Suryaa.co.in

Andhra Pradesh

చెడ్డీ గ్యాంగ్ కన్నా దారుణంగా మద్యం దోపిడీ

– జగన్ పాలన తుగ్లక్‌ను తలపిస్తోంది
– వాలంటీర్లపై ప్రజల తిరుగుబాటు
– వైసీపీ రెబెల్ రఘురామకృష్ణంరాజు
ఏపీలో జగన్మోహన్‌రెడ్డి పాలన తుగ్లక్‌ను మరిపిస్తోందని వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు విరుచుకుపడ్డారు. ఒకసారి జీవోలివ్వడం, మళ్లీ దానిని రద్దు చేయడం, చివరకు అసెంబ్లీలో తీర్మానం చేసిన అంశాలను కూడా కోర్టుముందుకెళ్లి మార్చుకున్నట్లు చెప్పుకోవడం అంటే, తుగ్లక్ పాలన ఎలా ఉందో అర్ధమవుతోందని వ్యాఖ్యానించారు. మీడియాతో మాట్లాడిన ఆయన, చెడ్డీగ్యాంగ్ కన్నా దారుణంగా మద్యం

దోపిడీ జరుగుతోందని దుయ్యబట్టారు. తనను ప్రభుత్వం అనుమతిస్తే, అమరావతి రైతుల పాదయాత్రలో పాల్గొంటానని స్పష్టం చేశారు. మద్యంషాపుల వద్ద జేబుదోపిడీ ఆపాలని డిమాండ్ చేశారు. జగనన్న గృహపథకం రాష్ట్రంలో వాలంటీర్లపై ప్రజల తిరుగుబాటుకు కారణం అవుతోందని, మహిళలు వాలంటీర్లపై తిరుగుబాటు చేస్తుంటే, వైసీపీ నేతలు ప్రజలకు సమాధానం చెప్పలేక పారిపోతున్న దుస్థితి నెలకొందన్నారు. గతంలో ఎప్పుడో ఇచ్చిన ఇళ్లకు, ఇప్పుడు పదివేలు వసూలు చేయడం దిగజారుడుతనమేనన్నారు. దీనిపై ఎవరన్నా కోర్టుకు వెళితే ప్రభుత్వం మళ్లీ సారీ చెప్పకతప్పదన్నారు.

LEAVE A RESPONSE