గుంటూరు జిల్లాలో దారుణ హత్యకు గురైన తెదేపా నేత తోట చంద్రయ్య హత్య కేసు నిందితులకు.. గురజాల సెషన్స్ కోర్టు బెయిల్ నిరాకరించింది. బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేస్తారన్న బాధితుడి తరఫు న్యాయవాదల వాదనతో ఏకీభవించిన న్యాయస్థానం బెయిల్ నిరాకరించింది.
గుంటూరు జిల్లా మాచర్లలో దారుణ హత్యకు గురైన తెదేపా నేత తోట చంద్రయ్య హత్య కేసు నిందితులకు కోర్టు బెయిల్ నిరాకరించింది. నిందితుల బెయిల్ పిటిషన్పై గురజాల సెషన్స్ కోర్టులో ఇవాళ విచారణ జరిపింది. నిందితులకు బెయిల్ ఇచ్చేందుకు అభ్యంతరం లేదని పీపీ వాదించారు.
తోట చంద్రయ్య తరఫున వాదనలు వినిపించిన న్యాయవాదులు శ్రీనివాస్, బాలకృష్ణ.. నిందితులకు బెయిల్ ఇచ్చేందుకు వీల్లేదన్నారు. ప్రధాన నిందితుడు చికిత్స పేరుతో ఆస్పత్రిలో ఉన్నారన్న న్యాయవాదులు.. బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేస్తారని వాదించారు. వాదనలు విన్న న్యాయస్థానం.. బెయిల్ పిటిషన్ను తిరస్కరించింది.