-ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రాం జగనన్న మానస పుత్రిక
-మహానేత వైయస్‌ఆర్ తెచ్చిన ఆరోగ్యశ్రీ పథకం దేశానికే దిక్సూచిగా నిలిచింది
-ఈ శకానికి ఫ్యామిలీ డాక్టర్ పథకం వినూత్నం, విలక్షణం
-ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆనందంగా ఉండాలంటే జగనన్నే కావాలి
-బాబూ నలుగురు ఎమ్మెల్యేలను కొనగలవేమో కానీ, జగనన్న కోసం ప్రాణం ఇచ్చే అభిమానులను కొనలేవ్..
-ఆంధ్రరాష్ట్రం మా నమ్మకం నువ్వే జగనన్న, జగనన్నే మా భవిష్యత్తు అంటోంది
-ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రాం ప్రారంభోత్సవ సభలో మంత్రి విడదల రజిని
‘‘చిలకలూరిపేట నియోజకవర్గ ప్రజలందరి సాక్షిగా చెబుతున్నా.. నా రాజకీయ జీవితం, ఎమ్మెల్యే పదవి, మంత్రి పదవి జగనన్న పెట్టిన భిక్షే.. మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను. మీ ఆశయాల సాధనే లక్ష్యంగా, మీ ఆలోచన అమలే ధ్యేయంగా, మీ ఆదర్శాలే ఆచరణగా, మీ నాయకత్వమే నా అదృష్టంగా, మీరు నాకు అప్పగించిన ఈ కర్తవ్యాన్ని నేను నిజాయితీగా నిర్వర్తిస్తూనే ఉంటాను’’ అని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని భావోద్వేగంతో కంటతడి పెట్టారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం లింగంగుంట్ల గ్రామంలో ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రాం ప్రారంభోత్సవ సభలో మంత్రి విడుదల రజిని పాల్గొని మాట్లాడారు.
మంత్రి విడదల రజిని ప్రసంగం..
‘‘భారతదేశ ఆత్మ గ్రామ సీమల్లోనే ఉందని గాంధీజీ ఎప్పుడో చెప్పారు. పల్లె సీమలే దేశానికి పట్టుగొమ్మలని మన ముఖ్యమంత్రి వైయస్ జగన్ బలంగా నమ్మారు. అందుకే చక్కటి వలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చారు. ఈ వలంటీర్ వ్యవస్థ గ్రామాల్లో ప్రతి ఒక్కరికీ ఆత్మబంధువులా పనిచేస్తుంది. గ్రామాలు, పట్టణాల్లో వలంటీర్లు ఏ విధంగా సేవలు అందిస్తున్నారో అందరికీ తెలుసు. అదే దిశగా ప్రతి గ్రామంలో డాక్టర్ వైయస్‌ఆర్ విలేజ్ క్లినిక్‌లు దర్శనమిస్తున్నాయి. గ్రామ ఆరోగ్య సౌభాగ్యమే.. దేశ ఆరోగ్య సౌభాగ్యమని అంటుంటారు. అది దృష్టిలో పెట్టుకొని వైయస్‌ఆర్ విలేజ్ క్లినిక్స్‌కు సీఎం వైయస్ జగన్ శ్రీకారం చుట్టారు. అంతేకాకుండా ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్టును తీసుకువచ్చారు.
