Suryaa.co.in

Features

చైనాతో భారత్ సంబంధాలు మంచిది కాదు

-నిద్రలోనూ సంగ్రామ స్వప్నాలు ఊహించుకునే డ్రాగన్
-భారత్ మాత్రం సరిహద్దుల్లో డజన్ల కొద్దీ గ్రామాలను వదులుకోవాల్పి వస్తున్నది
-సరిహద్దు ప్రాంతాలలో ఆఫ్ఘన్ తరహా బంకర్లు
-పాకిస్థాన్ భూభాగంలో చైనా రాడార్ వ్యవస్థ
-చైనా వస్తువుల పై భారతీయులకు క్రమంగా ఏహ్యభావం ప్రారంభం
-విదేశీ మోజు నుంచి భారత ప్రజలు విముక్తి కావాలి
-దేశీయ ఉత్పత్తులు, సంప్రదాయాలపై మక్కువ ప్రారంభం

నిత్యం బుసలు కొట్టే చైనాతో భారత్ సంబంధాలు ఏ నాటికైనా మంచిది కాదు.
విశ్వాస ఘాతుకంలో చైనా తర్వాతే ఏ దేశం అయినా.!
దేశం వెలుపల, లోపల శత్రుత్వాన్ని వ్యాప్తి చేస్తున్న చైనా దేశాన్ని క్రమంగా ఆక్రమించేందుకు కుట్ర చేస్తోంది.
శ్రీలంకను తీవ్ర ఆర్థిక నష్టాలలోకి నెట్టి వేయడానికి కారణం కూడా చైనానే.
సంపన్న దేశాలను దివాళా తీయించి ఆధిపత్యం కోసం ప్రయత్నించడమే చైనా లక్ష్యం
భారతదేశంలో రైతులు, పరిశ్రమలను కూడా వదలని చైనా…
రైతుల నుంచి పంట కొనుగోలు చేసి బోర్డు తిప్పేస్తున్న చైనా అనుబంధ సంస్థలు.

నిత్యం రక్తదాహం, అవకాశవాదం తో కోరలు చాచి కాటువేసే నైజం. కుడి ఎడమల దేశాలతో అనునిత్యం కయ్యానికి కాలుదువ్వడం. తన దేశంలో కరువు తాండవిస్తున్నా ఆత్మవంచనతో ఇతర దేశాలకు బెదిరింపులు. దేశ అంతర్ విషయాలలో జోక్యం, కుట్రలు చేయడం, ఉగ్రవాద దేశాలతో చేతులు కలపడం, ఆ దేశాలకు ఆర్థిక పరిపుష్టి కల్పించడం గొప్పగా భావిస్తుంది. ఇతర దేశాల్లో కి తమ సైనికుల చొరబాట్లు దినచర్య. ఉగ్రవాద దేశాలకు నిధులు సరఫరా. ప్రశాంతంగా ఉన్న దేశాలలో కలకలం సృష్టించేందుకు ప్రయత్నాలు. ఇదీ డ్రాగన్ దేశం చైనా నిత్యకృత్యం.

అగ్రరాజ్యం గా చెప్పుకునే అమెరికాకూ డ్రాగన్ తో చిక్కులు తప్పని స్థితి. అమెరికాను శత్రుదేశంగా భావించే చైనా, ప్రతి క్షణం అమెరికాపై సవాల్ విసురుతూ వుంటుంది. మీకు ధీటుగా సైనిక సంపద, సాంకేతికత మాదే అంటూ జబ్బలు చరుచుకోవడం చైనాకు సరదా. ఇతర దేశాల ఆర్థిక మూలాలను సమూలంగా నాశనం చేయడం చైనాకు పెట్టింది పేరు. తనకు నష్టం వచ్చినా పర్లేదు, కానీ ఎదుటి దేశాన్ని దెబ్బతీయాలనే కుటిలబుద్ధి కలిగి ఉంటుంది.

