– ఫేక్ ముఖ్యమంత్రి పనితీరు, ఫేక్ సంక్షేమం, ఫేక్ బటన్ నొక్కుడు
• నాడు-నేడు పేరుతో పాఠశాలల్ని మాయంచేశారు. ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనారిటీల పిల్లలకు విద్యను దూరంచేశారు.
• వాహనమిత్ర పేరుతో రూ.10వేలు ఇస్తూ, లక్ష లాక్కుంటున్నారు.
• రైతుభరోసా కేంద్రాలపేరుతో రైతుల్నిదోచుకుంటున్నారు. సామాజిక పింఛన్లు, విద్యాదీవెన, ఇంటింటికీ రేషన్ , డ్వాక్రామహిళలకు రుణాలు, వైద్యరంగం, సాగునీటిరంగం.. దిశాబిల్లుకి సంబంధించి గవర్నర్ ప్రసంగంలోని అంశాలు.. జగన్ నోటినుంచి వచ్చిన కట్టుకథల్ని నిలదీస్తామన్న భయంతోనే టీడీపీసభ్యుల్ని సస్పెండ్ చేశారు.
– టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, శాసనసభ్యులు నిమ్మల రామానాయుడు
నాలుగేళ్ల జగన్ విధ్వంసక, అరాచకపాలనని గవర్నర్ తో అసెంబ్లీలో చెప్పించేప్రయత్నం చేశారని, గవర్నర్ ప్రసంగంలో చెప్పిన పథకాలతీరుకి, క్షేత్రస్థాయిలో వాటి అమలుకు చాలా చాలా వ్యత్యాసముందని, అభూతకల్పనలు, అసత్యాలు, అబద్ధాల సమాహారంగానే ఆ ప్రసం గం సాగిందని టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు, శాసనసభ్యులు నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. మంగళగిరిలోని పార్టీ జాతీయకార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయనమాటల్లోనే …
“ఫేక్ ముఖ్యమంత్రి పనితీరు, ఫేక్ సంక్షేమం, ఫేక్ బటన్ నొక్కుడు కార్యక్రమాల సమాహార సమ్మిళిత మైన గవర్నర్ ప్రసంగాన్ని అసెంబ్లీలో ఎక్కడ ఆధారాలతోసహా ప్రజలకు వివరిస్తామన్న భయంతోనే టీడీపీ సభ్యుల్ని అకారణంగా సభనుంచి సస్పెండ్ చేశారు. అసెంబ్లీలో టీడీపీసభ్యు ల గొంతునొక్కగలరుగానీ, ప్రజాక్షేత్రంలో నొక్కలేరు. ప్రజల్లోఉండి ప్రతిరోజు నిజాలను తెలియ చేస్తూనే ఉంటాము. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై తాము ఏదైతే మాట్లాడాలనుకున్నామో, అవే విషయాలను మీడియాసాక్షిగా ప్రజలకు తెలియచేస్తున్నాం.
డ్వాక్రామహిళలకు చంద్రబాబు ఐదేళ్లలో చేసిన ఆర్థికసాయం రూ.23వేలకోట్లు..
జగన్ నాలుగేళ్లలో చేసినసాయం కేవలం రూ.12వేలకోట్లు మాత్రమే. చంద్రబాబునాయుడి హయాంలో 2014-19మధ్యన డ్వాక్రామహిళలకు పసుపు-కుంకుమ కింద రూ.23వేలకోట్లు అందించారు. వైఎస్సార్ఆసరా పేరుతో డ్వాక్రామహిళల రుణాలు మాఫీ చేస్తానని హామీఇచ్చిన జగన్, తొలివిడత నిధుల్ని 2020సెప్టెంబర్లో, రెండోసారి 2021 అక్టోబర్ 10న చేసి, 2022లో మూడోవిడత నిధులుఇవ్వకుండా జగన్ ఎందుకు ఎగ్గొట్టాడో సమాధానంచెప్పాలి. చంద్రబాబు ఐదేళ్లలో డ్వాక్రామహిళలకు రూ.23వేలకోట్లు ఆర్థికసా యం చేస్తే, జగన్ నాలుగేళ్లలో చేసినసాయం కేవలం రూ.12వేలుకోట్లు మాత్రమే. మిగిలిన ఏ డాదిలో అసలుచేస్తాడన్న నమ్మకంలేదు. చంద్రబాబు ఇచ్చినదానిలో సగంకూడా జగన్ ఇవ్వలేదు. వైఎస్సార్ పింఛన్ కానుక : 4ఏళ్లు అయినా రూ.3వేల పింఛన్ కు దిక్కులేదు. 1000ని నాలుగుభాగాలుచేసి, మూడేళ్లలో చచ్చీచెడి రూ.750పెంచిన ఘనత జగన్ కే దక్కింది.
