– కానిస్టేబుళ్ళుకు తీవ్ర గాయాలు
తూర్పు గోదావరి జిల్లా ఆలమూరు ఎక్సైజ్ పోలీసులపై సారా వ్యాపారులు దాడిచేశారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో నాటుసారా బట్టీల పై దాడులు కు వెళ్ళిన ఎక్సైజ్ పోలీసులపై నాటు సారా తయారీ దారులు
దాడులకు తెగబడ్డారు.కానిస్టేబుళ్ళుకు గాయాలు అవడంతో వీరిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సంఘటన స్థలాన్ని అమలాపురం ఎక్సైజ్ అడిషనల్ సూపర్డెంట్ శ్రీనివాస్ సందర్శించారు. ఆలమూరు యస్ .ఐ. శివ ప్రసాద్ ఆస్పత్రికి చేరుకొని విచారణ జరిపి నిందితులు ఆరుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.