Suryaa.co.in

Andhra Pradesh

ఎలాంటి అవకాశాలు ఆశించి జస్టిస్ చంద్రు ప్రభుత్వానికి వత్తాసు పలికారు?

– న్యాయమూర్తులకు కులాన్ని ఆపాదించినవ్యక్తి చంద్రుగారికి మహోన్నతుడా?
• జస్టిస్ చంద్రు ఇప్పటికైనా తనతప్పు తెలుసుకొని రాష్ట్రహైకోర్ట్ కి, దేశ అత్యున్నతన్యాయస్థానానికి బహిరంగ క్షమాపణచెప్పాలని డిమాండ్ చేస్తున్నాం
• వైసీపీప్రభుత్వంలో చిన్నారులు మొదలు వృద్ధురాళ్లపై జరుగుతున్న అత్యాచారాలు, దళితులపైజరుగుతున్న దాడులు చంద్రుగారికి కనిపించకపోవడం బాధాకరం.
– టీడీపీ అధికారప్రతినిధి పిల్లి మాణిక్యరావు
రాష్ట్రంలో ప్రజలకుభరోసాఉండి వారిహక్కులు కాపాడుతున్నన్యాయవ్యవస్థను తప్పుపడు తూ, రాష్ట్రప్రభుత్వానికి వత్తాసులపలికేలా మాజీన్యాయమూర్తి జస్టిస్ చంద్రు, మాట్లాడ టం చాలా బాధాకరమని, చంద్రు మాటలు వింటుంటే, తాను రిటైర్ అయ్యాడుకాబట్టి, కోర్టులను గౌరవించాల్సిన అవసరం లేదన్నట్టుగా ఆయనమాటల్లోని ధోరణి కనిపిస్తోందని, ఏదో ఒకరాజకీయఆపేక్షతో మాట్లాడినట్టుగా ఉందని టీడీపీ అధికారప్రతినిధి పిల్లి మాణిక్య రావు స్పష్టంచేశారు. మంగళవారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయకార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.ఆ వివరాలు ఆయన మాటల్లోనే …
ప్రస్తుతం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా ఉన్న ఎన్.వీ.రమణ గారే స్వయంగా పోలీస్ స్టేషన్లలో యథేచ్ఛగా మానవహక్కుల ఉల్లంఘన జరగుతోందనిచెప్పారు. అలానే రాష్ట్రంలోని పశ్చిమ గోదావరిజిల్లాలోని కొవ్వూరునియోజకవర్గంలోని మలకపేట గ్రామంలో గడ్డంశ్రీను అనే దళిత యువకుడిని వైసీపీ నేతలు దారుణంగా పొలంలోనే వేటాటివెంటాడి హతమార్చారు. ఘటన జరిగాక స్వయంగా రాష్ట్రఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ అక్కడికవెళ్లి, హత్యచేసిన వారిని అరెస్ట్ చేయాలని ఆదేశించారు. అదిజరిగి నెలరోజులైనా కూడా గడ్డం శ్రీనుని చంపిన దోషులను ఈప్రభుత్వం అరెస్ట్ చేయకపోవడంతో, మృతుడి తల్లిదండ్రులు హైకోర్టుని ఆశ్రయించారు.
హైకోర్ట్ నెలరోజుల్లో నిందితులను అరెస్ట్ చేసి తమముందు హాజరుపరచాలని అంతర్జాతీయ మానవహక్కుల దినోత్సవం నాడే పోలీసులను ఆదేశించింది. జస్టిస్ చంద్రుగారు జై భీమ్ సినిమాలో చూపినట్లుగా ప్రవర్తించారో లేదో చాలా మందికి నిజంగానే తెలియదు. బడుగుబలహీన వర్గాలకు న్యాయం

