అధికారం వచ్చాక ఆంధ్రా సంస్థలతో వ్యాపారం చేయలేదా?

- ఆంధ్రా సంస్థలతో హరీష్ రావు పాల వ్యాపారం చేయలేదా?
- బీజేపీ కోవర్టు హరీష్ రావు
- బీఆర్ఎస్ అకౌంట్లో 1500 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయి?
- హరీష్ రావు ఎంత గోసపడినా మళ్లీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే
- ఉద్యమ సమయంలో కల్వకుంట్ల కుటుంబంలో ఒక్కరైనా చనిపోయారా?
- రోజా ఇంట్లో కేసీఆర్ రొయ్యల పులుసు తిని అడ్డగోలుగా మాట్లాడినప్పుడు హరీష్ రావు ఎక్కడికి పోయాడు?
- కేసీఆర్ ఎన్ని పార్టీలు మారాడు?కేసీఆర్ పుట్టిందే కాంగ్రెస్ పార్టీలో
- కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి పోయి తర్వాత టీఆర్ఎస్ పెట్టుకోలేదా?
- ఎల్లమ్మ గుడికి పోయి వచ్చిన తర్వాతే హరీష్ రావు నోరు తెరవాలి
- ఆంధ్రాకు, తెలంగాణకు దోచిపెట్టిన దోపిడీ దొంగలు మీరు
- 299 టీఎంసీలకు ఒప్పుకుని తెలంగాణకు మరణ శాసనం రాసింది మీరు కాదా?
- హరీష్‌రావుపై వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, ప్రభుత్వ విప్ వేముల వీరేశం, షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఎదురుదాడి
హైదరాబాద్ : రేవంత్ రెడ్డి పేరు చెప్తే కల్వకుంట్ల కుటుంబం వణికిపోతోంది. కల్వకుంట్ల కుటుంబం చెప్పలేనన్ని పాపాలు చేసింది. కల్వకుంట్ల కుటుంబానికి గతంలో ఉన్న ఆస్తులు ఎంత.. ఇప్పుడెన్ని ఉన్నాయి? మూడు హోటళ్లు మాత్రమే ఉన్నాయని బరితెగించి కేటీఆర్ మాట్లాడుతున్నాడు.
హైదరాబాద్ నుంచి జిల్లాలకు కూడా ఈ పొలిటికల్ బ్రోకర్స్ విస్తరించారు.
ప్రభుత్వ స్థలాలు, ఆర్టీసీ భూములను.. ఇలా వేటిని వదలకుండా దోచుకున్నారు. కేసీఆర్ హయాంలో నెలకు రెండు సార్లు భూములు అమ్మారు. ఇంటి ఆడపడుచు మీ బతుకులపైన దుమ్మెత్తిపోస్తోంది. ఒక్క ప్రశ్నలకు మీ దగ్గర సమాధానం లేదు.
ఉద్యమ సమయంలో కల్వకుంట్ల కుటుంబంలో ఒక్కరైనా చనిపోయారా? మళ్లీ సెంటిమెంట్ రగిలించి ఉద్యమాలు చేయాలని చూస్తున్నారు. సోనియా గాంధీ కాళ్లు మొక్కలేదా? కేసీఆర్ ఎన్ని పార్టీలు మారాడు.కేసీఆర్ పుట్టిందే కాంగ్రెస్ పార్టీలో. కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి పోయి తర్వాత టీఆర్ఎస్ పెట్టుకోలేదా? పెయిడ్ సోషల్ మీడియా పెట్టుకుని మళ్లీ ప్రభుత్వంలోకి వస్తామని ఊదరగొడుతున్నారు. పదేళ్ల మీ పాలనకు, మూడేళ్ల మా పాలనపైన హరీష్ రావుతో చర్చకు సిద్ధం. తెలంగాణ నుంచి కల్వకుంట్ల కుటుంబాన్ని త్వరలోనే బహిష్కరించి తరిమికొడతారు.
అధికారం కోసం ఎంతకైనా దిగజారడానికి కల్వకుంట్ల కుటుంబం సిద్ధంగా ఉంది. సచ్చిపోయిన పాము మళ్లీ సచ్చిపోవాలని మేం కోరుకుంటామా? కేసీఆర్‌ను అసెంబ్లీకి తీసుకురావాలి..జీతం తీసుకుని ఫామ్‌హౌస్‌లో రాజభోగాలు అనుభవిస్తున్నారు. తెలంగాణ ప్రజల నుంచి దోచుకున్న సొమ్ముతో విలాసాలు చేస్తున్నారు. బీజేపీ కోవర్టు హరీష్ రావు. రోజా ఇంట్లో కేసీఆర్ రొయ్యల పులుసు తిని అడ్డగోలుగా మాట్లాడినప్పుడు హరీష్ రావు ఎక్కడికి పోయాడు?
సిద్దిపేట జన ప్రభంజనం చేసి తర్వాత హరీష్ రావు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి..
మా సీఎం రేవంత్ రెడ్డి అడుగు శబ్దం విన్నాక రాత్రి హరీష్ రావుకు నిద్ర పట్టలేదు. కేవలం సిద్దిపేట నియోజకవర్గం నుంచే 40 వేల మంది సీఎం సభకు వచ్చారు. సిద్దిపేటకు 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు చేశాం. 540 కోట్ల విలువ చేసే అభివృద్ధి పనులను మా సీఎం చేపట్టారు. సిద్దిపేట నా అడ్డా, గడ్డ అన్న హరీష్ రావు భాగోతాన్ని అక్కడే మా సీఎం ఎండగట్టారు. ఇంటికి పంపిస్తానని సవాల్ చేసి మా రేవంత్ రెడ్డి దాన్ని చేసి చూపించాడు..
