Suryaa.co.in

Andhra Pradesh

తల్లిని పార్టీ నుండి బయటకు గెంటేయడానికే ప్లీనరీని నిర్వహించారు

-బొండా ఉమామహేశ్వరరావు

• జగన్ రెడ్డి మాత్రం తల్లిని పార్టీ నుండి బయటకు గెంటేయడానికి ప్లీనరీని నిర్వహించారు..
• వైసీపీ కి ఇదే ఆఖరి ప్లీనరీ అని ప్రజలు అంటున్నారు..
• అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో అన్ని వర్గాల ప్రజల జీవితాలను తల్లకిందుల చేశారు…ప్రజలు అనుభవిస్తున్నారు..
• ప్లీనరీ అంటే రాష్ట్రానికి చేసిన మంచి, తెచ్చిన అభివృద్ధి, రానున్న కాలంలో ప్రభుత్వం ఎలా ముందుకు వెళుతుందో చెప్పుకోవడానికి ఎక్కడైనా ప్లీనరీ జరపుతాయి రాజకీయ పార్టీలు…
• తాను రానని చెప్పినా, బలవంతంగా విమానంలో ఎక్కించి, బలవంతంగా తాను రాసుకున్న స్క్రిప్ట్ ను చదివించి, పార్టీ నుండి బయటకు గెంటేశాడు…
• జగన్ ను అధికారంలోకి తీసుకురావడానికి తల్లి, చెల్లి ఎంతో సహకరించారు..
• జగన్ రెడ్డి పోటుకు బాబాయ్ పైకి వెళ్లిపోయారు, పిన్ని తాళి తెగిపోయింది..
• జగన్ కార్యక్రమాలకు తల్లి,చెల్లి పక్క రాష్ట్రానికి వెళ్లిపోయారు..
• ఇన్ని దుష్ట కార్యక్రమాలు చేస్తూ విశ్వసనీయత, క్రెడిబులిటీ గురించి జగన్ మాట్లాడుతున్నారు..
• జగన్ రెడ్డి నీకు విశ్వసనీయత గురించి అర్థం తెలుసా?
• వైఎస్ ఆర్ మరణం వెనుక రిలయన్స్ అధినేతల హస్తం ఉందని తెలిసి రిలయన్స్ పెట్రోల్ బంక్, షాపింగ్ మాల్స్ ను తగులబెట్టించావు..
• అదే అధినేతకు సంబంధించిన వ్యక్తికి రాజ్యసభ సీటు ఇచ్చావు ఇంటికి పిలిచి..ఇదంతా కాసులకు కక్కుర్తిపడి కాదా?
• నిన్నటి ప్లీనరీలో జగన్ రెడ్డి హావభావాలు హాస్యాస్పదంగా ఉన్నాయి…
• ఈ మూడేళ్లలో రాష్ట్రానికి ఏం చేశావు? మళ్లీ నిన్ను ప్రజలు ఎందుకు ఎన్నుకోవాలో చెప్పు?
• పోలవరం పూర్తి చేయలేదు, ఏ ప్రాజెక్టునూ పూర్తి చేయలేదు, రోడ్డులు వేయలేదు, అభివృద్ధి శూన్యం…
• సంక్షేమం పేరుతో రూ.5లక్షల కోట్లు అప్పులు చేసింది నిజమా, కాదా?
• చంద్రబాబు తన పాలనలో రూ.2లక్షల కోట్లు తొలి మూడు సంవత్సరాల్లో సంక్షేమం కోసం ఖర్చు చేశారు…
• జగన్ రెడ్డి ఈ మూడేళ్లలో రూ.1.50లక్షల కోట్లు ఖర్చు చేశానని చెబుతున్నా, సంక్షేమం మాత్రం శూన్యం…
• తెలుగుదేశం అధికారంలో ఉండి ఉంటే 25ఏళ్లలో ఏపీ అభివృద్ధిలో అగ్రదేశాల సరసన నిలిచేది…
• జగన్ రెడ్డి పాలనలో రాష్ట్రం మరో శ్రీలంక దిశగా నడుస్తోంది…దీనికి కారణం జగన్ రెడ్డి ధన దాహమే…
• ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను జగన్ గుర్తు తెచ్చుకోవాలి…
• దశలవారీ మద్య నిషేధం అని చెప్పి, నేడు మద్యంపై రూ.25వేల కోట్లు అప్పులు తెచ్చావు…ఇదేనా నీ విశ్వసనీయత?
• జాబ్ క్యాలెండర్ ఏమైంది? ఎక్కడ నీ విశ్వసనీయత?
• గతంలో ప్రజలకు అందిని ముఖ్యమైన 100 సంక్షేమ పథకాలకు తూట్లు పొడిచావు..ఇదేనా విశ్వసనీయత?