టీడీపీ సభ్యుల్ని సస్పెండ్ చేశాక, అసెంబ్లీలో జగన్ తనకుతానే డబ్బాలుకొట్టుకున్నాడు. సామాజిక పింఛన్ ను రాష్ట్రంలో ప్రారంభించిందే స్వర్గీయ నందమూరి తారకరామరావుగారు. చంద్రబాబుగారు రూ.200లు ఉన్న పింఛన్ ని రూ.2వేలకు పెంచారు. తాను ముఖ్యమంత్రి అయితే రూ.3వేల పింఛన్ ఇస్తానన్న జగన్, తనతొలిసంతకాన్ని పింఛన్లపెంపు ఫైలుపై పెట్టి, ఏటా రూ.250లు చొప్పున పెంచుకుంటూ పోతున్నాడు. రూ.1000ని నాలుగు విడతలుగా ఇస్తున్న జగన్, ఏ ముఖంపెట్టుకొని సిగ్గులేకుండా, గతంలో చంద్రబాబు విడతలవారీగా అమ లుచేసిన రైతురుణమాఫీని ఎద్దేవా చేశాడు? అధికారంలోకి వచ్చి నాలుగేళ్లయినా జగన్ అవ్వా తాతలకు రూ.3వేలు ఇవ్వలేక ముఖంచాటేస్తున్నాడు. ఏం పాపం చేశారని జగన్ ఒంటరి మహిళలకు అన్యాయం చేశాడో చెప్పాలి. చంద్రబాబు వృద్ధులు, వికలాంగులు, వితంతువులతో పాటు ఒంటరి మహిళలకు కూడా పింఛన్ ఇచ్చాడు. కానీ జగన్ ఒంటరిమహిళలకు పింఛన్ లేకుండా చేశాడు. వారివయోపరిమితిని 50ఏళ్లకు పెంచాడు. తెల్లరేషన్ కార్డుని అర్హతగా గుర్తించి అన్నిప్రభుత్వాలు పింఛన్ ను అందిస్తే, జగన్ మాత్రం విద్యుత్ బిల్లు, నాలుగుచక్రాల వాహనాలు, ఇంటివిస్తీర్ణం నిబంధనల్ని సాకుగా చూపి అర్హులైనవారి పింఛన్లకు కోతపెట్టాడు. ఈ వ్యవహారంపై టీడీపీ అసెంబ్లీలో నిలదీస్తుందన్నభయంతోనే జగన్ టీడీపీసభ్యుల్ని బయ టకు పంపించాడు.
వైఎస్సార్ కల్యాణమస్తు: దుల్హన్ పథకం అమలుకు ప్రభుత్వంవద్ద డబ్బులేవన్న జగన్, కల్యాణమస్తు అంటూ యువతీయువకుల జీవితాల్ని చీకట్లపాలుచేశాడు
వైఎస్సార్ కల్యాణమస్తు పథకంపై అసెంబ్లీలో మాట్లాడేముందు జగన్ సిగ్గుపడాల్సింది. గవ ర్నర్ ప్రభుత్వం రాసిచ్చింది చదివారు. కానీ జగన్ దాన్ని అమలుచేయకుండానే చేసినట్టు చె ప్పడం నిజంగా సిగ్గుచేటు. చంద్రబాబు అమలుచేసిన పెళ్లికానుక పథకాన్ని నిలిపేసిన జగన్ , ఈ నాలుగేళ్లలో ఒక్కరికైనా పెళ్లికానుక కింద ఆర్థికసాయం చేశాడా? దుల్హన్ కు డబ్బులు లేవు అని, పెళ్లికానుక పెటాకులైందని మీడియాలోనే వచ్చింది. డబ్బులులేక దుల్హన్ పథకం నిలిపివేసినట్టు జగన్ ప్రభుత్వమే హైకోర్టుకి చెప్పింది. కానీ జగన్ మాత్రం అసెంబ్లీలో దానిపై అబద్ధాలమీద అబద్ధాలు చెప్పాడు.