సరిగ్గా 16 ఏళ్ల క్రితం 2007లో ఇదే ఏప్రిల్ నెలలో దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి ఆరోగ్యరంగంలో ఆరోగ్యశ్రీతో విప్లవాత్మక పథకానికి నాంది పలికారు. ఆరోగ్యశ్రీ పథకం దేశానికే దిక్సూచిగా నిలిచి సంచలనం సృష్టించింది. 16 ఏళ్ల తరువాత వైద్యరంగంలో ఇదే ఏప్రిల్‌లో ఆ మహానేత తనయుడు సీఎం వైయస్ జగన్ తండ్రికి మించి పేదలకు మంచి అని మన రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దడానికి ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్టును చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. 2007లో నాడు, 2023లో నేడు.. ఈ మధ్య కాలంలో ఏ నాయకుడూ ఒక మంచి ఆరోగ్యపథకాన్ని తీసుకువద్దామనే కనీస ఆలోచన చేయలేదు. వైయస్‌ఆర్ వారసత్వం, అరుదైన వ్యక్తిత్వం, మనసు నిండా మానవత్వం, గుండెల్లో పోరాటతత్వం, తిరుగులేని నాయకత్వంతో మన జగనన్న అడుగులు ముందుకేస్తున్నారు. ఈ శకానికి ఈ ఫ్యామిలీ డాక్టర్ పథకం వినూత్నం, విలక్షణం. ఈ విధానం పక్క రాష్ట్రాల నుంచి కాపీ కొట్టింది కాదు.. మేనిఫెస్టోలో పెట్టింది కాదు.. ఇది జగనన్న మానస పుత్రిక. యావత్ భారతదేశానికి ఆనాడు ఆరోగ్యశ్రీ ఎలా స్ఫూర్తినిచ్చిందో.. కచ్చితంగా నేను నమ్ముతున్నాను.. భవిష్యత్తులో ఈ ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్టు కూడా దేశానికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని నేను నమ్ముతున్నాను. ఈ ఫ్యామిలీ డాక్టర్ పథకం అవసరమైన ప్రతీ తలుపును ఈ స్టెతస్కోప్ తడుతుంది. ప్రతి గుండె చప్పుడును వింటుంది. ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఆలోచనలో భాగంగా గ్రామానికి 104 వాహనంలో డాక్టర్లు వచ్చి వైద్య సేవలు ఉచితంగా అందిస్తారు. వీటన్నింటినీ ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్ మెయిన్‌టైన్ చేస్తారు. ఎందుకంటే డాక్టర్–పేషెంట్ మధ్య ఒక బాండింగ్ ఉండాలని సీఎం ఆలోచన చేశారు.
కేవలం ధనవంతులకే ఉండే ఫ్యామిలీ డాక్టర్‌ను.. మా జగనన్న మాకు కూడా ఫ్యామిలీ డాక్టర్‌ను ఇచ్చాడని ధైర్యంగా చెప్పేలా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. వైద్య ఆరోగ్యరంగంలో జీరో వెహికెన్సీ పాలసీ అని దాదాపు 49 వేల రిక్రూట్‌మెంట్లు చేయిస్తున్నారు. కొత్త ఆస్పత్రులు, వేల వైయస్‌ఆర్ విలేజ్ క్లినిక్స్, 108, 104 వాహనాలు.. ప్రతి దాంట్లో ముందుకెళ్తూ 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు తీసుకువచ్చేందుకు నడుం బిగించారు. ఆరోగ్యశ్రీ ప్రొసీజర్స్ 1059 నుంచి 3255 వరకు పెంచారు. ఈ విధంగా సీఎం వైయస్ జగన్ అడుగులు వేస్తున్నారు. ఒక ముఖ్యమంత్రి ఎంత చేయొచ్చో నాలుగు సంవత్సరాల్లో చేసి చూపించారు.
40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చంద్రబాబు గొప్పలు చెప్పుకుంటున్నాడు. నేను సూటిగా అడుగుతున్నా చంద్రబాబును.. ఏరోజు అయినా ఒక ఆస్పత్రికి సరైన డాక్టర్లను నియమించేందుకు రిక్రూట్‌మెంట్ ఎప్పుడైనా చేశారా..? ఒక కొత్త ఆస్పత్రి బిల్డింగ్ కట్టారా..? ఉన్న ఆస్పత్రిని ఆధునీకరిద్దామని ఎప్పుడైనా ఆలోచించారా..? 108, 104 వాహనాలు పెంచుదామని ఆలోచించాడా..? ఇవేవీ చేయలేదు. దోచుకో, పంచుకో, తినుకో పథకం కోసం ఆరోగ్యరంగాన్ని చంద్రబాబు అమ్మకానికి పెట్టాడు. ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చాడు. దమ్ముంటే వైద్య ఆరోగ్యరంగంలో మీ హయంలో ఏం చేశారో చెప్పాలి..
