చుక్కా రామయ్యకు హరీష్ రావు పుట్టినరోజు శుభాకాంక్షలు

హైదరాబాద్ : సుప్రసిద్ధ విద్యావేత్త, మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య పుట్టినరోజు సందర్భంగా బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ లీడర్, మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు, బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర,అంబర్ పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ తదితరులు ఆయనకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
ఐఐటీ రామయ్యగా పేరుగాంచిన చుక్కా రామయ్య 101వ జన్మదినం సందర్భంగా హరీష్ రావు, రవిచంద్ర,వెంకటేష్ తదితరులు ఉస్మానియా యూనివర్సిటీ సమీపాన విద్యానగర్ లో ఉన్న ఆయన నివాసానికి వెళ్లి పుష్పగుచ్ఛమిచ్చి హృదయపూర్వక శుభాకాంక్షలు చెప్పారు.వారు రామయ్య యోగక్షేమాలు అడిగి తెలుసుకుని ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని ఆకాంక్షిస్తూ భగవంతున్ని ప్రార్థించారు.