వైఎస్సార్ ప్రమాదబీమా: పథకం పేరుమారింది.. ఎక్కడా, ఎవరికీ ఈ నాలుగేళ్లలో ప్రమాదపరిహారం అందలేదు
చంద్రబాబు ఐదేళ్లు అమలుచేసిన చంద్రన్నబీమా పథకాన్ని జగన్ అటకెక్కించాడు. దానిపే రుని వైఎస్సార్ ప్రమాదబీమాగా మార్చి, కుటుంబంలో ఒక్కరికే ఆ పథకం వర్తిస్తుందని నిబం ధన పెట్టి, అంతటితో దాన్నిఆపేశాడు. నాలుగేళ్లలో జగన్ రాష్ట్రంలో ఒక్కకుటుంబానికి కూడా ప్రమాదబీమాకింద రూపాయిసాయం అందించలేదు. చంద్రబాబు ప్రతిఇంట్లో 18ఏళ్లు నిండినవారందరినీ చంద్రన్న బీమాపథకానికి అర్హుల్ని చేశాడు. జగన్ లాగా పథకం ప్రయోజ నాల్ని ఒక్కరికే పరిమితంచేయలేదు. క్షేత్రస్థాయిలో పథకంతీరుతెన్నుల్ని అసెంబ్లీలో ఎండగ డతామన్న భయంతోనే మమ్మల్ని బయటకుపంపారు.
వైఎస్సార్ వాహనమిత్ర : వాహనదారులకు ఇస్తుంది రూ.10వేలు.. తిరిగి తీసుకుంటుంది రూ.లక్ష
జగన్మోహన్ రెడ్డి సంక్షేమం ఎలా ఉందో చెప్పడానికి వైఎస్సార్ వాహనమిత్ర పథకమే నిదర్శ నం. ఇతరరాష్ట్రాలతో పోలిస్తే ఏపీలోనే పెట్రోల్, డీజిల్ ధరలు ఎక్కువ. దాన్ని వినియోగించడం వల్ల ఆటోవాలాలకు సంవత్సరానికి రూ.25వేలు అదనపు ఖర్చుఅవుతోంది. గుంతలమయ మైన రోడ్లపై ప్రయాణించడంవల్ల ఆటోలు, ఇతర వాహనాల మరమ్మతులకు సంవత్సరానికి కనీసం రూ.20వేలు, పోలీసులు, ఆర్టీవోఅధికారులద్వారా సంవత్సరానికి రూ.20వేల వరకు ఆటోవాలాలనుంచి ప్రభుత్వం వసూలుచేస్తోంది. ఇంతటితో ఆగకుండా మద్యపానంసేవించే ఆటోవాలాలు ఏటా ప్రభుత్వానికి రూ.45వేలవరకు చెల్లిస్తున్నారు. ఈ విధంగా ఒక్కో ఆటో వాలాకి జగన్ ప్రభుత్వం రూ.10వేలు ఇస్తూ, వారినుంచి దాదాపు రూ.లక్షకు పైగా వసూలు చేస్తోంది. రాష్ట్రంలో దాదాపు 4లక్షలకు పైగా ఆటోలుఉంటే, వాటిలో 10శాతం మందికి మాత్ర మే జగన్ వాహనమిత్ర సాయం అందిస్తున్నాడు. ఈ బాగోతం బయటపడుతుందనే జగన్ టీడీపీసభ్యుల్ని సభనుంచి సాగనంపాడు.