చేశారని చంద్రుగారి జీవితంలోని కొన్ని ఘట్టాలతో జై భీమ్ సినిమాను రూపొందించారు. కానీ వాస్తవంలో ఆయన వ్యాఖ్యలు అందుకు విరుద్ధంగా ఉన్నాయి. గడ్డం శ్రీను హత్యకేసు, దానిపైకోర్టులు చేసినవ్యాఖ్యలను దృష్టిలో పెట్టుకొని ఈ ప్రభుత్వాన్ని జస్టిస్ చంద్రుగారు ప్రశ్నించి ఉండాల్సింది.
రాష్ట్రవ్యాప్తంగా వైసీపీప్రభుత్వం అధికారంలోకివచ్చాక 200మంది దళితులపై దాడులుజరిగాయి.
రాజమహేంద్రవరంలో 13చిన్నారిని పాశవికంగా అత్యాచారంచేసి, అమల్లో లేని చట్టంపేరుతో ఏర్పాటుచేసిన దిశా పోలీస్ స్టేషన్ ఎదుటేపడేసి వెళ్లిపోయారు. అలానే ముఖ్యమంత్రి సొంతనియోజకవర్గంలో నాగమ్మ అనే దళితమహిళను దారుణంగా సామూహికంగా చెరిచి హత్యచేశారు. ఈ పచ్చినిజాలేవీ జస్టిస్ చంద్రుగారికి తెలియవా అని ప్రశ్నిస్తున్నాం. ఇలాంటి ఘటనలు మర్చి పోయినట్టగా జస్టిస్ చంద్రులాంటి వారు మాట్లాడటం నిజంగా బాధాకరం. ప్రతి మనిషి ఏదో ఒకసందర్భంలో మానవత్వం వైపు ప్రయాణించాలి.
జస్టిస్ చంద్రుగారు బ్రాహ్మణకులంలో పుట్టారు. అదేకులంలో పుట్టి, అభ్యుదయ సమాజంకోసం, బడుగు బలహీన వర్గాలకోసం పోరాడిన మహానుభావులు కన్నభిరామ్, బాలగోపాల్ వంటివారు. వారుపుట్టింది బ్రాహ్మణు లుగా అయినా సమసమాజస్థాపనకోసం, దళితులహక్కులకోసం పోరాడారు. వారితత్వం ఎప్పుడూ మానవత్వాన్ని, ప్రజలసుఖసంతోషాలను, వారిస్వేఛ్చనే కోరుకుంది. చనిపోయే వరకు కూడా వారుఎలాంటి ప్రలోభాలకు, ఆకర్షణలకు లోనుకాకుండా నమ్మినదారిలోనే పయనించారు. అలాంటి మహోన్నతులబాటలో నడవాల్సిన చంద్రుగారు, రాజకీయ ప్రయోజనాలకు లొంగిపోయి, న్యాయస్థానాలపై విపరీతమైన వ్యాఖ్యలుచేయడం ఎంతమాత్రం క్షంతవ్యం కాదు.
రాష్ట్రంలో యథేచ్ఛగా మానవహక్కుల ఉల్లంఘన జరుగుతుంటే, రాష్ట్రంలోని కోర్టులు ప్రభు త్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నాయని చంద్రుగారు చెప్పడం ఎంతటి బాధాకరం. ఎన్నికల కు ముందు ఈ ముఖ్యమంత్రిఇచ్చిన హామీలపై ప్రశ్న్నించినవారిని, ఉద్యోగాలపై పాలకుల ను నిలదీసిన వాళ్లను జైళ్లకు పంపిన ఫాసిస్ట్ ప్రభుత్వం ఈ ప్రభుత్వం. ప్రభుత్వం అన్నివిధా లాప్రజలను హింసిస్తున్న ప్రస్తుతతరుణంలో, ఇక్కడి న్యాయస్థానాలు మానవహక్కులను కాపాడుతున్నాయి. అలానే చంద్రుగారు ప్రభుత్వం, ప్రత్యర్థులపై కంటే కోర్టులపైనే ఎక్కువగా పోరాడాల్సి వస్తోందని కూడా అన్నారు.
కోర్టులకు, ప్రభుత్వానికి ఎక్కడైనా పోరాటం ఉంటుం దా అని ప్రశ్నిస్తున్నాం. ప్రభుత్వంఅనేది రాజ్యాంగంలో ఒక విభాగమైతే, కోర్టులు మరో విభాగం. అలాంటివ్యవస్థలు ఏసందర్భంలో కలహించుకుంటాయి? సాధారణంగా రాజకీయ పార్టీల్లో ఒకదానికి ఒకటి శత్రువులుగా ఉంటాయి. కానీ ప్రభుత్వాలకు కోర్టులు శత్రువలని చంద్రుగారి లాంటి వారు మాట్లాడటంనిజంగా సిగ్గపడాల్సిన విషయం.
రాష్ట్రంలోని వనరుల ను దోచుకుంటూ, ప్రజలకు ఇచ్చిన హమీలను విస్మరించి, వారిని చంపుకుతింటున్న పాలకులతీరుని,ప్రభుత్వ దుర్మార్గాలను న్యాయస్థానాలు ప్రశ్నించకూడదన్నది చంద్రు ద్దేశమా?
అలాంటి ప్రభుత్వాన్ని ఏప్రయోజనాలకోసం చంద్రుగారు వెనకేసుకువస్తున్నారని ప్రశ్నిస్తున్నాం. జస్టిస్ కనగరాజ్ ని ఎస్ఈసీగా నియమిస్తామనిచెప్పి, చివరకు ఆయన్ని అవమానించిన ఈప్రభుత్వతీరుని చంద్రుగారు మర్చిపోతేఎలా? చట్టవిరుద్ధంగా ప్రభుత్వం కనగరాజ్ ని ఎస్ఈసీగా నియమించి, ఎంతగా అభాసుపాలు అయ్యిందో, దానికిరెండింతలు కనగరాజ్ గారు అభాసుపాలుకాలేదా? ఆయనకుఇచ్చినట్టే తనకు కూడా ఏవైనా పదవులు ఇస్తారని మాజీన్యాయమూర్తి గారుఆశపడ్డారా? ఏమిఆశించి చంద్రుగారు రాష్ట్రంలోని దౌర్బాగ్య, అరాచక, టెర్రరిస్ట్ ప్రభుత్వానికి మద్ధతు ప్రకటించారో ఆయనే చెప్పాలి.
ప్రభుత్వం అనేది కొన్నివ్యవస్థల సమూహం. అది ప్రజలకోసం, వారిస్వేఛ్ఛకోసం పనిచేయాలి. అలా జరగనప్పుడే న్యాయస్థానాలు జోక్యంచేసుకుంటాయి. అవి తనచర్యలకు అడ్డువస్తున్నాయని భావించి, ఆఖరికి ఈ ముఖ్యమంత్రి న్యాయమూర్తులకు కులాన్ని ఆపాదించాడు. అలాంటి వ్యక్తి జస్టిస్ చంద్రుగారికి ఎలాఆదర్శప్రాయుడు అయ్యాడని ప్రశ్నిస్తు న్నాం. ఈ పాలకులు ఏవైనా అవకాశాలుఇస్తారనే చంద్రుగారు అలామాట్లాడిఉంటే, ఆయన తక్షణమే తనవ్యాఖ్యలను వెనక్కుతీసుకొని, రాష్ట్రహైకోర్ట్ కి, దేశ అత్యున్నతన్యాయస్థానానికి బహిరంగక్షమాపణచెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. అప్పుడే చంద్రుగారిపట్ల అందరికీ గౌరవ ఉంటుంది.

LEAVE A RESPONSE