– మైనార్టీ మోర్చా రాష్ట్ర ఇంచార్జి నాగోతు రమేష్ నాయుడు
విశాఖ బిజెపి కార్యాలయం నందు మైనారిటీ మోర్చా జిల్లా అధ్యక్షుడు rev మోహనరావు అద్యక్షన జిల్లా పదాధికారుల సమావేశం జరిగింది.దీనికి ముఖ్య అతిధిగా పాల్గొన్న రమేష్ నాయుడు మాట్లాడుతూ.. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తరువాత విదేశీ విద్య చదువుతున్న మైనారిటీలకు ఆర్థిక సహాయం ఆపివేయడంతో విద్య కొనసాగించలేని పరిస్థితి. అధికారంలోకి రాకమునుపు అన్నిటికి అండగా ఉంటానన్న జగన్ నేడు వాళ్ళ పార్టీ నాయకుల కనుసన్నలలోనే మైనారిటీల మీద దాడులు జరుగుతున్నాయి.వక్ఫ్ భూములు అధికార పార్టి నాయకులే బరితెగించి దోచుకొంటున్న తీరు వర్ణనాతీతం. సమావేశంలో రమెష్ చంద్ జైన్, ఆల్బర్ట్ ,రాజశేఖర్ ,టి.భారతి, సామ్యూల్, డా.మనోహర్ ,బాజిత్ బెయిల్డి. పార్వతి, యమ్.దుర్గ తదితరులు పాల్గొన్నారు.