నాడు-నేడు : నూతనవిద్యావిధానం పేరుతో ఎస్సీ, ఎస్టీ, బీసీ,మైనారిటీల పిల్లలకు విద్యను దూరంచేశారు. అప్పులకోసం రాష్ట్రవిద్యారంగాన్ని సర్వనాశనం చేశారు
పాఠశాలల్లో మౌలికవసతుల కల్పనకు ఈ ప్రభుత్వం ఎక్కడా రూపాయిఖర్చుపెట్టలేదు. టైల్స్ వేయడానికి, ఎలక్ట్రికల్ పనులకు, రంగులేయడానికి మాత్రమే ప్రభుత్వం పాఠశాలల్లో కోట్లరూపాయలు ఖర్చుపెట్టినట్టు లెక్కల్లోచూపి, వైసీపీనేతలు వారిజేబులు నింపుకున్నారు. 1 నుంచి 5వతరగతి వరకు ఉండే ప్రాథమికపాఠశాలల్ని రద్దుచేసిన జగన్, నాడు-నేడు పేరు తో 3, 4, 5 తరగతుల్ని హైస్కూల్లో విలీనంచేశాడు. టీడీపీప్రభుత్వం ప్రతికిలోమీటర్ పరిధిలో క ప్రాథమికపాఠశాలని ఏర్పాటుచేస్తే, జగన్ ప్రతిమూడుకిలోమీటర్లకు ఒకపాఠశాల ఉండాల న్నాడు. దానివల్ల పిల్లలకు లాభమో..నష్టమో ముఖ్యమంత్రే చెప్పాలి. అసెంబ్లీలో మంత్రి బొ త్స గొప్పలుచెప్పిన నూతనవిద్యావిధానం దేశంలో ఎక్కడాఅమల్లోలేదు. ఆఖరికి బీజేపీ ము ఖ్యమంత్రులకూడా దాన్నిఅమలుచేయలేదు. కేవలం అప్పుల కోసమే జగన్ ప్రభుత్వం నూత నవిద్యావిధానం పేరుతో రాష్ట్రవిద్యారంగాన్ని సర్వనాశనంచేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారి టీల పిల్లలకు బడిచదువుల్ని దూరంచేసింది. నాడు-నేడులోని డొల్లతనాన్ని బహిర్గతం చేస్తా మన్న భయంతోనే మమ్మల్ని అసెంబ్లీలో లేకుండా చేశారు.
వైద్యరంగం : ఆక్సిజన్ అందక మరణాలు… సెల్ ఫోన్ల లైట్ల వెలుతురులో ఆపరేషన్లు… డోలీల్లో గర్భిణులుతరలింపు.. ద్విచక్రవాహనాలపై మృతదేహాలు.. ఇదీ జగన్ 4ఏళ్లలో వైద్య రంగంలో సాధించిన ప్రగతి
వైద్యరంగం గురించి జగన్ అసెంబ్లీలో ఊకదంపుడు ఉపన్యాసమిచ్చాడు. కోవిడ్ సమయంలో 50వేల మంది ప్రభుత్వచేతగానితనానికి బలయ్యారు. తిరుపతి రుయాలో ఆక్సిజన్ అందక 29 మంది, బెడ్లులేక అంబులెన్స్ లో చనిపోయారు.కోవిడ్ సమయంలో కేంద్రం రూ.1000లు ఆర్థికసాయంచేస్తే, అన్నిరాష్ట్రాలు దానికి రూ.4వేలుకలిపి, కోవిడ్ బాధితులకు రూ.5వేలు ఇచ్చాయి. కానీ జగన్ ప్రభుత్వం మాత్రం కేంద్రమిచ్చిన వెయ్యితోనే సరిపెట్టింది. రోగిని ఆసు పత్రిలోనికి తీసుకెళ్లడానికి స్టెచర్లులేక భుజాలపై మోసుకెళ్తున్నారు. సెల్ ఫోన్ లైట్ల వెలుతు రులో ఆపరేషన్లు చేసేదుస్థితి. ఆసుపత్రిలో చనిపోయినవారిని వారిస్వస్థలాలకు తీసుకెళ్లడా నికి మోటార్ సైకిళ్లే గతిఅయ్యాయి. గర్భిణుల్ని డోలీలపై, మంచాలపై తీసుకెళ్తున్నారు. 17మెడికల్ కాలేజీల నిర్మాణం ఎక్కడ జరిగిందో జగన్ సమాధానంచెప్పాలి. మూడేళ్లక్రితం పాలకొల్లులో మెడికల్ ప్రారంభోత్సవానికి జగన్ తాడేపల్లి ప్యాలెస్ నుంచి బటన్ నొక్కాడు. ఆశిలాఫలకం ఇప్పటికీ అలానేఉంది. (దానికి సంబంధించిన ఫోటోను నిమ్మల విలేకరులకు చూపించారు) మెడికల్ కాలేజీకి భూములిచ్చిన రైతులకుకూడా జగన్ నేటికీ పరిహారం ఇవ్వలేదు. ఇదే జగన్ తన నాలుగేళ్లపాలనలో వైద్యరంగంలో సాధించిన గొప్పప్రగతి. వైద్యరం గంలోని అవినీతిని, లోపాలను బయటపెడతామనే జగన్ ప్రతిపక్షసభ్యుల్ని సభలో లేకుండా చేశాడు.
ఇళ్ల నిర్మాణం..సెంటు పట్టాలు : 5ఏళ్లలో 25లక్షలఇళ్లు కట్టిస్తానని మేనిఫెస్టోలో చెప్పిన జగన్, 4ఏళ్లలో 4.40లక్షలఇళ్లు కట్టించినట్టు గవర్నర్ తో అబద్ధాలు చెప్పించాడు
వైసీపీ మేనిఫెస్టోనే తనకు బైబిల్, భగవద్గీత, ఖురాన్ అని జగన్ చెబుతున్నాడు. 5సంవత్స రాల్లో రాష్ట్రంలో 5లక్షలఇళ్లు కట్టిస్తానన్న జగన్, నాలుగేళ్లలో ఎన్నిలక్షల ఇళ్లుకట్టించాడో చె ప్పాలి. గవర్నర్ ప్రసంగంలో మాత్రం జగన్ ఇళ్లనిర్మాణంపై 4.40లక్షల ఇళ్లుకట్టించినట్టు చెప్పాడు. 5ఏళ్లలో 25లక్షలఇళ్లు కట్టిస్తానన్న జగన్, ఆయన మాటప్రకారమే 4.40లక్షలఇ ళ్లు కట్టిస్తే, మిగిలినవి ఎప్పుడుకడతాడు? ఇంటినిర్మాణమనే కలను సాధ్యంచేసుకోవడానికి రాష్ట్రంలో ప్రజలు ఎందుకు ముందుకురావడంలేదో జగన్ ఎప్పుడైనా ఆలోచించాడా? పెరిగిన నిర్మాణసామగ్రివ్యయం, ఇసుకను అందుబాటులో లేకుండాచేసిన జగన్ నూతనపాలసీతో పే దలు ఎవరూ ఇంటినిర్మాణంచేయడానికి సాహసించడంలేదు. కేంద్రప్రభుత్వం ఇంటినిర్మాణా నికి ఇచ్చే రూ.1.80లక్షలతోనే (ఎన్.ఆర్.ఈ.జీ.ఎస్ నిధులుకలిపి) జగన్ ప్రభుత్వ సరిపెడు తోంది. ఎందుకంటే రాష్ట్రప్రభుత్వవాటాగా జగన్ రూపాయికూడా ఇవ్వడంలేదు. దానిప్రభావం కూడా ఇళ్లనిర్మాణంపై పడింది. సెంటుపట్టాలపేరుతో వైసీపీప్రభుత్వం ఇచ్చినస్థలాలన్నీ జనావాసాలకుదూరంగా ఎక్కడో ఇచ్చారు? చంద్రబాబుహాయాంలో 85శాతం పూర్తైన టిడ్కో ఇళ్లను జగన్ ప్రభుత్వం నాలుగేళ్లలో ఎందుకు 15శాతం పూర్తిచేయలేకపోయింది? ఇవన్నీ ప్రజలకు తెలియకూడదనే జగన్ ఇళ్లనిర్మాణాన్ని తనప్రభుత్వం ఆర్భాటంగా చేస్తున్నట్టు డబ్బాలు కొట్టుకుంటున్నాడు. ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్న జగన్ నైజాన్ని బయట పెడతా మనే మమ్మల్ని సభనుంచి సాగనంపారు.
