Suryaa.co.in

Andhra Pradesh

జగనన్న శాశ్వత భూహక్కు

– భూరక్షపధకం,జగనన్న సంపూర్ణ గృహహక్కు పధకాల అమలు వేగవంతం చేయండి
– మంత్రివర్గ ఉపసంఘం ఆదేశం
అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వైయస్సార్ జగనన్న శాశ్వత భుహక్కు మరియు భూరక్ష పధకం,జగనన్నసంపూర్ణ గృహహక్కు పధకాల అమలును మరింత వేగవతం చేయాలని రాష్ట్ర పంచాయితీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖామాత్యులు పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ ఉప సంఘం అధికారులను ఆదేశించింది.
బుధవారం అమరావతి సచివాలయం మూడవ బ్లాకులో వైయస్సార్ జగనన్న శాశ్వత భుహక్కు మరియు భూరక్ష పధకం,జగనన్నసంపూర్ణ గృహ హక్కుపధకాలపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధ్యక్షతన ఉప సంఘం సభ్యులు ఉప ముఖ్యమంత్రి రెవెన్యూ ధర్మాన కృష్ణదాస్,మున్సిపల్ పరిపాలన శాఖ మంత్రి బొత్స సత్య నారాయణ,ఆర్ధికమంత్రి బుగ్గన రాజేంద్రనాధ్,గృహనిర్మాణశాఖ మంత్రి శ్రీరంగనాధ రాజుల సమక్షంలో మంత్రివర్గ ఉపసంఘం సమావేశం జరిగింది.రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వైయస్సార్ జగనన్న శాశ్వత భుహక్కు మరియు భూరక్ష పధకాల అమలు తీరును మంత్రివర్గ ఉపసంఘం సమీక్షించింది.ఈసందర్భంగా వైయస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు మరియు భూరక్షపధకం,జగనన్న సంపూర్ణ గృహహక్కు పధకాల అమలును మరింత వేగవంతం చేయాల్సి ఉందని అందుకు తీసుకోవాల్సిన వివిధ చర్యలపై ఉప సంఘం సమీక్షించి అధికారులకు అవసరమైన దిశానిర్దేశం చేసింది.
తొలుత జగనన్న సంపూర్ణ గృహహక్కు పధకం అమలు ప్రగతిని రాష్ట్ర గృహనిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ వివరించారు.అలాగే వైయస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు మరియు భూరక్ష పధకం అమలుతీరుకు సంబంధించిన అంశాలను ప్రగతిని రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మరియు సిసిఎల్ఏ నీరబ్ కుమార్ ప్రసాద్,సర్వేఅండ్ సెటిల్మెంట్ శాఖ కమీషనర్ సిద్ధార్ధజైన్ లు మంత్రివర్గ ఉపసంఘానికి వివరించారు.
అనంతరం వైయస్సార్ జగనన్నభూరక్షపధకం అప్లికేషన్ ను మంత్రి పెద్దిరెడ్డి రామ చంద్రారెడ్డి తోపాటు ఇతర మంత్రులు లాప్ టాప్ ద్వారా ప్రారంభించారు.
ఈసమావేశంలో రాష్ట్ర గృహనిర్మాణ సంస్ధ అధ్యక్షులు దవులూరి దొరబాబు,రాష్ట్ర పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి,రెవెన్యూ శాఖల ముఖ్య కార్యదర్శులు గోపాలకృష్ణ ద్వివేది,వి.ఉషారాణి,పంచాయితీరాజ్ శాఖ కమీషనర్ కె.శశిధర్,ఇంకా రెవెన్యూ,సర్వే అండ్ సెటిల్మెంట్స్, మున్సిపల్,హౌసింగ్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE