– టీడీపీ పేదవాడికి అన్నం పెడితే వైసీపీకెందుకు కడుపు మంట?
– వీరసైనికుల్లా పనిచేస్తాం వైసీపీ అవినీతిని ఎండగడతాం
– మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు
లోకేశ్ పై పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యల్ని ఖండిస్తున్నాం. పిన్నెల్లి మతిభ్రమించి మాట్లాడుతున్నాడు. పతనావస్థకు చేరిన టీడీపీ కాదు, ప్రవర్థమానం చెందుతున్న టీడీపీ. పల్నాడులో హత్యా రాజకీయాలను తగ్గిస్తున్నామనడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుంది. హత్యా రాజకీయాలను పెంచి పోషిస్తున్నారు. రాయలసీమ పౌరుషం మాలో ఉంది అని లోకేశ్ మాట్లాడితే దాన్ని వక్రీకరించి గ్రామ సింహాలు అని ఏదేదో మాట్లాడారు. అన్న నందమూరి తారక రామారావు, చంద్రబాబునాయుడులు రాయలసీమను రతనాలసీమగా మార్చారు. వారి వారసత్వమే లోకేశ్. రాయలసీమని ఫ్యాక్షన్ సీమగా మార్చింది జగన్ తాత రాజారెడ్డి, నాన్న రాజశేఖర్ రెడ్డి, మీ నాయకుడు వైఎస్ జగన్.
చంద్రబాబునాయుడును తక్కువ చేసి మాట్లాడే పిన్నెల్లి చంద్రబాబుతో సమానంగా తిరుపతి మెట్లెక్కగలడా?. హత్యా రాజకీయాలు నడుపుతున్నది జగనే. తోట చంద్రయ్య చనిపోయినప్పుడు ఇంకా చావాల్సినవారు పది మంది ఉన్నారని స్వయంగా చెప్పారు. ఇందులో భాగంగానే జల్లా యాదవ్ ను చంపారు. లోకేశ్ తాతగారి చరిత్ర ఘనం, జగన్ తాతగారి చరిత్ర హీనం. బెదిరింపులు, హత్యా రాజకీయాలు చేస్తే టీడీపీ నాయకులు భయపడరు. జూలకంటి బ్రహ్మానందరెడ్డికి మాచర్లలో ఇల్లు లేదని మాట్లాడటం వారి నీతి, నిజాయితీలను ఒప్పుకున్నట్లే. వైసీపీ నాయకుల్లా టీడీపీ నాయకులు బరితెగించలేదు, బజారున పడలేదు, దోపిడీలు, మానభంగాలు, హత్యలు, ఆస్తులు స్వాధీనం చేసుకోలేదు.
40 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన టీడీపీని ఎవరూ ఏమీ చేయలేరు. వైఎస్ కుటుంబాన్ని ఇతివృత్తంగా తీసుకొని సినిమాల్లో ఫ్యాక్షన్ కుటుంబాలను చూపిస్తున్నారు. వరుస హత్యలు వైసీపీ నాయకులు చేస్తూ, ఊచకోతలు మీరు చేస్తూ టీడీపీవారిపై రుద్దడం సమంజసం కాదు. రాష్ట్రంలో తెలుగుదేశం జెండా ఉండనీయం అని మాట్లాడుతున్నారు, ఏమీ పీకలేరు. పల్నాడు ప్రాంతంలో టీడీపీ కార్యకర్తల్ని కాపాడుకుంటాం. వైసీపీకి అధికారం శాశ్వతం కాదు. 1994లో కాంగ్రెస్ కు ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడిపోయిన విషయాన్ని గుర్తు చేసుకోవాలి. ఆరోజు తల్లికాంగ్రెస్ లో ఉన్నారు, ఈరోజు పిల్ల కాంగ్రెస్ లో ఉన్నారు. ఫ్యాక్షన్ రాజకీయాలు చేస్తే 294 సీట్లల్లో 26 సీట్లు మాత్రమే వచ్చాయి. అన్ని వర్గాల ప్రజల్ని మోసం చేశారు.