మా సీఎం అడిగిన ప్రశ్నలకు హరీష్ రావు సమాధానం చెప్పడం లేదు. బీజేపీతో చర్చలు జరిపావా లేదా అన్న దానిపైన సిద్దిపేట ఎల్లమ్మ గుడిలో ప్రమాణం చేయాలని మా సీఎం సవాల్ విసిరారు. ఎల్లమ్మ గుడికి పోయి వచ్చిన తర్వాతే హరీష్ రావు నోరు తెరవాలి. హరీష్ రావు పాత చింతకాయ పచ్చడి కబుర్లు చెపుతున్నాడు. పోతిరెడ్డి పాపం టీఆర్ఎస్దే. కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా హరీష్ రావు పనిచేశాడు ఆనాడు. పి. జనార్దన్ రెడ్డి, మర్రి శశిధర్ రెడ్డి హైదరాబాద్ బ్రదర్స్‌గా సొంత కాంగ్రెస్ ప్రభుత్వంపైన పోరాడారు.
203 జీవోతో 80 క్యూసెక్కుల సామర్థ్యం పెంచడానికి వైఎస్ జగన్ ప్రయత్నం చేసినప్పుడు చూస్తూ మీరు కూర్చోలేదా? ఆంధ్రాకు, తెలంగాణకు దోచిపెట్టిన దోపిడీ దొంగలు మీరు. కృష్ణ జలాల్లో 299 టీఎంసీలకు ఒప్పుకుని తెలంగాణకు మరణ శాసనం రాసింది మీరు కాదా? కృష్ణా ట్రిబ్యునల్ మీద మా ప్రభుత్వం సమర్థవంతంగా వాదించి తెలంగాణ వాటాను పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నది మేం కాదా? కాపలా కుక్కలా తెలంగాణకు ఉంటానని చెప్పిన దోపిడీ దొంగల్లా మారి దోచిపెట్టిన మీరు మా సీఎంపైన ఆరోపణలు చేస్తారా?
తెలంగాణ ఉద్యమంలో 1200 మంది బలిదానాలకు సమాధానం చెప్పాలి. అంగీలు విప్పి డ్రామాలు చేస్తారు తప్ప అసెంబ్లీకి మాత్రం రారు. మా సీఎం రేవంత్ రెడ్డి.. సిరిసిల్ల, గజ్వేల్, సిద్దిపేటలో మీ నిజస్వరూపాన్ని అద్దంలో చూపిస్తున్నాడు. రొయ్యల పులుసుకు కక్కుర్తిపడి తెలంగాణకు అన్యాయం చేసిన మీరు ముక్కు నేలకు రాయాలి. నాలుగు లిఫ్టులు పెట్టి రాయలసీమకు నీళ్లు తీసుకుపోతుంటే మాట్లాడని మీరు ముక్కు నేలకు రాయాలి.
కేసీఆర్ కిట్‌లో అవినీతి జరిగింది. ఒక్కొక్క కిట్‌కు 2800 రూపాయల వరకు డ్రా చేసుకున్నారు. గొర్రెల స్కీంలో ఎంత అవినీతి జరిగిందో అందరికీ తెలుసు. డబుల్ బెడ్రూంలు, దళితులకు మూడెకరాలు, నిరుద్యోగ భృతి.. ఇలా ఎన్నో ఎగవేశారు. హరీష్ రావు ముందు సిద్దిపేట ఎల్లమ్మ గుడికి వెళ్లాలి.. ప్రమాణం చేసి తన నిజాయితీని నిరూపించుకోవాలి..
తెలంగాణ ఏర్పాటుకు ముందు కేసీఆర్ మాట్లాడిన భాష అందరికీ తెలుసు.తెలంగాణ రాక ముందు ఆంధ్రా విద్యాసంస్థలను వ్యతిరేకించి బెదిరించారు. అధికారం వచ్చాక ఆంధ్రా సంస్థలతో వ్యాపారం చేయలేదా? ఆంధ్రా సంస్థలతో హరీష్ రావు పాల వ్యాపారం చేయలేదా? వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాళ్లు మొక్కలేదా? ఆయన మంత్రివర్గంలో మంత్రులుగా పనిచేయలేదా? నాగలి కట్టి పనిచేస్తే బీఆర్ఎస్ పార్టీకి 1500 కోట్ల నిధులు వచ్చాయా? 8 లక్షల కోట్ల అప్పు చేసి ఏ వర్గానికి మేలు చేయలేదు. వ్యభిచార రాజకీయాలు చేస్తున్నది బీఆర్ఎస్ పార్టీ.
గొంగడి గోసి కట్టుకుని ఆడిన నాయకుడికి వందల కోట్లు ఎలా వచ్చాయి? ఎన్టీఆర్, వైఎస్ఆర్లాగా రేవంత్ రెడ్డి కూడా పేద ప్రజల గుండెల్లో ఉండిపోతున్నారు. హరీష్ రావు ఎంత గోసపడినా మళ్లీ గెలిచేది కాంగ్రెస్ పార్టీయే. మళ్లీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే.
