-బాబాయ్ హత్యకేసుపై సీబీఐ నమోదుచేసిన తాజా ఛార్జ్ షీట్ పై జగన్మోహన్ రెడ్డి నోరువిప్పాల్సిందే
-చార్జ్ షీట్ లోపేర్కొన్నట్టుగా హత్యతో సంబంధమున్న రాజకీయప్రముఖుల ఆటకట్టించేవరకు సీబీఐ నిద్రపోకూడదు
-టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు, మాజీఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు
జగన్మోహన్ రెడ్డి సొంతబాబాయ్ వై.ఎస్.వివేకానందరెడ్డిని అత్యంత కిరాతకంగా హత్యచేసి, సహజమరణంగా చిత్రీకరించాలని ప్రయ త్నించారని, 2019 ఎన్నికలకు ముందు ఇప్పటిముఖ్యమంత్రి, అప్పటిప్రతిపక్షనేత తనగెలుపుకు సొంతబాబాయ్ చావుని విని యోగించుకున్నాడని, తాజా సీబీఐ ఛార్జ్ షీట్ పై జగన్మోహన్ రెడ్డి ప్రజలముందు నోరువిప్పాల్సిందేనని టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు, మాజీశాసన సభ్యులు బొండా ఉమామహేశ్వ రరావు పేర్కొన్నారు.బుధవారం ఆయనమంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.ఆవివరాలు ఆయన మాటల్లోనే క్లుప్తంగా మీకోసం…
వివేకాహత్యతో జగన్మోహన్ రెడ్డికి, వైసీపీకి ఏం సంబంధం లేదన్న ట్లుగా నిన్నకొందరు సలహాదారులు మీడియాతో చెప్పుకొచ్చారు. చేతిలో సాక్షిఇతర అనుకూల మీడియాఉందికదా అని ఏదిపడితే అదిచెప్పి, ఎదుటివారిపై బురదజల్లుతామంటే కుదరదు. వివేకా హత్యజరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏంమాట్లాడారో, విజయసా యిరెడ్డి ఏంచెప్పారో,సాక్షిమీడియా ఎలాంటికట్టుకథలు వండి వార్చిందో అందరికీ తెలుసు. దానికి సంబంధించిన వీడియోలు, ఇతరత్రా సాక్ష్యాధారాలు మావద్ద ఉన్నాయి. వాటిని ప్రజలముందు పెట్టాకే మాట్లాడతాం.(ఈ సందర్భంగా బొండా ఉమా వివేకా హత్యజరిగిన సమయంలో జగన్మోహన్ రెడ్డి, విజయసాయిరెడ్డిఏం చెప్పారు..సాక్షిమీడియాలో ఏమనిప్రసారం చేశారనేదానికి సంబం ధించిన వీడియోలను విలేకరులకు ప్రదర్శించారు)
హత్యజరిగినప్పుడుఏదేదో చెప్పి,ఎదుటివారిపై నిందలేసిన జగన్మో హన్ రెడ్డి, ఎన్నికలయ్యి అధికారంలోకివచ్చాక బాబాయ్ హత్య కేసుని తప్పుదారిపట్టించడానికి తనఅధికారాన్ని వినియోగించా డు, ఇప్పటికీ వినియోగిస్తున్నాడు. వివేకాను హతమార్చి, తల్లి తరువాత తల్లి, చెల్లి తరువాత చెల్లిఅయిన సొంతపిన్ని, చెల్లెమ్మల ను కూడా మోసగిస్తూ, తనబంధువు, ఎంపీ అయిన వై.ఎస్. అవి నాశ్ రెడ్డిని కాపాడుకోవడానికి ముఖ్యమంత్రి ఈ మూడేళ్లలో చేయ ని ప్రయత్నమంటూ లేదు. మూడేళ్లలో ఢిల్లీవెళ్లి, ప్రధానిమోదీని, అమిత్ షాని కలిసినప్రతిసారీ వివేకాహత్యకేసులో అవినాశ్ రెడ్డిని, తనను బయటేయాలనే జగన్మోహన్ రెడ్డి వేడుకున్నాడు. తాజాగా సీబీఐ వేసిన ఛార్జ్ షీట్ గమనిస్తే, అసలుదోషులెవరో, ఎవరి అండ దండలతో వివేకానందరెడ్డి హత్యజరిగిందో అర్థమవుతోంది.
వివేకాహత్యజరిగిన తెల్లారక ఉదయం 6గంటలకే తొలిసారి వివేకా ఇంట్లోకి వెళ్లింది వై.ఎస్.అవినాశ్ రెడ్డి, ఇప్పుడు ఏ5గా ఉన్న దేవి రెడ్డి శంకర్ రెడ్డే. వివేకానందరెడ్డి పీఏ జిల్లాఎస్పీకి ఫోన్ చేసి, రక్తం కక్కకొని చనిపోయాడని చెప్పారు. సాక్షి మీడియాలో ఉదయం 7 గంటలప్రాంతంలో గుండెపోటుతో చనిపోయాడని, తరువాత హత్య చేశారని కథనాలుప్రసారం చేయించారు. వివేకానందరెడ్డి కుటుంబ సభ్యులు, పోలీసులు ఘటనా స్థలికి వెళ్లాకే అసలువాస్తవాలు బయటకువచ్చాయి.
వాళ్లేహత్యకు ప్లాన్ చేసి, హతమార్చి, హత్యచేసినవారిని, చేయిం చినవారిని వెనకేసుకురావాలని, కాపాడాలని ప్రయత్నిస్తున్నా రు. ఆక్రమంలోనే బరితెగించిమరీ చంద్రబాబునాయుడిపై, లోకేశ్ గారిపై నిస్సిగ్గుగా ఆరోపణలుచేశారు. కరుడుగట్టిన నేరగాళ్లే రాష్ట్రా న్ని పాలిస్తున్నారు అనడానికి వివేకాహత్యోదంతమే నిదర్శనం. వి వేకాహత్యలో ఎవరు ఏ పాత్రపోషించాలి..ఎవరినిఎలా వాడుకోవాల నేది ముందుగానే నిర్ణయించిమరీ అమలుచేశారు. వివేకాహత్యకు రూ.40కోట్లు ఇచ్చింది అవినాశ్ రెడ్డి అయితే, అతన్ని కాపాడటా నికి రంగంలోకి దిగింది జగన్మోహన్ రెడ్డి. హత్యచేసిన గంగిరెడ్డి, దేవిరెడ్డి శంకర్ రెడ్డి, సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి, వివేకామాజీ డ్రైవర్ దస్తగిరి అందరూ అవినాశ్ రెడ్డి అనుచరులే. ఇంతపకడ్బందీగా వారేహత్యకు పథకరచనచేసి, పనిముగించేశా క, ఎన్నికలు ముగిసేవరకు ఆగి, ఆ నేరాన్ని టీడీపీపై వేయడానికి శతవిధాలాప్రయత్నించారు.
జగన్మోహన్ రెడ్డికి, వివేకాహత్యతో సంబంధంలేకపోతే, ఎన్నికల సమయంలో వివేకా హత్య కేసు వివరాలు బయటకు రాకూడదంటూ హైకోర్ట్ నుంచి గ్యాగ్ ఆర్డర్ తీసుకొచ్చాడు. మరలా ఆయనే ఏమీ తెలియనట్టు సీబీఐతో విచారణజరిపించాలంటూ కోర్టులో పిటిషన్ వేశాడు. ఎన్నికలుముగిసి, తాను ముఖ్యమంత్రి అయ్యాక వివేకా హత్యకేసు విచారణను వేగవంతంచేయించాల్సిన వ్యక్తే, సీబీఐవిచా రణకోరుతూ తానువేసిన పిటిషన్ ను వెనక్కుతీసుకున్నాడు. ఎందుకలాచేశాడంటే ఇప్పటికీ సమాధానంలేదు.
