Suryaa.co.in

Andhra Pradesh

కొత్త జిల్లాలతో ఒక్క ఉద్యోగమైనా వస్తుందా?

– యువతకు హామీ ఇచ్చిన విధంగా 2.30లక్షల ఉద్యోగాలు ఎప్పుడిస్తాడో చెప్పని జగన్ రెడ్డి.. అభివృద్ధికోసమే జిల్లాలంటే ఎవరునమ్ముతారు? టెన్త్ ఫెయిల్ అయిన బ్యాచ్ తీసుకునే నిర్ణయాలు ఇలానేఉంటాయి.
• కొత్తజిల్లాలతోనే అభివృద్ధి అయితే 175 నియోజకవర్గాలను 175జిల్లాలు చేయమనండి
• పరిపాలన కేంద్రకృతమై.. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని చంద్రబాబుగారు ఆలోచించారు. ఆక్రమంలోనే ఉత్తరాంధ్రనుంచి రాయలసీమవరకు అనేకరకాల పరిశ్రమలు తీసుకొచ్చారు
• జగన్ రెడ్డి ఈ మూడేళ్లలో ఒక్కపరిశ్రమ అయినా తీసుకొచ్చి… ఒక్కఉద్యోగమైనా ఇచ్చాడా?
– టీడీపీ జాతీయప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారాలోకేశ్

అమరావతి : రాజధాని అమరావతివిషయంలో కేంద్రంచేసినచట్టాన్ని కాదని, కేంద్రప్రభుత్వంలోని వ్యవస్థల ఆదేశాలనుకాదని జగన్ రెడ్డిప్రభుత్వం కొత్తచట్టాలు తీసుకొచ్చి, ప్రజలఅభీష్టానికి విరుద్ధంగా మూడురాజధానులంటూ ముందుకెళ్లిందికాబట్టే న్యాయస్థానం తప్పుపట్టిందని, యాక్ట్ ఆఫ్ పార్లమెంట్ నుకాదని ఏపీ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకునేఅధికారం లేదని స్పష్టంచేసిందని టీడీపీ జాతీయప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేశ్ తేల్చిచెప్పారు.గురువారం ఆయన శాసనమండలిప్రాంగణంలో మీడియావారితో మాట్లాడారు. ఆ వివరాలు క్లుప్తంగా ఆయన మాటల్లోనే…

మంత్రులంతా పదోతరగతి ఫెయిల్ అయినవారు.. ముఖ్యమంత్రి ఏం చదివారో ఎవరికీ తెలియదు కాబట్టే ఇలాంటి పరిస్థితిని రాష్ట్రం ఎదుర్కొంటోంది. ఏపీ రీ ఆర్గనైజేషన్ యాక్ట్ అనేది యాక్ట్ ఆఫ్ పార్లమెంట్. ఈ వాస్తవం కూడాతెలియని వారు చట్టాలు చేసేస్థానాల్లో ఉండటం రాష్ట్ర్రప్రజల ఖర్మ. ఏపీ రాజధాని అమరావతి అని లోక్ సభలో, రాజ్యసభలో ఆమోదంపొందాకే నిర్ణయం తీసుకోవడం జరిగింది.
మూడురాజధానుల నిర్ణయాన్నికూడా పార్లమెంట్ ఆమోదంతోనే జరగాలని ఏపీప్రభుత్వానికి అలాంటి అవకాశం లేదని న్యాయస్థానంస్పష్టం గాచెప్పింది. చంద్రబాబు గారి ఆలోచనావిధానం మొదటినుంచీ ఒక్కటే. పరిపాలన కేంద్రీకృతంకావాలి.. అభివృద్ధి వికేంద్రీకరించబడాలని. టీడీపీ హయాంలో రాష్ట్రంలోజరిగిన అభివృద్ధిగురించి చెబితే, ఇప్పుడు సమయంకూడా సరిపోదు.

అనంతపురంలో కియా మోటార్స్ ఎక్కడినుంచి వచ్చింది? చిత్తూరుజిల్లా శ్రీసిటీలోసెల్ కాన్ సహా, ఇతర సెల్ ఫోన్ తయారీ పరిశ్రమలు.. కర్నూలుజిల్లాలో మెగాసీడ్ పార్క్.. మెగా సోలార్ పార్క్… పశ్చిమ, తూర్పుగోదావరి జిల్లాల్లో పెద్దఎత్తున మత్స్యపరిశ్రమలు ఎవరు తీసుకొచ్చారు? విశాఖపట్నంలో అదానీ డేటా సెంటర్, హెచ్ సీఎల్ కంపెనీలు ఎలా వచ్చాయి? జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చి మూడేళ్లైంది.. ఒక్కపరిశ్రమ అయినా తీసుకొచ్చాడా? పరిశ్రమలు లేకుండా..యువతకు ఉపాధి కల్పించకుండా… రాష్ట్ర ఆదాయం పెంచకుండా.. ప్రజలకు ఇబ్బందిలేని సంక్షేమం అమలు చేయకుండా చిన్నజిల్లాలు చేస్తే అభివృద్ధిజరుగుతుందా? టెన్త్ ఫెయిల్ బ్యాచ్ కి ఏది అభివృద్ధో..ఏది నాశనమో కూడా తెలియడంలేదు.

