సమస్యలు పరిష్కరించాలంటూ ఎన్‌ఎంఆర్, దినసరి వేతన సంయుక్త కార్యాచరణ కమిటీ చేపట్టిన నిరసన కార్యక్రమానికి పీఆర్సీ సాధన సమితి సంఘీభావం తెలిపింది. సర్వీసు క్రమబద్ధీకరణ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తెచ్చేందుకు ” సీఎంకు వేడుకోలు సభ” పేరుతో విజయవాడలో సభ నిర్వహించారు.
సమస్యలు పరిష్కరించాలంటూ ఎన్‌ఎంఆర్, దినసరి వేతన సంయుక్త కార్యాచరణ కమిటీ చేపట్టిన నిరసన కార్యక్రమానికి పీఆర్సీ సాధన సమితి సంఘీభావం తెలిపింది. సర్వీసు క్రమబద్ధీకరణ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తెచ్చేందుకు ” సీఎంకు వేడుకోలు సభ” పేరుతో విజయవాడలో సభ నిర్వహించగా.. పీఆర్సీ సాధన సమితి సభ్యులైన సూర్యనారాయణ, బండి శ్రీనివాస్, బొప్పరాజు వెంకటేశ్వర్లు, పీడీఎఫ్ ఎమ్మెల్సీలు హాజరై.. తమ మద్దతు ప్రకటించారు.
ఎన్‌ఎంఆర్, దినసరి వేతన పార్ట్, ఫుల్ టైమ్, కన్సాలిడేటెడ్ ఉద్యోగుల న్యాయబద్ధమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తమ గోడు ఆలకించాలని ఎన్‌ఎంఆర్, దినసరి వేతన సంయుక్త కార్యాచరణ కమిటీ విజ్ఞప్తి చేసింది.