సస్యశ్యామలంగా విరాజిల్లే భారత్ పై కర్ర పెత్తనం సాధించాలనే నియంతృత్వ ధోరణి తో దుష్ట చైనా కుట్ర పన్నుతున్నది. ఇది కేవలం ఆరోపణ మాత్రమే కాదు కఠిన సత్యం. అందుకు వందల కోద్దీ సాక్ష్యాలు భారత్ వద్ద వున్నాయి. స్నేహానికి ప్రాధాన్యత నిచ్చే భారత్ లో తన ఉత్పత్తుల ఎగుమతి ఆగిపోయాక కూడా చైనా కళ్లు తెరవలేదు. ఆర్థికంగా పలచబడి పోతున్నా అహంకారం మాత్రం మరింత పెంచుకుంది. ప్రపంచంలో అతి పెద్ద దేశాలలో ఒకటైన భారత్ మినహా మరే దేశం డ్రాగన్ ను విశ్వసించదు. స్నేహానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చే భారత్ తో సరిహద్దులలో కవ్వింపులు, యుద్ధ విమానాలతో విన్యాసాలు నిత్యం తన కేలండర్ లో అజెండాగా మారిపోయాయి.

కలహదాహంతో బుసలు కొట్టే డ్రాగన్ కోరలు చాలా వాడిగా వుంటాయి. భారత భూభాగంలోకి చొరబడి సరిహద్దులలోని భారత్లోని గ్రామాలలో తన జెండాపాతేందుకు విఫలయయత్నం చేస్తుంది. కోల్కతా లో 2013 అంచనాల ప్రకారం సుమారు 2 వేల మంది చైనా నుంచి అక్రమంగా వలస వచ్చి స్థిరనివాసం ఏర్పరుచుకున్నారని గణాంకాలు చెబుతున్నాయి. అక్రమంగా వలసవచ్చిన చైనీయులు ఎక్కడ వివసిస్తున్నారనే సమాచారం ప్రభుత్వం వద్ద లేదు. వీళ్లు తాత్కాలిక ఆశ్రయం కోసం భారత్ లోకి ప్రవేశించి ఆపై తిరిగి తమ దేశానికి వెళ్లకుండా మన దేశంలో స్థిర నివాసం ఏర్పరుచుకున్నట్లు తెలుస్తున్నది.

2015 నాటికి ఈ అక్రమ వలసలు సుమారు 5 నుంచి 7 వేలకు చేరాయి. ఆపై లక్ష 89 వేలకు చేరినట్లు తెలుస్తున్నది. ఈ అక్రమ చొరబాట్లలో ఎవరెవరు వున్నారనే నిఘా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వద్ద లేదు. కొందరిని ఇటీవల దేశ రాజధాని దిల్లీలో నిఘా వర్గాలు అదుపులోకి తీసుకున్నప్పటికీ చైనా మాత్రం స్పందించలేదు. ముఖ్యంగా చైనా నుంచి భారత్ కు అక్రమంగా ప్రవేశించేవారిలో సాంకేతిక నిపుణులు వుంటారని ఓ అంచనా. ఈ నిపుణులు భారత్ నిఘా వ్యవస్థ, సాంకేతిక పరికరాలు, రక్షణ వ్యవస్థపై అధ్యయనం చేస్తారని భోగట్టా. దేశంలోని అనేక ప్రాంతాలలో పర్యటించి భౌగోళిక అంశాలను చిత్రీకరించి తమ దేశానికి అందించడం, ప్రజలలో తమ ఉత్పత్తులపై మక్కువ పెంచి, చైనా దేశానికి ఆర్థికంగా బలంగా తయారు చేయడం తరహా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు.

వ్యాపారస్తులను ఇతర దేశాలకు తీసుకెళ్లి అక్కడ వారి సరదాలు తీర్చడం వంటి కీలక మార్కెట్ అంశాలను గురి తప్పకుండా ప్రయత్నిస్తారు. స్థానిక వ్యాపారస్తులతో వ్యాపార సంబంధాలను మెరుగుపరుచుకునేందుకు, అనేక మార్కెట్ స్టంట్ లు చేయడం లో చైనా మార్కెటింగ్ సిబ్బంది దిట్ట అని చెప్పుకోవచ్చు. ఉదాహరణకు చైనా లో ఉత్పత్తి అయ్యే ఒప్పో, వీవో, రెడ్ మీ, వన్ ప్లస్ తరహా సెల్ ఫోన్లు మార్కెట్లో విడుల అయిన తర్వాత, మిగతా కంపెనీ బ్రాండ్ల విక్రయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ప్రత్యేకత ఉట్టిపడే ఐఫోన్ ల స్థానే వన్ ప్లస్ వినియోగదారుల చేతికి వెళ్లిపోయింది.