దుల్హన్ పథకంకు లక్ష ఇస్తామని చెప్పి మోసం చేశారు. అలవిగాని హామీలిచ్చారు. సీపీఎస్ రద్దన్నారు. నవరత్నాలన్నారు. ఒక్కో రత్నం రాలిపోయింది. సజ్జల రామకృష్ణా రెడ్డి సీపీఎస్ అంటే ఏమిటో తెలియదనడం ఆయన అజ్ఞానానికి నిదర్శనం. రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. అప్పుల ఊబిలో కూరుకుపోయేలా చేశారు. ఒకప్పుడు ఒప్పుల కుప్పగా ఉన్న రాష్ట్రం నేడు అప్పుల కుప్ప అయింది. నిరుద్యోగం పెరిగిపోయింది. 3 వేల కోట్ల డ్వాక్రా సంఘాలు దాచుకున్న డబ్బును మీరు కొట్టేశారు. కేంద్రం నుంచి పంచాయతీ నిధులు వస్తే వాటిని కూడా కొట్టేశారు. పరిశ్రమలను వెళ్లగొట్టారు. కొత్త పరిశ్రమలు రావడంలేదు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడంలేదు.
గ్రామాలు అధ్వాన్న స్థితిలో ఉన్నాయి. కరెంటు ఛార్జీలు విపరీతంగా పెంచారు. నీళ్ల సరఫరా నిల్. తినడానికి తిండి దొరకని పరిస్థితి నేడు రాష్ట్రంలో నెలకొనివుంది. పెన్షన్లలో కోత కోయడం అన్యాయం. మైనింగ్ ను స్వాధీనం చేసుకున్నారు. మైనింగ్ మాఫియా రాజ్యమేలుతోంది. టీడీపీ నాయకులపై అనేక ఆరోపణలు చేశారు. ఏ ఒక్కటి నిరూపించలేకపోయారు. రాత్రవగానే ఇసుకలో ఎంత వచ్చింది? లిక్కర్ లో ఎంత వచ్చింది? చూసుకోవడానికే సరిపోతోంది. సొంత బ్రాండ్ లిక్కర్ తాగి రాష్ట్ర వ్యాప్తంగా 2,500 మంది మృత్యువాత పడ్డారు. మహిళల మెడలలోని తాళిని తెంపిన నీచమైన చరిత్ర వైసీపీది. సామాన్యుడికి మేలు చేయాలి. పేదవాడి కడుపు నింపాలి. పేదల పొట్ట కొట్టే పార్టీ వైసీపీ పార్టీ. టీడీపీ ఘనచరిత్ర కలది. 5 రూపాయలకే అన్నం పెట్టే అన్నా క్యాంటిన్లను పెడితే వాటిని తీసేసి పేదవాడిని నడిరోడ్డున పడేశారు.
మంగళగిరిలో లోకేశ్ పేదవారికి అన్నం పెట్టే కార్యక్రమం పెడితే అక్కడ టీడీపీ నాయకులను, పేదవారిని పోలీసులు లాగి కింద పడేసి కొట్టారు. పేదవాడికి అన్నం పెడితే కేసులు పెట్టే పాలన వైసీపీది. బరితెగించి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. బరితెగించొద్దు. చరిత్ర తెలుసుకొని వళ్లు దగ్గరపెట్టుకొని ప్రవర్తించాలి. పరిధి దాటొద్దు. ఇది రాచరికపు వ్యవస్థ కాదు. నియంత పరిపాలన కాదు. చంద్రన్న, లోకేశ్ నాయకత్వంలో టీడీపీ కార్యకర్తలు వీరసైనికుల్లాగ పనిచేస్తారు. ఖచ్చితంగా అధికారంలోకి వస్తాం. వైసీపీ నాయకులు వళ్లు దగ్గర పెట్టుకోవాలని మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు హెచ్చరించారు.