ఉభయసభల్లో, ప్రభుత్వంలోఉన్నవారంతా టెన్త్ ఫెయిల్ బ్యాచ్చే కదా.. వారికై వారు తెలుసుకోరు. మేంచెబితేనేమో వినరు. పొరుగు రాష్ట్రాలకు పెద్ద ఎత్తున పరిశ్రమలు వస్తున్నాకూడా మేల్కోకపోతే ఎలా? మొన్నటికి మొన్న తెలంగాణకు రూ.3,500కోట్ల పెట్టుబడితో, 10వేలఉద్యోగాలతో ఒకపరిశ్రమ వచ్చింది. ఏపీలో గతమూడేళ్లలో ఒక్కపరిశ్రమ అయినా వచ్చిందా? జిల్లాలతోనే అభివృద్ధి జరుగుతుందని ముఖ్యమంత్రి నమ్మితే.. 175నియోజక వర్గాలను 175జిల్లాలు చేయొచ్చుకదా! అసలుఎవరికీ ఎలాంటిబాధ ఉండదు.

డీసెంట్రలైజేషన్ అనేది ముఖ్యమైనఅంశమేకాదు. మండలాలవ్యవస్థను మహానుభావుడు ఎన్టీఆర్ గారుఎప్పుడో తీసుకొచ్చారు. దానివల్లే ప్రజలకు పాలనచేరువైంది. దానికి కొనసాగింపుగా చంద్రబాబుగారు అధికారయంత్రాంగం ప్రజలకు అందుబాటులో ఉండేలా ప్రజలవద్దకు పాలన పేరుతో కొత్తవిధానం అమలుచేశారు. కేవలం రాష్ట్రంలో ఉన్నసమస్యలను, ప్రజల ఆలోచనలను దారిమళ్లించడానికే జగన్ రెడ్డి.. కొత్తజిల్లాలు తీసుకొస్తున్నాడు. కొత్తజిల్లాలతో ముఖ్యమంత్రి ఏమైనా కొత్తఉద్యోగాలు ఇస్తాడా?

యువతకు గతంలో హామీఇచ్చిన విధంగా 2.30లక్షలఉద్యోగాలను ఏమైనా భర్తీచేస్తాడా? అది చేయడం చేతగాక.. ప్రజలఆలోచనలను దారిమళ్లించడానికే జగన్ రెడ్డి డీసెంట్రలైజేషన్ అంటున్నాడు. ముఖ్యమంత్రిచెబుతున్న కొత్తజిల్లాలు.. కొత్తచట్టాలతో ఎవరికీ ఎలాంటి ఉపయోగంలేదు. ఆయనకు తప్ప. ఇప్పుడు ఇక్కడున్న సెక్రటేరియట్ కే ఎవరినీ రానీయడంలేదు. అసలు ముఖ్యమంత్రే సెక్రటేరియట్ కురాడు. ఇక డీసెంట్రలైజేషన్ అయితే ఎవరుఎక్కడికి వెళ్లాలో..ఏఅధికారి ఎక్కడుండి పనిచేస్తాడో ఆ దేవుడికే తెలియాలి.

సాక్షి స్టేటస్… భారతి గోల్డ్. … బూమ్ బూమ్ బీర్ ఇవేనా ముఖ్యమంత్రి చెప్పిన నవరత్నాల బ్రాండ్లు. చంద్రన్నబీమా.. అంబేద్కర్ విదేశీవిద్య…అన్నాక్యాంటీన్లు… రంజాన్ తోఫా.. లాంటివి చంద్రబాబు గారి బ్రాండ్లు. అందుకే వాటన్నంటినీ జగన్ రెడ్డి తీసేశాడు. అలానే చంద్రబాబు గారు తెచ్చారంటున్న మద్యంబ్రాండ్లను కూడా తీసేయొచ్చుకదా! ఎందుకు ఊరికే అబద్ధాలుచెబుతూ తప్పించుకోవడం? జగన్ రెడ్డి హయాంలో.. ఆయన బినామీల కోసం వచ్చిన బ్రాండ్లు కాబట్టే, వాటిని ఈ ముఖ్యమంత్రి మూసేయడం లేదు.

ఆర్టీఐ (సమాచారహక్కుచట్టం) ద్వారా మాకు అందిన సమాచారం ప్రకారం… 140 కొత్తమద్యంబ్రాండ్లకు జగన్ రెడ్డే శ్రీకారం చుట్టాడు. ఎవరి హయాంలో ఏ బ్రాండ్లు వచ్చాయి..ఎంతఆదాయం వస్తోంది..ఎందరుకల్తీమద్యం, నాటుసారాకు బలవుతున్నారో మాట్లాడదామంటే ఛైర్మన్ మాకు అవకాశం ఇవ్వడు. వాయిదాతీర్మానం అంటారు… మాకు అవకాశం ఇవ్వరు. బుర్రకథలు,కట్టుకథలు చెప్పే మంత్రులకు మాత్రం అవకాశమిస్తారు.

LEAVE A RESPONSE