చైనా భారతదేశ రక్షణ ను సవాల్ చేయడమే కాకుండా, ఆర్ధిక వ్యవస్థ పై తీవ్ర ప్రభావం చూపింది. భారతదేశ ఏడాది బడ్జెట్ కు ఇంచుమించు సరిసమానంగా వాణిజ్య పన్నులు ఎగ్గొట్టిందని ఇటీవల ఈడీ గుర్తించింది. ఈ మేరకు కొన్ని సెల్ ఫోన్ల కంపెనీలపై దాడులు నిర్వహించింది. యావత్ దేశం నివ్వెరపోయే అర్థిక మోసాలు ఈడీ దృష్టి కి వచ్చాయి. దాంతో చైనా దేశాన్ని ఆర్థికంగా, రక్షణ పరంగానూ తీవ్ర సంక్షోభంలోకి నెట్టివేసే ప్రయత్నం చేసినట్టు స్పష్టం అవుతున్నది. వాణిజ్య పన్నుల శాఖ ఇటీవల ఓ చైనా వ్యాపార సంస్థకు 10 వేల కోట్ల మేర జరిమానా విధించింది. వాణిజ్య పన్ను ఎగనామం పెట్టినందుకు అంత డబ్బును జరిమానా విధించిందంటే కనీసం లక్ష కోట్లయినా పన్ను ఎగ్గొట్టినట్లు తేటతెల్లం అవుతోంది. ఇంతకంటే దురాగతం మరొకటి వుండదు. 10 వేల చెక్కు చెల్లుబాటు కాకపోతే ఏడాది పాటు జైలు శిక్ష విధించే చట్టాలు అమలు అవుతున్న మన దేశంలో లక్షల కోట్లు పన్ను ఎగవేత దేశానికి ఎలాంటి శిక్ష విధించాలని ప్రజలు ప్రశ్నించే తరుణం వచ్చింది. దుష్ట దేశం డ్రాగన్ ఉత్పత్తులను త్యజించాల్సిన అగత్యం ఎంతైనా ఉందని ప్రజలు తెలుసుకోవాలి.

దేశంలోకి ఎలా వచ్చారు?
దేశ సరిహద్దు రాష్ట్రాలలో క్రమంగా స్థిర నివాసం ఏర్పరుచుకుంటున్నారు. భారతదేశంలోకి అక్రమంగా ప్రవేశించేందుకు చైనీయులు అనేక దొడ్డి దారి మార్గాలను ఎంచుకుంటున్నారు. చైనా నుంచి నేరుగా నేపాల్ చేరుకుని, అక్కడ కొన్నాళ్లు నివాసం వుండిపోయి, ఆ తర్వాత అక్కడ ఆ దేశపు గుర్తింపు కార్డు సంపాదించి, ఆ గుర్తింపు కార్డు ఆధారంగా మన దేశంలోకి చొచ్చుకుని వస్తున్నారు. చైనా ముఖ్య పట్టణాల నుంచి నేపాల్ లోని ఖాట్మండు కు నేరుగా విమాన సర్వీసులు గతంలో ఉండేవి కావు. కానీ నేడు ఖాట్మండుకు చైనా నుంచి నేరుగా చేరుకునేందుకు వీలుగా చైనా కూడా విమానాలను ప్రారంభించింది.
గతంలో చైనా నుంచి ఏ విమానం ఖట్మాండు కు వెళ్లాలంటే , భారత్ మీదుగానే ప్రయాణం చేయాల్సి వచ్చేది. ఈ కారణంగా కొంత ఆంక్షలు, నియంత్రణ వుండేది. కానీ నేరుగా చైనా నుంచి విమాన సర్వీసులు ప్రారంభం అయ్యాక, అక్రమ చొరబాట్లు అధికం అయ్యాయని చెప్పవచ్చు. ఇతర దేశాల ఒత్తిడి మేరకు కాస్త గొంతు తగ్గించుకుని, పెద్దన్న దేశాలలో పంచాయితీ పెట్టి కొన్ని సరిహద్దు గ్రామాలను స్వాధీనం చేసుకోవడం చైనా వ్యూహం. ఇదే కుట్రను పదేపదే చైనా అమలు చేస్తుంది. భారత్ మాత్రం సరిహద్దుల్లో డజన్ల కొద్దీ గ్రామాలను వదులుకోవాల్పి వస్తున్నది. ఇండో చైనా సరిహద్దుల రాష్ట్రాలలో 1962 నుంచి ఆ దేశం దుందుడుకు చర్యలు కొనసాగిస్తున్నది. శాంతికాముక దేశం అయిన భారత్ కు నీతులు చెప్పేందుకే అన్ని దేశాలు ముందుంటాయి.

