హరీష్ రావుకు బలుపు, అహం

- ముఖ్యమంత్రి అంటే కేసీఆర్ మాత్రమేనని అనుకుంటున్నావా?
- కేసీఆర్ కూడా హరీష్ రావును పక్కన పెట్టాడు
- కొడుకుకే ప్రాధాన్యత ఇస్తున్నాడు
- ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్
హైదరాబాద్: సిద్దిపేటలో తన కథ ముగిసిందని మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై హరీష్ రావు చేస్తున్న వ్యాఖ్యలు హాస్యాస్పదం. బానిస హరీష్ రావు.. ఊడిగం తప్ప ఏమీ తెలియదు ఆయనకు. శ్రీకాంతాచారి కిరోసిన్ పోసుకుని తగలబెట్టుకుని చనిపోతాడు.. కానీ కిరోసిన్ పోసుకున్న హరీష్ రావుకు అగ్గిపెట్టె దొరకక నటించాడు. మామ కోసం ఆస్కార్ స్థాయిలో నటించిన హరీష్ రావు కథ ముగిసింది. ముఖ్యమంత్రి దగ్గరకు వచ్చి నియోజకవర్గ అభివృద్ధిపై హరీష్ రావు ఏనాడూ అడగలేదు.
హరీష్ రావుకు బలుపు, అహం.. ముఖ్యమంత్రి అంటే కేసీఆర్ మాత్రమేనని అనుకుంటున్నావా?
కేసీఆర్ కూడా హరీష్ రావును పక్కన పెట్టాడు. కొడుకుకే ప్రాధాన్యత ఇస్తున్నాడు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి దగ్గరకు పోయిన హరీష్ రావు.. సీఎం రేవంత్ రెడ్డి దగ్గరకు ఎందుకు రాడు? నేను సీఎం దగ్గరకు పోయి పనులు అడుగుతా అన్న అహం హరీష్ రావుది. ముఖ్యమంత్రి స్వయంగా సిద్దిపేటకు వెళ్లారు. కానీ హరీష్ రావు మాత్రం సీఎంను విమర్శిస్తున్నారు.
ప్రతిపక్ష ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు కూడా మా సీఎం వెళ్లి అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తున్నారు. సీఎం సభకు ఎందుకు హాజరు కాలేదని హరీష్ రావు సిగ్గుపడాలి. హరీష్ రావు చరిత్ర అందరికీ తెలుసు.. ఉత్త పుణ్యానికి ఆయన మంత్రి అయ్యాడు. హరీష్ రావు బానిస మాటలు బంద్ చేయాలి. అధికారం కోసం వెంపర్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాట్లాడితే తెలంగాణ ప్రజలు తన్ని తరిమికొడతారు. కేసీఆర్ కుటుంబం తెలంగాణను వంచించింది చాలు.. ఇంకా అతి చేయొద్దు.
