Suryaa.co.in

సంతోషం-సంతృప్తి
Family

సంతోషం-సంతృప్తి

భక్తుడు: నేను ఇంటికెళ్లే రోడ్డు మీద బంగారం దొరికేలా ఆశీర్వదించండి స్వామి!!
స్వామిజీ: ఎవరిని కొరుకుంటున్నావురా అబ్బాయ్ దేవుడినేనా?
భక్తుడు: అవును బాబాయ్ , దొరికితే చాలా బాగుండు!
స్వామిజీ: దొరికితే ఎం చేస్తావ్?
భక్తుడు: అమ్మితే డబ్బులు వస్తాయ్, హాయిగా ఖర్చు పెట్టుకోవచ్చు.
స్వామిజీ: ఎలాగు దేవుడినే కదా కొరుకునేది… అదేదో డబ్బులే దొరకాలి అని కొరుకోవచ్చు కదా…
భక్తుడు: అవును… నువ్వు చెప్పిందే కరెక్ట్, ఇప్పుడు బంగారం దొరికి దాన్ని అమ్మడం..! ఇదంత టైం వేస్ట్… నాకు డబ్బు దొరకాలి.
స్వామిజీ: ఎంత?
భక్తుడు: ఒక 100 కోట్లు.
స్వామిజీ: ఎలాగు దేవుడినే కదా కొరుకునేది… అదేదో లక్ష కోట్లు కొరుకోవచ్చు కదా…
భక్తుడు: అవును లే, … ఎలాగు దేవుడినే కదా… సరే లక్ష కోట్లు కోరుకుంటా…
స్వామిజీ: ఎం చెస్తావేంటి, లక్ష కోట్లతో ?
భక్తుడు: బిల్డింగులు, కార్లు కొంటాను!
స్వామిజీ: పిచ్చోడా! దేవుడిని, అవే కోరుకోవచ్చు కదా! సరే అవన్ని కొంటే???
భక్తుడు: ఇంకేముంది సంతోషంగా ఉండొచ్చు.
స్వామిజీ: పిచ్చివాడా, అదేదో దేవుడిని సంతోషం కావాలని కోరుకోవచ్చు కదా..??
భక్తుడు :🙂😐😶😑
మనకు ఏం కావాలో, మనకు తెలియదు… మనకు ఏమి అర్హత కలదో, ఈశ్వరునికి తెలుసు అందుకే ఈశ్వరునికి సంతోషము కలిగించే పనులు చేస్తే, ఈశ్వరుడు మన అర్హతను బట్టి, మనకు కావలసినవి, దానితో పాటు మనకు సంతోషం, సంతృప్తి ఇస్తాడు.

LEAVE A RESPONSE