Suryaa.co.in

Telangana

సుష్మాస్వరాజ్ లేకుంటే తెలంగాణ వచ్చేదా?

– మీకొచ్చిన పదవులు బీజేపీ పెట్టిన భిక్ష
– టీఆర్ఎస్ తోక పార్టీ
– ప్రపంచంలోనే అత్యధిక సభ్యత్వమున్న బీజేపీపై విమర్శలు సిగ్గు చేటు
– ఇతరుల చావును కోరుకునే మూర్ఖులు టీఆర్ఎసోళ్లు 10వ రోజు ప్రజా సంగ్రామ యాత్రలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఫైర్
– మక్తల్ నియోజకవర్గం క్రిష్ణంపల్లి చౌరస్తా వద్ద పాదయాత్ర 100 కి.మీలు పూర్తి
– పూలు చల్లి, కేక్ కట్ చేసి సంబురాలు జరుపుకున్న కార్యకర్తలు, స్థానిక ప్రజలు
బీజేపీలో పెద్ద ఎత్తున స్థానికుల చేరిక

టీఆర్ఎస్ పెట్టిన భిక్షవల్లే తనకు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి వచ్చిందంటూ టీఆర్ఎస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘‘ అరేయ్ పిచ్చోడా… ప్రపంచంలోనే అత్యధిక సభ్యత్వమున్న పార్టీ బీజేపీ. నరేంద్రమోదీ ఆధ్వర్యంలో నీతివంతమైన పాలన అందిస్తున్న పార్టీ. మీది తోక పార్టీ. దొంగ దీక్షలు, దొంగ హామీలతో మోసం చేసి అధికారంలోకి వచ్చిన పార్టీ. అవినీతి అక్రమాలకు కేరాఫ్ అడ్రస్ కేసీఆర్ కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడే సహారా, ఈఎస్ఐ స్కాంలకు పాల్పడితే సీబీఐ విచారణ జరిగింది. మీరా దేశం, ధర్మం కోసం పనిచేస్తున్న బీజేపీపై విమర్శలు చేసేది. మీకా నైతిక అర్హతే లేదు’’అంటూ మండిపడ్డారు.

తనకు పార్టీ పదవి రావడం టీఆర్ఎస్ పెట్టిన భిక్ష అంటూ ఆ పార్టీ నేతలు చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. తెలంగాణ కోసం కొట్లాడిన పార్టీ బీజేపీ. వందల మంది యువకులు చనిపోతుంటే… మీరు బలిదానం చేయొద్దు. తెలంగాణ రాబోతుందంటూ ప్రకటన చేయడమే కాకుండా పార్లమెంట్ లో తెలంగాణ బిల్లు పెట్టేలా ఒత్తిడి తెచ్చి రాష్ట్రం వచ్చేలా చేసిన వ్యక్తి సుష్మాస్వరాజ్. ఆనాడు సుష్మస్వరాజ్ ను తెలంగాణ ఆడ పడుచుగా పొగిడిన కేసీఆర్ ఈరోజు కనీసం ఆ ప్రస్తావన తీసుకురాకపోవడం సిగ్గు చేటు. తెలంగాణ రావడంవల్లే కేసీఆర్ కు సీఎం, ఆ పార్టీ నేతలకు పదవులు వచ్చాయి.

టీఆర్ఎసోళ్లకు పదవులు బీజేపీ పెట్టిన భిక్ష అని గుర్తుంచుకోవాలి’ అని అన్నారు. 10వ రోజు ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా బండి సంజయ్ ఈరోజు నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గం అమరచింత మండలంలో పాదయాత్ర చేశారు. బండి సంజయ్ పాదయాత్ర క్రిష్ణంపల్లి చౌరస్తా వరకు చేరుకోగానే 100 కి.మీల నడక పూర్తయిన సందర్భంగా… అభిమానులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు సంజయ్ పై పూలు చల్లి, కేక్ కట్ చేసి సంబురాలు జరుపుకున్నారు. ఇతర పార్టీల కు చెందిన స్థానిక నాయకులు, కార్యకర్తలు సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరారు. అనంతరం బండి సంజయ్ వారిని ఉద్దేశించి ప్రసంగించారు.అందులోని ముఖ్యాంశాలు….

రెండో విడత ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా 100 కి.మీలు నడిచి ప్రజలందరినీ కలుస్తూ వారి సమస్యలను తెలుసుకుంటుండం అనందంగా ఉంది. ఈ యాత్రను దిగ్విజయంగా పూర్తి చేయడానికి క్రుషి చేసిన పాదయాత్ర ప్రముఖ్, సహ ప్రముఖ్ లు సహా సంగ్రామ సేన, ఇతర విభాగాల బాధ్యులందరికీ ధన్యవాదాలు.