• ఈ మూడేళ్లలో అన్నా క్యాంటీన్లు లేక పేదవాళ్లు ఆకలితో అలమటిస్తున్నారు..పెళ్లికానుక ఎక్కడ? గత ప్రభుత్వం కంటే గొప్ప సంక్షేమం ఇస్తానన్న హామీ ఎక్కడా?
• మోసపూరిత మాటలు చెప్పి, అధికారంలోకి వచ్చి, ఈ మూడేళ్లలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశావు…
• ప్లీనరీలో అమరావతిపై బురదజల్లావు…
• అమరావతిలో రియల్ ఎస్టేట్, ఇన్సైడ్ ట్రేడింగ్, భూకబ్జాలు జరిగాయని ప్రతిపక్షంలో ఉండగా అన్నావు…అధికారంలోకి వస్తే నిరూపిస్తానన్నావు..ఈ మూడేళ్లలో ఏం పీకావ్ జగన్ రెడ్డి? నిన్నటి ప్లీనరీలో ఎందుకు చెప్పలేదు?
• తెలుగుదేశం పాలనలో పలానా అక్రమం జరిగిందని ప్లీనరీలో ఎందుకు చెప్పలేకపోయావ్?
• కేవలం అమ్మను పార్టీ నుండి బయటకు గెంటేయడానికి ప్లీనరీ నిర్వహించావ్…పైగా 175సీట్లు గెలుస్తానంటున్నావ్….
• నీకు దమ్ముంటే అసెంబ్లీని రద్దు చేసి, ఎన్నికలు నిర్వహించాలి. ప్రజలు ఎటువంటి తీర్పునిస్తారో చూస్తావ్…
• నవరత్నాల్లో ఒక్క రత్నమైనా అర్హులందరికీ ఇచ్చావా? బహిరంగంగా చెప్పాలి.
• అమ్మ ఒడికి 82లక్షల మంది పిల్లలు ఉంటే కేవలం 40లక్షల విద్యార్థులకే పథకం అమలు చేసి మాట తప్పావ్…ప్రతిపథకంలోనూ ఇదే విధంగా మోసం చేశావ్…
• ఆరోగ్యశ్రీపై కూడా ప్లీనరీలో అబద్దాలు చెప్పావ్..
• ఒక్కసారి నీ ప్యాలెస్ పరదాలు దాటి బయటకు వచ్చి, నీకు ఇష్టం వచ్చిన నియోజకవర్గంలో ప్రజల సంతృప్తిపై సర్వే చేసుకో…నీకే వాస్తవాలు తెలుస్తాయి…
• సొంతగ్రామం వెళ్లడానికి కూడా బారికేడ్లు పెట్టించుకుని వెళ్లే దిక్కుమాలిన పరిస్థితిలో ఉన్నావ్…
• నోరెత్తితే తెలుగుదేశం, దత్తపుత్రుడు అంటున్నావ్…టీడీపీ, జనసేన పేరు వింటే నీకు ఎకరం తడిచిపోతోంది.. మా పొత్తులపై నీకు అంత కంగారు ఎందుకు జగన్ రెడ్డి ?
• పూర్తి అభద్రతాభావంలో జగన్ రెడ్డి ఉన్నాడు..
• ప్రతిదానిలో దోపిడీ జరిగిందే తప్ప, అభివృద్ధి లేదు…
• ఇసుకలో రూ.25వేల కోట్లు దోచేశావ్…
• డబ్బు పిచ్చి పట్టిన జగన్ రెడ్డి..తాను ఏం దోచుకున్నాడో చెప్పుకోలేక..ప్లీనరీలో తల్లిని గెంటేయడానికి, మీడియాని, ప్రతిపక్షాన్ని తిట్టడానికి సమయం కేటాయించావు…దీనికి కొంత మంది హౌలే గాళ్లు కొడాలి.నాని, జోగి రమేష్ వంటి హౌలేగాళ్లతో తిట్టించి శునకానందం పొందావ్…
• అమ్మను గెంటేసి వికృతమైన నవ్వులు నవ్వాడు..
• నీ తల్లిని ఎందుకు గెంటేశావ్? నీ చెల్లిని పక్క రాష్ట్రానికి ఎందుకు గెంటేశావ్? నీ బాబాయ్ ని ఎందుకు చంపించావ్? నీ మరో చెల్లి సునీతను ఎందుకు బెదిరిస్తున్నావ్? ఈ విషయాలపై ప్రజలు చర్చోపచర్చలు చేస్తున్నారు..
• ప్రజలు పిచ్చివాళ్లు కాదు…నీకు తగిన సమయంలో బుద్ధి చెబుతారు…
• ఇప్పటికే నిన్ను సీఎం ను చేసి, తమ చావు తామే తెచ్చుకున్నట్లు ప్రజలు బాధపడుతున్నారు..
• జగన్ రెడ్డి అవినీతిని ఎండగట్టడానికి తెలుగుదేశంపార్టీ ప్రతిక్షణం సిద్ధంగా ఉంది..

LEAVE A RESPONSE