రైతు భరోసా కేంద్రాలు : ధాన్యం కొనలేని దుస్థితిలో ఉన్న రైతుభరోసాకేంద్రాలు. రైతుల ఆత్మ హత్యల్లో రాష్ట్రాన్ని దేశంలోనే 3వస్థానంలో నిలిపిన జగన్
జగన్ మాతో క్షేత్రస్థాయికివస్తే రైతుభరోసా కేంద్రాలు ఎలాపనిచేస్తున్నాయో తెలుస్తుంది. గోదా వరిజిల్లాల్లో రైతులు పండించిన ధాన్యం వారు అమ్ముకోవాలంటే వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది వచ్చి ఫోటోలు తీయాలంటున్నారు. అన్నీఅయ్యాక ధాన్యం రైస్ మిల్లులకు తీసుకెళితే, అక్కడ తేమశాతంపేరుతో రైతుల్ని దోచుకుంటున్నారు. 75 కేజీల బస్తాకు రూ.1550 మద్ధతు ధరలభించాల్సి ఉండగా, రైతులు రూ.1250కే అమ్ముకుంటున్నారు. కౌలురైతులకు ధాన్యంఅమ్ముకునే పరిస్థితేలేదు. గుంటూరు, ప్రకాశం, కర్నూలు జిల్లాల్లో మిర్చిరైతులు కొత్తరకం తెగుళ్లతో నష్టపోతే, ప్రభుత్వం ఏంసాయంచేసింది? పురుగుమందు లు, ఎరువుల్ని రైతుభరోసాకేంద్రాల్లో ఎందుకు అందుబాటులో ఉంచడేంలేదు? కేంద్రప్రభు త్వం డ్రిప్ ఇరిగేషన్ కు సబ్సిడీఇస్తుంటే, రాష్ట్రవాటాగా ఇవ్వాల్సింది ఇవ్వలేక, ఆ పథకాన్నే జగన్ ఎత్తేశాడు. రైతుఆత్మహత్యల్లో రాష్ట్రం దేశంలో 3వస్థానంలో నిలపడమే జగన్ నాలుగేళ్ల లో సాధించిన రైతుసంక్షేమం?
ఉద్యోగాల కల్పన : యువత ఎక్కడ తన అసమర్థతను ప్రశ్నిస్తోందన్న భయంతో, వారిని మాదకద్రవ్యాలకు బలిచేయడమే నాలుగేళ్లలో జగన్ సాధించిన ఉద్యోగాల కల్పన
ఏటా క్యాలెండర్ అన్న జగన్, నాలుగేళ్లలో ఒక్కసారి చచ్చీచెడి ఉత్తుత్తి జాబ్ క్యాలెండర్ విడు దలచేశాడు. యువత తనను ఎక్కడోప్రశ్నిస్తోందన్న భయంతోనే జగన్ వారిని గంజాయి, మాదకద్రవ్యాలకు బానిసల్ని చేశాడు. ఫీజురీయింబర్స్ మెంట్ కింద నేరుగా కళాశాల యాజ మాన్యాలకు చెల్లించాల్సిన సొమ్ముని జగన్, తల్లులఖాతాల్లో వేయడం విద్యార్థులకు శాపంగా మారింది. జగనన్నవిద్యాదీవెన కింద ఒకేసారి కళాశాలలకు చెల్లించాల్సిన సొమ్ముని మూడు విడతల్లో ఇస్తానని, అదికూడా తల్లులఖాతాల్లోనే వేస్తానంటున్నాడు. మూడోవిడత విద్యాదీవె న సొమ్ము జగన్ నాలుగేళ్లవుతున్నా ఇవ్వలేదు. ప్రభుత్వం నుంచి ఫీజురీయింబర్స్ మెంట్ సొమ్ము రానందున విద్యార్థుల సర్టిఫికెట్లు ఇవ్వకుండా కళాశాలల యాజమాన్యాలు తల్లిదం డ్రుల్ని బకాయిలకోసం వేధిస్తున్నాయి.
సామాజిక న్యాయం : రాష్ట్రాన్ని 5గురు రెడ్లకు అప్పగించడమే జగన్ సామాజిక న్యాయం
జగన్ మంత్రిపదవుల్ని పీకేస్తాడన్నభయంతోనే మంత్రులంతా మూకుమ్మడిగా సామాజిక న్యాయం నినాదం ఆలపిస్తున్నారు. ప్రభుత్వసలహాదారుల్లో ముఖ్యమంత్రి పాటించిన సామా జికన్యాయం ఎంత? రాష్ట్రాన్ని 5గురురెడ్లకు పంచిపెట్టిన జగన్ సామాజికన్యాయం గురించి మాట్లాడటం నిజంగా సిగ్గుచేటు. తెలుగుదేశంపార్టీలో ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఉన్నతపదవుల్లో ఉంటే, జగన్ మాత్రం అన్నిముఖ్యమైన పదవుల్ని తనవర్గానికే కట్టబెట్టాడు.
