళ్లో వీళ్లో కాదు నువ్వే వచ్చి సిద్దిపేటల పోటి చేయి. నువ్వో నేనో ప్రజల ముందే తేల్చుకుందాం రా..
ప్రజలు ఎవర్ని ఆదరిస్తరో, ఎవర్ని చీదరిస్తరో తేలిపోతది. తొట్టి గ్యాంగుతో తిట్టించి సమయం వృథా చేసుకోకు.
నీ చరిత్ర ఎవరికి తెలియదు? ముందు ఏబీవీపీ, తర్వాత టిఆర్ఎస్, తర్వాత ఇండిపెండెంట్, తర్వాత టిడిపి, తర్వాత కాంగ్రెస్. టిఆర్ఎస్ లో ఉన్నపుడు నీ బుద్ది తెలిసి నీకు జెడ్పీటీసీ టికెట్ కూడా ఇవ్వలేదు. నువ్వు రేపు ఏ పార్టీలోకి పోతవో నీకే తెలియదు. 25ఏళ్లుగా ఒకే పార్టీ నాది, 25 ఏళ్లలో 5,6సార్లు పార్టీ మారిన చరిత్ర నీది. ఊసరవెళ్లి కూడా నిన్ను చూస్తే సిగుపడుతుంది.
సోనియమ్మను బలి దేవత, ఇటలీ బొమ్మ అన్న నువ్వు ఈరోజు కాంగ్రెస్ లో చేరి రాహుల్ గాంధీ, సోనియమ్మ అటెండర్ల కంటే, ప్రియాంక గాంధీ బాడీగార్డ్ కంటే హీనంగా ప్రవర్తిస్తున్నవు.
తెలంగాణ ముఖ్యమంత్రి పదవి పరువు తీస్తున్నవు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఢిల్లీ కాళ్ల దగ్గర తాకట్టు పెడుతున్నవు. అసోం ముఖ్యమంత్రి హేమంత్ బిశ్వశర్మ సోనియమ్మను తిడితే దేశంలోనే తొలిసారి ఖండించింది కేసీఆర్ . అసలు సిద్దిపేటకు వచ్చి నువ్వేం ఇచ్చినవు?
నేను తాడిచెట్టు అయితే నువ్వు గంజాయి చెట్టు. తాడిచెట్టుతో ఎంత ఉపయోగం. గంజాయి చెట్టు సమాజానికి చీడ. నిన్ను, నీ పాలనను జనం చీదరించుకోవడం కాదు, నీ సొంత పార్టీ ఎమ్మెల్యేలు చీదరించుకుంటున్నరు. సొంత పార్టీ ఎమ్మెల్యేలు కడుపు మండి నిజాలు మాట్లాడితే పిచ్చి కుక్కలు అంటవా? వారు లేకుంటే నీకు సీఎం కుర్చీ ఎక్కడిది? మూడేళ్లలో ఎవరు పిచ్చికుక్కనో ప్రజలకు అర్థమైంది. అధికారం ఉంది కదా అని విర్రవీగకు రేవంత్ రెడ్డి.
కరువు బృందాలు ఏపీకి ఎందుకు వెళ్తాయి తెలంగాణకు ఎందుకు రావు అని బిజేపీని ఎందుకు నిలదీయవు రేవంత్ రెడ్డి. బీజేపీని ప్రశ్నించే ధైర్యం నీకు లేదు. కర్ణాటక, మహారాష్ట్ర కరువు సాయం చేస్తుంటే నువ్వు ఎందుకు చేయడం లేదు.
సమావేశంలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎంపీ వద్ది రాజు రవిచంద్ర, ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేశ్, చింతా ప్రభాకర్, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, సీనియర్ నాయకులు మన్నె గోవర్దన్ రెడ్డి పాల్గొన్నారు.