ప్రజల సమస్యలను తెలుసుకోవడంతోపాటు కేసీఆర్ మోసాలను ఎండగట్టేందుకు, కేంద్ర పథకాలను వివరించేందుకే పాదయాత్ర చేస్తున్నా. కేసీఆర్ సినిమాల్లో విలన్ కు మించిన నటుడు. సినిమావాళ్లు కేవలం నటిస్తారు. కానీ కేసీఆర్ జీవిస్తారు. దొంగ దీక్ష చేసినా, దొంగ హామీలిచ్చినా జీవిస్తూ నిజమని నమ్మిస్తూ ప్రజలను మోసం చేస్తున్నడు.

టీఆర్ఎస్ లో కొందరు మూర్ఖులు నేను తంబాకు తింటానని విష ప్రచారం చేస్తున్నరు. నేను నమిలేది లవంగా. మద్యం, డ్రగ్స్ అలవాటున్నది టీఆర్ఎస్ నేతలకే. కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు వెంట్రుకలను పరీక్షిస్తే డ్రగ్స్ భాగోతం బయటపడతది.

టీఆర్ఎస్ పెట్టిన భిక్షవల్లే నాకు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి వచ్చిందంటూ టీఆర్ఎస్ నేతలు నీచంగా మాట్లాడుతున్నరు. ‘‘ అరేయ్ పిచ్చోడా… ప్రపంచంలోనే అత్యధిక సభ్యత్వమున్న పార్టీ బీజేపీ. నరేంద్రమోదీ ఆధ్వర్యంలో నీతివంతమైన పాలన అందిస్తున్న పార్టీ. మీది తోక పార్టీ. దొంగ దీక్షలు, దొంగ హామీలతో మోసం చేసి అధికారంలోకి వచ్చిన పార్టీ.

అవినీతి అక్రమాలకు కేరాఫ్ అడ్రస్ కేసీఆర్ కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడే సహారా, ఈఎస్ఐ స్కాంలకు పాల్పడితే సీబీఐ విచారణ జరిగింది. మీరా దేశం, ధర్మం కోసం పనిచేస్తున్న బీజేపీపై విమర్శలు చేసేది. మీకా నైతిక అర్హతే లేదు.

తెలంగాణ కోసం కొట్లాడిన పార్టీ బీజేపీ. వందల మంది యువకులు చనిపోతుంటే… మీరు బలిదానం చేయొద్దు. తెలంగాణ రాబోతుందంటూ ప్రకటన చేయడమే కాకుండా పార్లమెంట్ లో తెలంగాణ బిల్లు పెట్టేలా ఒత్తిడి తెచ్చి కేంద్రం మెడలు వంచి రాష్ట్రం వచ్చేలా చేసిన వ్యక్తి సుష్మాస్వరాజ్.
ఆనాడు సుష్మస్వరాజ్ ను తెలంగాణ ఆడ పడుచుగా పొగిడిన కేసీఆర్ ఈరోజు కనీసం ఆ ప్రస్తావన తీసుకురాకపోవడం సిగ్గు చేటు. తెలంగాణ రావడంవల్లే కేసీఆర్ కు సీఎం, ఆ పార్టీ నేతలకు పదవులు వచ్చాయి. టీఆర్ఎసోళ్లకు పదవులు బీజేపీ పెట్టిన భిక్ష అని గుర్తుంచుకోవాలి’ అని అన్నారు.

ఇతరుల చావును కోరుకునే మూర్ఖులు టీఆర్ఎసోళ్లు. బండి సంజయ్ చస్తే కూడా రైతు బీమా వస్తుందంటూ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నరు. నాకు గుంట భూమి లేదు. రైతు బీమా ఎట్లిస్తరు? నాచావును కోరుకునే మూర్ఖులకే ఆ ఇన్సూరెన్స్ డబ్బులిస్తా..
మాదాసి కురువ, పద్మశాలీ సహా అన్ని సామాజిక వర్గాలను మోసం చేసిన దుర్మార్గుడు. రుణమాఫీ కూడా అమలు చేయకుండా రైతులను గోస పెడుతున్నడు. కేసీఆర్ అరాచకాలపై పోరాడదాం రండి. ఎత్తిన జెండా దించకండి. తెగించి కొట్లాడండి. గొల్ల కొండ కోటపైన కాషాయ జెండా ఎగరేసేదాకా ఉద్యమిద్దాం.

LEAVE A RESPONSE