Suryaa.co.in

Andhra Pradesh

సచివాలయాల సిబ్బంది నిత్యం క్షేత్రస్థాయిలో పర్యటించాలి

-ప్రజా సమస్యల పరిష్కారం నిర్ణీత గడువులోగా జరగాలి
-ముత్యాలంపాడు 211 వ వార్డు సచివాలయాన్ని సందర్శించిన ఎమ్మెల్యే మల్లాది విష్ణు

ప్రభుత్వ సేవలు, సంక్షేమ పథకాల అమలు శాచ్యురేషన్ పద్ధతిలో జరగాలని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. ముత్యాలంపాడులోని 211 వ వార్డు సచివాలయాన్ని స్థానిక కార్పొరేటర్ పెనుమత్స శిరీష సత్యంతో కలిసి ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. వార్డు సచివాలయంలో విధులు నిర్వహిస్తున్న సిబ్బందితో ముఖాముఖి మాట్లాడారు. వారి దైనందిన విధులు, ప్రజలకు అందుతున్న సేవలపై ఆరా తీశారు. వివిధ విభాగాల సెక్రటరీలు వారి వారి డైలీ విధులను ఖచ్చితంగా డైరీలో పొందుపరచాలన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం నిర్ణీత గడువులోగా జరగాలని ఆదేశించారు.

ఏదైనా సమస్యతో సచివాలయానికి వచ్చేవారు ఎవరూ కూడా నిరుత్సాహంతో వెనుదిరిగే పరిస్థితి ఉండకూడదన్నారు. అనంతరం వివిధ కారణాలతో పింఛన్ నిలుపుదల చేయబడిన దరఖాస్తులను
IMG-5902 పరిశీలించారు. అర్జీలను రీ వెరిఫికేషన్ చేసి అర్హుల జాబితాను ఆన్ లైన్ లో నమోదు చేయవలసిందిగా వెల్ఫేర్ సెక్రటరీలను ఆదేశించారు. ఈబీసీ నేస్తం పథకాన్ని అర్హులైన ప్రతిఒక్కరూ సద్వినియోగపరచుకునేలా చూడాలన్నారు.

అలాగే హెల్త్ సెక్రటరీలు ఆశా వర్కర్లతో కలిసి ఇంటింటికీ వెళ్లి 15 నుంచి 18 సంవత్సరాల మధ్య వయస్సు వారికి తప్పనిసరిగా వ్యాక్సినేషన్ జరిగేలా చూడాలన్నారు. పారిశుద్ధ్యం నిర్వహణ మరియు శానిటేషన్ సిబ్బంది పనితీరుపై ఎప్పటిప్పుడు క్షేత్రస్థాయిలో ప్రజాభిప్రాయాలను సేకరించాలని సచివాలయ సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో నాయకులు పట్టాభి రామరాజు, చిన్నా, మానం వెంకటేశ్వరరావు, కల్వకొల్లు వెంకటేశ్వరరావు, సుబ్బరాజు, అంగిరేకుల విజయ్, బెజ్జం రవి, ఇతర నాయకులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

LEAVE A RESPONSE