సరిహద్దు ప్రాంతాలలో ఆఫ్ఘన్ తరహా బంకర్లు
నిద్రలోనూ సంగ్రామ స్వప్నాలు ఊహించుకునే డ్రాగన్ భారత్ సరిహద్దుల వెంబడి ఆప్ఘన్ తరహా బంకర్లను ఏర్పాటు చేసుకున్నట్లు నిఘా వర్గాలు పసిగట్టాయి. ప్రపంచంలోనే అత్యంత సురక్షిత బంకర్లు ఏర్పాటు చేసుకున్న దేశం ఆఫ్ఘానిస్తాన్. అత్యున్నత సాంకేతికత సమకూర్చుకున్న దేశాలు సైతం గుర్తించలేనంత పటిష్టంగా చైనా బంకర్లను ఏర్పాటు చేసింది. ఒకవేళ గుర్తించినా అణుబాంబుల నుంచి కూడా రక్షణ కలిగేలా ఈ బంకర్లు ఉపకరిస్తాయి. వీటిని సమకూర్చుకోటానికి ఆప్ఠనిస్తాన్ కు చైనా నుంచి సైనిక నిపుణులు, ఆప్ఘనిస్తాన్ సందర్శించిన సంగతి భారత్ మిలిటరీ నిఘా వర్గాలు గుర్తించాయని సమాచారం. ఈ మేరకు భారత్ ప్రత్యమ్నాయం ఆలోచిస్తున్నది.

యుద్ధవిమానాల తరలింపు
భారత్ చైనా సరిహద్దులలో డ్రాగన్ అత్యంత శక్తివంతమైన జెఎఫ్ 17 విమానాలను మొహరించి వుంచింది. ఆ విమానాలు గగనతలంలోకి దూసుకువెళ్లేందుకు అవసరమైన రన్ వేను నిర్మించుకుంది. ఇంధన డిపోలను కూడా ఏర్పాటు చేసుకుంది. వైమానిక దళంలో సుమారు 4 లక్షల మంది పని చేస్తున్నారు. ప్రస్తుత గణాంకాల ప్రకారం 3 వేల 370 యుధ్ద విమానాలు చైనా వద్ద ఉన్నాయి. అందులో అతి ప్రమాదకరమైన విమానాలు వందకు లోపే.

భారత్ కంటే చైనా యుద్ధ విమానాల సాంకేతికత రెండు జనరేషన్లు అధికం. ఇవికాక నావికాదళం నుంచి మరో ప్రపంచంలోనే అతి పెద్ద ఎయిర్ క్రాఫ్ట్ కారియర్ 3 ను చైనా అంబుల పొదిలోకి చేరనుంది. యుద్ధవిమానాలను నడి సముద్రం నుంచి ప్రయోగించేందుకు ఇది సహకరిస్తుంది. అంటే వీలైనంత ఇందన సామర్థ్యాన్ని కలిగి వున్నప్పటికీ లక్ష్యాలను చేరుకోవడంలో ఈ విమానాలు చాలా అత్యున్నత సాంకేతికతను కలిగి వుంటాయి.

సుమారు 85 వేల టన్నుల ఆయుధ సామగ్రిని ఈ విమానం మోసుకెళ్లగలదు. ఈ తరహా విమానం అమెరికా కొన్నేళ్ల క్రిందటే సమకూర్చుకుంది. ఇందుకు కారణం చైనా సముద్ర జలాలు భారత్ సముద్ర జలాలకు చాలా తేడా వుంది. కానీ ఈ ఎయిర్ క్రాఫ్ట్ కారియర్ లను సమకూర్చుకోవడంలో భారత్ వెనుకబడివుంది. అందుకు భారత నావికాదళం చెబుతున్న కారణం వెల్లడించలేదు. భౌగోళికంగా సముద్రజలాలు భారత్ కు సహకరించే విధంగా వుంటాయని మాత్రమే చెప్పుకోవచ్చు. రక్షణ వ్యవహారాలలో ఇంతకంటే వివరాలు వెల్లడించలేము.