సాగునీటిరంగం : ఇరిగేషన్ రంగానికి జగన్ నాలుగేళ్లలో చేసిన ఖర్చు అత్తెసరు…భారీ ప్రచారంతో ప్రభుత్వం తీస్తోంది రైతుల ఉసురు
తెలంగాణ రాష్ట్రం ఇరిగేషన్ రంగంలో దూసుకుపోతుంటే, ఏపీమాత్రం వెనుకబడింది. పోలవ రం నిర్మాణాన్ని 2021 జూన్ నాటికని, 2022లో పూర్తిచేస్తామని చెప్పిన జగన్, ఇప్పుడు డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్నది కాబట్టి, పోలవరంపనులుచేయలేం అంటున్నాడు. డయాఫ్ర మ్ వాల్ దెబ్బతిన్నదని ఐఐటీ హైదరాబాద్ నివేదిక ఇచ్చేవరకు జగన్ ప్రభుత్వానికి తెలియ దు. 2020 ఆగస్ట్ లో డయాఫ్రమ్ వాల్ దెబ్బతింటే జగన్, మంత్రి అంబటి ఇన్నాళ్లనుంచి దాన్ని ఎందుకుబాగుచేయలేదు? రివర్స్ టెండరింగ్ డ్రామాలాడి పోలవరాన్ని సర్వనాశనం చేసిన ఘనుడిగా జగన్ చరిత్ర
ఇంటింటికీ రేషన్ బియ్యం : కేంద్రమిచ్చే ఉచితబియ్యాన్ని పేదలకు ఇవ్వకుండా జగన్ ప్రభుత్వం అమ్ముకుంటోంది
కేంద్రప్రభుత్వం ఇచ్చిన ఉచితబియ్యాన్ని కూడా అమ్ముకున్న జగన్ ఉచితంగా ఇంటింటికీ బియ్యం ఇస్తున్నాడట. కరోనాసమయంలో కేంద్రం ఉచితంగా పేదలకు అందించిన బియ్యా న్ని జగన్ 7నెలలపాటు ఎగ్గొట్టాడు. ఉచితబియ్యంద్వారా ఒక్కో ఇంటికి సగటున రూ.3వేల చొప్పున రావాల్సి ఉంటే, జగన్ ఆసొమ్ముని తనబొక్కసంలో వేసుకున్నాడు.
దిశాబిల్లు : తప్పులతడకన్న కేంద్రప్రభుత్వం…. దిశాబిల్లుతో మహిళల్ని ఉద్ధరిస్తున్నట్టు గొప్పలు చెప్పిన జగన్
వైసీపీప్రభుత్వం కేంద్రానికి పంపిన దిశాబిల్లు చట్టవిరుద్ధమైనది అని పార్లమెంట్ సాక్షిగా కేంద్ర ప్రభుత్వమే చెప్పింది. దిశాబిల్లు తప్పులతడకగా ఉందని పార్లమెంట్ లో చెప్పారు. కేంద్రహోం శాఖ వైసీపీఎంపీకి దానిపై లిఖితపూర్వకసమాధానం ఇచ్చింది. కానీ జగన్ మాత్రం అసెంబ్లీ లో దిశబిల్లుతో మహిళల్ని ఉద్దరిస్తున్నట్టు మాట్లాడాడు. గవర్నర్ ప్రసంగం మొత్తం అబద్ధాలపుట్టే. అసెంబ్లీలో టీడీపీసభ్యుల గొంతునొక్కిన జగన్, ప్రజాక్షేత్రంలో మమ్మల్ని ఎదుర్కొని, మాకు సమాధానంచెప్పలేడు. జగన్ అసత్యాలు, అబ ద్ధాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లి, వైసీపీకి వచ్చేఎన్నికల్లో ఒక్కసీటుకూడా రాకుండా చేస్తాం” అని నిమ్మల తేల్చిచెప్పారు.