-టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్
ఇంకెన్నాళ్లీ నెత్తుటి రాజకీయాలు చేస్తారు జగన్‌రెడ్డి గారు! మా పార్టీ రాష్ట్ర కార్యదర్శి చెన్నుపాటి గాంధీపై దాడికి తెగబడింది మీ వైసీపీ ఫ్యాక్షన్ మూకలే. అధికారం శాశ్వతమనుకుని పోలీసుల సాయంతో రక్తచరిత్ర రాస్తున్నావు. మా సహనం చేతకానితనం కాదు. తిరుగుబాటు మొదలైంది. అధికారం అండతో రెచ్చిపోతున్న వైసీపీ రౌడీమూకలకి మరోసారి హెచ్చరిస్తున్నాను. ప్రతీ పేరు రాసుకున్నాం. కొడితే కొట్టించుకుంటున్నాం అనుకుంటున్నారు మీరు. మేము తిరిగి కొట్టే రోజున జగన్ రెడ్డి రారు, పోలీసులు కనపడరు. దెబ్బకి దెబ్బ ఎలా వుంటుందో చూపిస్తాం. చెన్నుపాటి గాంధీ పై దాడి చేసిన వైసీపీ రౌడీలు, దాడి వెనుక ఉన్న వైసీపీ నేతలను తక్షణమే అరెస్ట్ చెయ్యాలి.
అన్న క్యాంటీన్ తొలగింపుపై ఆగ్రహం
అన్నం తినే వారెవ్వరూ అన్న క్యాంటీన్‌ను అడ్డుకోరని నారా లోకేశ్ ధ్వజమెత్తారు. నందిగామ, మంగళగిరి, కుప్పంలో అడ్డుపడ్డారని, ఇప్పుడు తెనాలిలోనూ అన్న క్యాంటీన్ నిర్వహించకుండా ఆపుతుండటంపై లోకేశ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. మార్కెట్ కాంప్లెక్స్ వద్ద పోలీస్ పహారా పెట్టడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా అన్న క్యాంటీన్ నిర్వహించి తీరుతామని ఆయన అన్నారు.
అన్నం తినే వారెవ్వరూ అన్న క్యాంటీన్ ని అడ్డుకోరు. జగన్ రెడ్డి గారు తింటుంది ఏంటో ఆయనే తేల్చుకోవాలి. నందిగామ, మంగళగిరి, కుప్పంలో అడ్డుపడ్డారు. ఇప్పుడు తెనాలిలో అన్న క్యాంటీన్ నిర్వహించకుండా ఆపుతున్నారు. జగన్ రెడ్డిలో మానవత్వం అనేదే లేదా?(1/2) pic.twitter.com/0x4e68cJxl
— Lokesh Nara (@naralokesh) September 3, 2022