హత్యజరిగిన వెంటనే హైదరాబాద్ నుంచి కడపకు విమానంలో రావాల్సిన జగన్మోహన్ రెడ్డి, నింపాదిగా 10, 15 గంటలు ప్రయాణించి, మార్చి 16 సాయంత్రానికి రోడ్డుమార్గంలో కడపకువచ్చాడు. హత్యజరిగిం ది మార్చి15 తెల్లవారుజామున అయితే, జగన్మోహన్ రెడ్డిఎప్పుడో మార్చి 16సాయంత్రానికి వచ్చాడు. ఈలోపు ఆయన మార్గదర్శకంలో అవినాశ్ రెడ్డి, వివేకాఇంటిలోని సాక్ష్యాధారాలను రూపుమాపాడు.
హత్యజరిగినప్పుడు స్థానికసీఐ అక్కడకు వెళ్లే అతన్ని లోపలకుకూడా వెళ్లకుండాఅడ్డుకున్నారు. ఇదంతా ఎందు కుచేశారు? ఎవరుచెబితే చేశారు? ఈప్రశ్నలన్నింటికీ ముఖ్యమం త్రి సమాధానంచెప్పాల్సిందే.
జగన్మోహన్ రెడ్డి తీరుగమనించాక, విసిగిపోయిన వివేకాకుమార్తె, డాక్టర్ సునీత ఢిల్లీకి సూట్ కేసులో ఆధారాలు తీసుకొనిమరీ వెళ్లారు. ఢిల్లీ వీధుల్లో కన్నీళ్లుపెట్టుకుంటూ ఆమెతిరుగుతుంటే, చూసిన ప్రతిఒక్కరి హృదయం చివుక్కుమంది.
సీబీఐ నిందితులుగా గుర్తించిన గంగిరెడ్డి, ఉమాశంకర్ రెడ్డి, దేవిరెడ్డి శంకర్ రెడ్డి, సునీల్ యాదవ్ అందరూ వైసీపీవారే. వారికి ఎంపీ అవినాశ్ రెడ్డికి సన్నిహితసంబంధాలున్నాయి. ఈ కథంతా ఎవరునడిపిస్తున్నారో ముఖ్యమంత్రికి బాగాతెలుసు. కానీ ఆయన ఇప్పటికీ ఏమీతెలియనట్టే నటిస్తూ, తన లప్పంటప్పంగాళ్లను మీడియాముందుకు పంపిస్తుంటాడు. నిన్నటికి నిన్న సలహాదా రుననిచెప్పుకునే వ్యక్తి మాట్లాడుతూ, సీబీఐని టీడీపీ మేనేజ్ చేస్తోందంటూసిగ్గులేకుండా మాట్లాడుతున్నాడు.
సీబీఐ అధికారులుగా పొరపాటునఎవరైనా ఆంధ్రావాళ్లు ఉండుంటే, వారికి కులాలుఆపాదించి చంద్రబాబు వారిని ఆడిస్తున్నాడని కూడా ఈ దుర్మార్గులు చెప్పడానికి వెనుకాడేవారుకాదు. హత్యచే సి, ఆధారాలతోసహా దొరికాక కూడా ఇంకాబుకాయిస్తున్నారు. సీబీఐ ఛార్జ్ షీట్ లో కడపఎంపీసీటు విషయంలోనే వివాదం మొ దలైందని చాలాస్ఫష్టంగాచెప్పారు. ఆఎంపీస్థానాన్ని ఇస్తేతనకు ఇవ్వాలని, లేకుంటే మీ అమ్మవిజయమ్మకో, చెల్లిషర్మిలకో ఇవ్వా లని వివేకానందరెడ్డి పట్టుబట్టాడని, నీభార్యమేనమామ కొడుకైన అవినాశ్ రెడ్డికి ఇవ్వడానికి వీల్లేదని వాదించాడని ఛార్జ్ షీట్లో పేర్కొ న్నారు. ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డికి, వివేకానందరెడ్డికి కడపఎంపీ సీటువిషయంలో వాదోపవాదాలు జరిగాయనిచెప్పారు. తన ఎంపీసీటుకి అడ్డువస్తున్నాడనే వివేకానందరెడ్డి హత్యకు అవి నాశ్ రెడ్డి పక్కాపథకం వేశాడని సీబీఐ ఛార్జ్ షీట్ పేజీనెం-14లో, పేరానెం 16.9లో ఉంది. ఎంతోతరవుగా విచారించాకనే సీబీఐ ఈ వాస్తవాలుచెప్పిందా…లేక టీడీపీ చెప్పమంటే చెప్పిందా?