భారతదేశాన్ని వెలుపల నుంచి ఉగ్రవాదం సవాళ్లను విసురుతుంటే, దానికి అనుగుణంగా చైనా ఆర్థికంగా దెబ్బ కొట్టేందుకు సైబర్ నేరాలకు పురుడుపోస్తున్నది. విద్యుత్ కేంద్రాలు, బ్యాంకులు, అత్యవసర పరిస్థితిలో ప్రజలకు అందుబాటులో వుండే ప్రకృతి వైపరీత్యాల పరిష్కార సంస్థ పై కూడా, చైనా తన సైబర్ పంజాను విసిరింది. డేటాను దొంగలించి భారత్ ను ఉక్కిరిబిక్కి రి చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది.

భారతదేశంలోని ఈశాన్య ప్రాంతాల సరిహద్దులలో చొచ్చుకు వచ్చి ఆ ప్రాంతాలు తమ దేశపు గ్రామాలంటూ పిడివాదం చేస్తోంది. ఇందులో ఓ తిరకాసు వుంది. అదేమిటంటే.. వంద గ్రామాలు తమ దేశానికి సంబంధించిన గ్రామాలు అంటూ చైనా వాదాన్ని వినిసిస్తుంది. పెద్దన్న పాత్ర పోషించే దేశాల చెంత తన పిడివాదాన్ని వినిపిస్తుంది. శతాబ్ధాల క్రితం దేశ చిత్రపటంలో ఆ గ్రామాలు తమ దేశంలో వున్నాయని, అయితే భారత్ వాటిని ఆక్రమించుకుని తమ దేశంలో కలుపుకున్నాయని వాదిస్తుంది.

దీంతో పెద్దన్న పాత్ర లో వున్న దేశాలు, వందలో కనీసం 20శాతం గ్రామాలు చైనావి అయి వుండొచ్చాంటూ తీర్పు చెబుతుంది. ఈ కారణంగా మన దేశంలోని కొన్ని గ్రామాలాను చైనా సొంతం చేసుకుంటుంది. ఈ విధంగా ఎన్నోసార్లు దేశంలోని సరిహద్దులను కలుపేసుకునే ప్రయత్నాలు చైనా చేసింది. దీనికి ప్రామాణం ఏమీ ఉండదు. కేవలం గొంతెత్తి నొరు పెద్దది చేసి ఏకరువు పెట్టడమే దాని లక్షణం.

పాకిస్థాన్ భూభాగంలో చైనా రాడార్ వ్యవస్థ
భారత్ ను నేరుగా దెబ్బతీయలేని పిరికిపంద చైనా అకృత్యాలు అన్నీ ఇన్నీ కాదు. పాకిస్థాన్ భూభాగంలో, భారత్ సరిహద్దుల వెంబడి అతి శక్థివంతమైన ఆధునిక రాడార్ వ్యవస్థను సమకూర్చుకుంది. పాకిస్థాన్ భూభాగంలో మీ రాడార్ లు ఎందుకు అని మనం ప్రశ్నించలేము. సాంకేతికతలో సహాయం చేస్తున్నాం అని బొంకడం పెద్ద సంగతి కాదు. ఆర్థికంగా దివాళా తీసిన పాకిస్థాన్ తన తలసరి బడ్జెట్ లో 11 శాతం రక్షణ కు కేటాయించి ఇప్పటికే పెద్ద తప్పు చేశామని తల పట్టుకుంటోంది. కరవు తాండవిస్తు అసంతృప్తి వలలో చిక్కుకుపోయింది. ఈ స్థితిలో రాడార్ వ్యవస్థను ఆధునీకరించుకోవడం పాక్ కు తలకు మించిన భారం. వీటిని చైనా ప్రయోజనాల దృష్ట్యా పొందుపరిచినట్టు తెలుస్తోంది.