దోమలపై దండయాత్ర, ఈగలపై కత్తియుద్ధం అంటూ ఏ విధంగా కాలక్షేపం చేశారో రాష్ట్ర ప్రజలంతా చూశారు. ఈ విధంగా వారి ఆలోచనలు ఉంటే.. పేదల ఆరోగ్యం గురించి ఆలోచన ఎలా వస్తాయి. అందరినీ మోసం చేయడమే చంద్రబాబు పని. చంద్రబాబు మీరు నలుగురు ఎమ్మెల్యేలను కొనొచ్చేమో.. మీకు నాలుగు టీవీలు, నాలుగు పత్రికలు ఉండొచ్చేమో.. నాలుగు పార్టీలతో పొత్తు ఉండొచ్చేమో.. కానీ, గుర్తుపెట్టుకోండి చంద్రబాబూ.. నాలుగు కోట్ల ప్రజల గుండెల్లో మాత్రం మీరు ఎప్పటికీ ఉండరు. ఆ స్థానం మా జగనన్నది. చంద్రబాబు నువ్వు నలుగురు ఎమ్మెల్యేలను కొనగలవేమో కానీ, జగనన్న కోసం ప్రాణం ఇచ్చే అభిమానులను కొనలేవ్.. జగనన్న అడుగులో అడుగు వేసే నాయకత్వాన్ని కొనలేవ్.. జగనన్న గుండెల్లో పెట్టుకున్న ప్రజలను అసలు కొనలేవ్. ప్రజల ఆశీస్సులు, దీవెనలు మన జగనన్నకు మెండుగా ఉన్నాయి. కచ్చితంగా 2024లో దిక్కులు పికటిల్లేలా జగనన్న గెలుపు ఉంటుంది.
రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు ఎంతమందితో కలిసి వచ్చినా, విడివిడిగా వచ్చినా.. మీ దుష్టచతుష్టయం ఎన్ని కుట్రలు చేసినా.. ప్రజల టీడీపీని ఓడించడం ఖాయం.. భూమి చీలినా, నింగి కూలినా.. న్యాయం ముందు అన్యాయానికి ఓటమి తప్పదని చరిత్ర చెబుతుంది. జగనన్న ముందు టీడీపీకి, చంద్రబాబుకు అదే ఓటమి గతి పడుతుంది. వెలుగు కావాలంటే సూర్యభగవానుడు కావాలి.. ఊపిరాడాలంటే వాయుదేవుడు కావాలి.. పంట పండాలంటే వరుణదేవుడు కావాలి.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆనందంగా ఉండాలంటే జగనన్నే కావాలి. మళ్లీ మళ్లీ జగనన్నే రావాలి. మా నమ్మకం నువ్వే జగనన్న, జగనన్నే మా భవిష్యత్తు అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటోంది.
చిలకలూరిపేట నియోజకవర్గానికి సంబంధించి కొన్ని అభ్యర్థనలు
చిలకలూరిపేట పట్టణంలో నీటి సమస్య తీవ్రంగా ఉంది. ప్రజల దాహార్తి తీర్చడానికి రూ.150 కోట్లకు సంబంధించి అమృత్ ప్రాజెక్ట్ ఉంది. దీనికి సంబంధించి 63 కోట్లు మన మున్సిపాలిటీ మీద భారం పడుతోంది. మున్సిపాలిటీ లోటు బడ్జెట్‌లో ఉంది కాబట్టి ప్రభుత్వం నుంచి సాయం అందించాలని కోరుతున్నాం.
మా చిలకలూరిపేట పట్టణంలో ఒక అంబేడ్కర్ భవన్ కావాలి. ఎస్సీ కమ్యూనిటీ హాల్ కావాలి. బీసీల కోసం బీసీ భవన్ ఒకటి కావాలి. కాపుల కోసం కాపు భవన్ ఒకటి కావాలి. ఇవన్నీ మంజూరు చేస్తారని కోరుకుంటున్నాను. ముస్లిం సోదరులకు శ్మశానవాటిక అవసరం ఉంది. నా సొంత డబ్బుతో 2 ఎకరాలు కొనిచ్చాను. మరో 3 ఎకరాలు అవసరం అవుతుంది. గ్రామాల్లో ఉన్న రైతులు అందరూ వారి మాటగా అడిగారు. కొన్ని లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు బాగు చేయడానికి నిధులు మంజూరు చేస్తారని ఆశిస్తున్నాం.