సీబీఐ విచారణ అంటే సవాంగం అన్నో, లవంగం అన్నో చేసే విచారణల్లా ఉండవు. నల్లగా ఉండే ఆ లవంగం అన్నఎవరో అంద రికీ తెలుసు. దస్తగిరి అప్రూవర్ మారినందుకే మిగతా నిందితులు కోర్టుకువెళ్లారు. అతను డబ్బుకు ఆశపడో, మరోకారణంతోనో తప్పు చేశాడు. సీబీఐవారుపట్టుకొని విచారించాక, తనకు తక్కువ శిక్షపడేలా చేయాలనికోరుతూ అప్రూవర్ గామారితే, దేవిరెడ్డి శంకర్ రెడ్డి, సునీల్ యాదవ్ మరికొందరుఅతను అప్రూవర్ గా మారడానికి వీల్లేదంటూ కోర్టుకువెళ్లారు. ఎక్కడైనా ఇలాంటి వింత లు ఉన్నాయా? హత్యకేసువిచారణ ముందుకుసాగకూడదని తొలుత సీబీఐని బ్లాక్ మెయిల్ చేశారు…అక్కడనుంచి అడుగడుగునా బెదిరింపులు, భయపెట్టడాలు జరుగుతూనే ఉన్నాయి. ఆఖరికి ఎంతగా బరితెగించారంటే ఈప్రభుత్వ అండదం డలతో కోర్టులను, న్యాయమూర్తులను కూడా బెదిరించేస్థాయికి వెళ్లారు. సీబీఐని బెదిరించి, సదరు అధికారులెవరూ కేసువిచారణలో ముందుకు వెళ్లకూడదనే వివేకా హత్య కేసుతో సంబంధంలేని వాళ్లతో పోలీసులకు ఫిర్యాదులు చేయించారు.
సీబీఐ పేర్కొన్న నిందితుల్లో ఏ5శివ శంకర్ రెడ్డి, వివేకాఇంట్లోని పనిమినిషి రామిడిలక్ష్మితో రక్తపుమరకలు తుడిపించాడనికూడా చార్జ్ షీట్లో చెప్పారు. ఇదంతా ఒకెత్తు అయితే, వివేకానందరెడ్డి మృతదేహానికి గంగిరెడ్డి ఆసుపత్రినుంచి గజ్జల జయప్రకాశ్ రెడ్డి అనే కాంపౌండర్ వెళ్లి, రక్తపు మరకలు,గొడ్డలి గాట్లు కనపడకుండా కట్లుకట్టాడు. సదరు కాంపౌండర్ జగన్మోహన్ రెడ్డి భార్యభారతి గారి తండ్రిగారైన గంగిరెడ్డి ఆసుపత్రిలోపనిచేస్తాడని కూడా సీబీఐ ఛార్జ్ షీట్లో పేర్కొంది.
ఈ విధంగా అనేకఆధారాలు ఎవరుహత్యచేయించారో… ఎవరు చెబితే చేశారో స్పష్టంగా సీబీఐ చెబుతుంటే, పనికిమాలిన సలహా దారులు అమాయకుడైన అవినాశ్ రెడ్డిని హత్యలో ఇరికించాలని చూస్తున్నారంటూ మొసలికన్నీరుకారుస్తున్నారు.
సీబీఐ వివేకాహత్యకేసులో మిగతారాష్ట్రాల్లో మాదిరి విచారణచేస్తే కుదరదు.. ఏపీలో పెద్ద క్రిమినల్ గ్యాంగ్ ఉందని గ్రహించాలి.. ముఖ్యమంత్రి, ప్రభుత్వం తనకు అండగాఉన్నారని అవినాశ్ రెడ్డి చెలరేగిపోయాడు. సీబీఐ విచారణ ఇంకా లోతుగా సాగాల్సిన అవసరం ఉంది. వివేకాహత్యకేసులో నిందితులుగా పేర్కొన్నవారి ని హతమార్చే కుట్రలకు తెరలేపారు. ఆక్రమంలోనే వరుణారెడ్డిని కడపజైలర్ గా నియమించారు. గతంలోపరిటారవి హత్యకేసులో నిందితులను ఇలానే హతమార్చారనే విషయంఅందరికీ తెలుసు. మొద్దుశీను ని జైల్లోచంపినప్పుడు, అప్పుడు జైలర్ గా వరుణా రెడ్డే ఉన్నాడు. వరుణారెడ్డి నియామకంపై టీడీపీ నిలదీయబట్టే, అతన్ని వెంటనే ప్రకాశంజిల్లా జైలర్ గా బదిలీచేశారు.