పాకిస్థాన్ చెప్పు చేతుల నుంచి ఆఫ్ఘన్ చేజారింది
భారత్ పై కక్షసాధింపు చర్యలలో భాగంగా తాలిబన్లకు పాకిస్థాన్ సైనిక శిక్షణ ఇచ్చింది. తామే తాలిబాన్ లను వేర్పాటువాదులుగా తయారు చేసినట్లుగా ప్రకటించుకుంది. కానీ పాకిస్తాన్ ఆకలి కష్టాలు తెలిసిన ఆఫ్ఘాన్, భారత్ వైపు మొగ్గు చూపుతున్నది. ఇటీవల రక్షణ శాఖ కార్యదర్శి జెపీ సింగ్ అ దేశంలో పర్యటించారు. ఆ సందర్భంలో అనేక దౌత్య సంబంధాలు చర్చకు వచ్చాయి. భారత్ తమకెప్పుడు మంచి మిత్రులుగానే వుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. భారత్ రాయబార కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. అంతే కాకుండా భారత్ లోని వాళ్ల రాయబార కార్యాలయాన్ని తమకు స్వాధీనం చేయాలని కోరింది. ఇటీవల రక్షణ శాఖ కార్యదర్శి జెపీ సింగ్ ఆ దేశంలో పర్యటించారు. ఆ సందర్భంలో అనేక దౌత్య సంబంధాలు చర్చకు వచ్చాయి. భారత్ తమకెప్పుడు మంచి మిత్రులుగానే వుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

చైనా ఉత్పత్తుల పై అనాసక్తి
దేశంలోకి అక్రమంగా చొచ్చుకువచ్చిన చైనా వస్తువుల పై భారతీయులకు క్రమంగా ఏహ్యభావం ప్రారంభం అయింది. నాసిరకం గా తయారు చేయడం కారణంగా మన్నిక రాక కొన్న వస్తువులను మళ్లీ మళ్లీ కొనాల్సి రావడంతో భారతదేశంలో చైనా ఉత్పత్తుల పై నిరసక్తత వ్యక్తం అవుతున్నది. భారత్ లో దారిద్య్ర రేఖకు దిగువున, మధ్యతరగతి ప్రజలు అధికంగా నివసిస్తారు. నాసిరకం ఉత్పత్తులు కొనుగోలు ద్వారా ప్రజలసై ఆర్థికభారం మీద పడుతుంది. ఈ మేరకు ప్రజలలో తీవ్ర అసంతృప్తిని వ్య్తక్తం చేస్తున్నారు. చైనా ఉత్పత్తులపైన నిరాసక్తత వక్తం చేస్తూ వీటిని కొనుగోలు చేయడం లేదు.

భారత్ పై నేరుగా చైనా దండయాత్ర చేయకపోయినా ఆర్థిక మూలాలను నాశనం చేసే దిశగా దశాబ్ధం పాటు తన నాసిరరకం ఉత్పత్తులను భారత్ లోకి ఇబ్బడిముబ్బడిగా చొప్పించింది. స్త్నేహ ధర్నాన్ని పక్కదారి పట్టించించింది. కనుక చైనా ఉత్పత్తులను భారత ప్రజలు విడనాడాలని ఆర్థిక నిపుణుల సూచన.

అంతర్జాతీయ పరిణామాలకు అనుగుణంగా…
అంతర్జాతీయంగా వేగంగా మారుతున్న పరిణామాలపై కూడా ప్రజలు చైతన్యవంతులు అవుతున్నారు.
దేశంలో ప్రభుత్వం చేపడుతున్న సంస్కరణలు, ప్రచారం ప్రజలలో అవగాహన మిశ్రమ ఫలితాలను వెల్లడిస్తునప్పటికీ , విదేశీ మోజు నుంచి భారత ప్రజలు విముక్తి కావాలని కోరుకుంటున్నారు.
దేశీయ ఉత్పత్తులు, సంప్రదాయాలపై మక్కువ ప్రారంభం అయింది. పర్యావరణ అవగాహన పై ప్రపంచ సంస్థలు చేస్తున్న కృషి కొంత మెరుగైన విజయాలను నమోదు చేస్తున్నది. చైనా వస్తువులు పర్యావరణానికి అనుకూలంగా లేవనే సరికొత్త వాస్తవాన్ని ప్రజలు జీర్ణించుకోలేక పోతున్నారు. ప్రపంచీకరణ నేపథ్యంలో ఈ అంశం ప్రధానంగా మారిందని చెప్పుకోవచ్చు.

phani
-వెంకట ఫణికుమార్ ,బుక్కపట్నం

 

LEAVE A RESPONSE