Suryaa.co.in

Andhra Pradesh

రామోజీ బ్లాక్ మెయిలింగ్ వార్తలకు బెదిరిపోము

– వరి పంటపై ఎల్లో మీడియా వక్రీకరణలు- వాస్తవమేమిటో వీడియోలతో సహా వివరించిన మంత్రి కాకాణి
-వరి పంట పండించటంపై.. ఆచార్య ఎన్జీరంగా అగ్రికల్చర్ యూనివర్సిటీలో అగ్రిటెక్ సదస్సులో, తన ప్రసంగం వీడియోని మీడియా ముందు ప్రదర్శించిన రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి

ఈ సందర్భంగా మంత్రి కాకాణి మాట్లాడుతూ.. ఏమన్నారంటే…
రైతులు వరి పండిస్తే కొనడానికి ప్రభుత్వానికి ఇబ్బంది లేదు కానీ, సాగు ఎవరికీ భారం కాకూడదు అన్న మాటలను వక్రీకరించి, అందరూ వరి పండిస్తే కొనడం కష్టం అంటూ, ఎల్లో మీడియాలో తప్పుడు రాతలు రాయడం సిగ్గుచేటు. మీడియా సాక్షిగా నా ప్రసంగాన్ని చూస్తే, రామోజీరావు తల ఎక్కడ పెట్టుకోవాలి!. రామోజీ లాంటి దగుల్బాజీ, బ్లాక్ మెయిలింగ్ వార్తలకు బెదిరిపోము.

రైతులు తక్కువ పెట్టుబడితో, అధిక ఆదాయం పొందేందుకు ప్రత్యామ్నాయ పంటలవైపు దృష్టి పెడితే మంచిది అన్న నా మాటలను వక్రీకరించిన రామోజీరావు లాంటి వ్యక్తులు పత్రిక రంగంలో పనిచేయడానికి అనర్హుడు.

మీడియా వాస్తవాలను ప్రతిబింబించాలి గానీ, సొంత ప్రయోజనాల కోసం రామోజీ గడ్డి కరుస్తున్నారు.. నాపై కథనాలు రాసేందుకు ఒక్క టీం కాదు కదా… పది టీములు పంపినా భయపడను… దమ్ముంటే నిరూపించే వార్తలు ప్రచురించు.ఎల్లో మీడియాలో రాయడం..వాస్తవాలు తెలుసుకోకుండా చంద్రబాబు దగ్గర నుంచి టీడీపీ నేతలు తందానా అనడం పరిపాటైంది. వరిసాగు పై నా మాటలను వక్రీకరిస్తున్నారు. కొత్త వంగడాలను పరిచయం చేసి ఒక్క ఏడాదిలో 13 లక్షల టన్నుల ఉత్పత్తిని పెంచాం.

ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని లాభసాటి పంటలు సాగు చేయమని చెబితే ఇలా వక్రీకరించారు. – రామోజీ రాతలు గురువిందను తలపిస్తూ ఉన్నాయి. మార్గదర్శి లో ప్రజల సొమ్ము దోచుకున్న విషయం పై మాట్లాడితే.. విమర్శలా.. పత్రికను అడ్డుపెట్టుకుని రామోజీ చేయని బ్లాక్ మెయిలింగ్ లేదు

రామోజీ ఎన్ని రాతలు రాసినా.. ప్రజల తరపున ఆయన అక్రమాలను నిలదీస్తూ నే ఉంటాం.- రామోజీ రాతలు భయపడే ప్రసక్తే లేదు. రైతులకు ఇవ్వాల్సిన బకాయిలను చంద్రబాబు ఎగ్గొట్టి పోతే, ఆ వార్త రాయరు. – చంద్రబాబు నిర్వాకం వల్ల సివిల్ సప్లైస్ పరిస్థితి దారుణంగా తయారైంది. – రైతులకు ప్రభుత్వం చేస్తున్న సహకారం గురించి రాయడానికి ఈ పత్రికలకి చేతులు రావు.

రైతుల పేరుతో దోచుకున్నది చంద్రబాబు నాయుడు. – రైతుల సంక్షేమం కోసం పనిచేసే ప్రభుత్వం వైఎస్ఆర్ సీపీ.- రైతు భరోసాలు ఇచ్చిన ఘనత మా ప్రభుత్వానిది. ఎవరి హయాంలో పంటలు పండాయో… దిగుబడులు పెరిగాయో పరిశీలిద్దాం రండి.. నేను సవాల్ చేస్తున్నాను. ఆ దమ్ము మీకుందా..?

అన్ని రకాల పంటలను రైతుల నుంచి కొనుగోలు చేస్తున్నాం. – రైతుల ను రెచ్చగొట్టే విధంగా రాతలు రాయడం మంచిది కాదు. పత్రికలు వాస్తవాలు రాయండి.. పారదర్శకంగా ఉండాలి. వక్రీకరణ వార్తలు పట్ల రైతులు జాగ్రత్తగా ఉండండి. రామోజీ వార్తలకు తప్పులు చేసే వారు భయపడతారు… నాలాంటి వారు భయపడ రు.. సొంత ప్రయోజనాలు మానుకొని వయసు మళ్ళిన రామోజీరావు దగుల్బాజీ వార్తలు మానుకోవాలని, ఇకనైనా పశ్చాత్తాప పడతాడని ఆశిస్తున్నామని, ఆయనకు బుద్ధి, సిగ్గు రావాలని మంత్రి కాకాణి ఆకాంక్షించారు.

LEAVE A RESPONSE