సీబీఐ మిగ తారాష్ట్రాల్లో, మిగతాకేసులమాదిరి వివేకాహత్యకేసు విచారిస్తేకుద రదని చెబుతున్నాం. ఎందుకంటే ఏపీలో పెద్దక్రిమినల్ గ్యాంగ్ ఉంది. దానికి పాలకుల అండదండలున్నాయి. వివేకాహత్యకేసు లో నిందితులైన వారిప్రాణాలకు రక్షణకల్పించాల్సిన బాధ్యత కూడా సీబీఐపైనేఉంది. సీబీఐ ఇంతవరకు వై.ఎస్. అవినాశ్ రెడ్డిని ఎందుకు విచారించలేదు? వివేకా హత్య జరిగిప్పుడు రక్తపు మరకలు,ఇతర ఆధారాలు తుడిపేయడానికి ప్రయత్నించిన అవినాశ్ రెడ్డిని విచారించరా? అలానే వివేకా గుండెపోటుతో చనిపోయాడని తప్పుడు ప్రకటనలు ఇచ్చిన విజయసాయిరెడ్డి, వివేకాహత్యపై తప్పుడుకథనాలుప్రసారం చేసినసాక్షిమీడియాను సీబీఐ ఎందుకు విచారించలేదు? ఎప్పుడు విచారిస్తుంది? వారివిచారణ అంతా ఒకెత్తు అయితే, వివేకాహత్య గురించి పచ్చిఅబద్ధాలుచెప్పి, ఆ నేరాన్ని టీడీపీఅధినేతచంద్రబాబుకి ఆపాదించి, తన రాజకీయ పబ్బం గడుపుకున్న జగన్మోహన్ రెడ్డిని సీబీఐఎందుకు విచారించడంలేదు? పైపైవిచారణలకాదు సీబీఐ చేయాల్సింది.
వివేకాహత్య కేసులో ప్రధాననిందితులైన రాజకీయ ప్రముఖుల ఆటకట్టించాల్సిందేనని డిమాండ్ చేస్తున్నాం. సీబీఐ ఛార్జ్ షీట్ లో హత్యకు రూ.40కోట్లు వెచ్చించారని చెప్పింది. రూ.40కోట్ల డీల్ వ్యవహారంపై ఈడీకూడాదృష్టిసారించాలి. సీబీఐ తాజా ఛార్జ్ షీట్ పై ముఖ్యమంత్రి ప్రజలముందుకు వచ్చి నోరువిప్పాల్సిందే. తన కంటిసిద్ధాంతం గురించి ప్రజలకు అర్థమయ్యేలాచెప్పాలి. జగన్మోహ న్ రెడ్డి ఆదేశాలతోనే కడపఎంపీ అవినాశ్ రెడ్డి, వివేకానందరెడ్డిని హత్యచేయించాడని సీబీఐ ఛార్జ్ షీట్ క్లియర్ కట్ గాఉంటే, వైసీపీ వాళ్లు ఇప్పటికీ సిగ్గులేకుండా బుకాయింపులకే ప్రాధాన్యత ఇస్తు న్నారు. సొంత బాబాయ్ ని చంపించి, చంపినవారిని అధికారంలో ఉన్నవారే కాపాడుతుంటే, ఇకసామాన్యప్రజల పరిస్థితేమిటో చెప్పక్కర్లేదు. ప్రముఖుడి హత్యకేసువిచారణలో నిందితులకు శిక్షపడకపోతే, వ్యవస్థలపైనే ప్రజలకునమ్మకంపోతుంది.