Suryaa.co.in

International

“తానా” అంతర్జాతీయ కవి సమ్మేళనానికి ఎంపికైన కవి/రచయిత “జె వి కుమార్ చేపూరి”

తానా ప్రపంచ సాహిత్య వేదిక ” భారతదేశ వజ్రోత్సవ వేడుకలు” పురస్కరించుకుని పలు సామాజిక అంశాలపై ప్రతిష్టాత్మకంగా ” అంతర్జాతీయ కవితల పోటీలు ” నిర్వహించింది. ఈ పోటీలో హైదరాబాదుకు చెందిన కవి/రచయిత జె వి కుమార్ చేపూరి ఎంపికయ్యారు . ఈ నెల (ఏప్రిల్) 24వ తేదీ తానా నిర్వహించ బోతున్న అంతర్జాతీయ అంతర్జాల దృశ్య సదస్సు “కవితాలహరి” – ప్రపంచ స్థాయి కవితా వేదిక మీద జె వి కుమార్ చేపూరి తమ కవిత ను వినిపించ బోతున్నారు .

“భారతదేశ సమగ్రత” అన్న ఇవ్వబడిన అంశంపై, జె వి కుమార్ చేపూరి సమర్పించిన “సర్వమత సారం మానవత్వం” అన్న వచన కవిత ఈ పోటీలో ఎంపిక కాబడినది. ఈ సృజనాత్మక కార్యక్రమంలో తన కవితను ఎంపిక చేసి అంతర్జాతీయంగా తనను పరిచయం చేస్తున్నందుకు తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు కి తానా ప్రపంచ సాహిత్య వేదిక సమన్వయకర్త చిగురు మళ్ళ శ్రీనివాసు కి, ప్రపంచ సాహిత్య వేదిక నిర్వహకులు డా. ప్రసాద్ తోటకూర కి జె వి కుమార్ చేపూరి కృతజ్జలు, ధన్యవాదాలు తెలియజేశారు.

అనేక మంది దేశ, విదేశ తెలుగు కవులు, ప్రముఖులు హజరయ్యే ఈ “తానా కవితాలహారి కార్యక్రమము తానా అధికారిక యూ ట్యూబ్ ఛానెల్ , ముఖపుస్తకం (ఫేస్ బుక్) ఛానల్ లో ప్రత్యక్ష ప్రసారం చేయ బడుతోంది. “యప్ టీవీ” ద్వారా అమెరికాతో పాటు, యూరప్ దేశాలలో ప్రత్యక్ష ప్రసారం చేయ బడుతోంది. ఈ టీవి – భారత్, మన టీవి , టీవి ఆసియా – తెలుగు , మరియు ఇతర మాధ్యమాలలో తెలుగులో ప్రసారం కానుంది .

వృత్తి రీత్యా వీరు విశ్రాంత ఫార్మా ఉద్యోగులు. ప్రవృతి రీత్యా కవి, రచయిత, సామాజిక కార్యకర్త. సృజనాత్మక రచనలు చేసే జె వి కుమార్ చేపూరి ఇంత వరకు 900 పై చిలుకు కవితలు, 30 పైగా వ్యాసాలు, 45 పైగా కథలు వ్రాసారు. వీరు వ్రాసిన రచనలలో సగానికి పైగా ఉత్తమ రచనలుగా ఎంపిక కాబడి, వివిధ దిన, వార, పక్ష, మాస పత్రికలలో ప్రచురణకు నోచుకోవడం విశేషం. జె వి కుమార్ చేపూరి అందుకున్న ప్రశంసాపత్రాలు, పురస్కారాలు లెక్కకు మించి.

సాహితీ రత్న, కవిరత్న, సహస్ర కవికిరణం, వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఇంటర్నేషనల్ పురస్కారం (రాసిన కొన్ని కవితలకు) మొదలైనవి, వీరు ప్రముఖుల చేతుల మీదుగా అందుకున్న పురస్కారాలలో కొన్నిమాత్రమే.

భాగ్య నగర తెలుగు సాహితీ సౌరభాన్ని ప్రపంచ స్థాయికి తీసుకు వెళ్ళిన జె వి కుమార్ చేపూరి పై తెలుగు సాహితీ ప్రియుల మరియు సాహితీ ప్రముఖుల ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

LEAVE A RESPONSE