– రైతుల పేరుతో రియల్‌ఎస్టేట్ వర్గాలు చేసిన ప్రయత్నానికి బ్రేక్
– పేదలు నివసించడానికే వీల్లేదనడం ఆమోదయోగ్యం కాదు
– హైకోర్టు తీర్పు వారికి చెంపపెట్టులాంటిది
– రాజధానిలో త్వరలోనే ఇళ్ల నిర్మాణం కూడా పూర్తిచేసి ఇస్తాం
– తగుదునమ్మా అంటూ చంద్రబాబు డ్రామాలు
– చంద్రబాబు పెట్టిన బకాయిలనూ చెల్లించింది జగన్
– మేమేం చేయాలో చంద్రబాబుతో చెప్పించుకోవాల్సిన అవసరం లేదు
– విత్తనం నుంచి విక్రయం వరకూ ప్రతి అడుగులో అండగా ఉన్నాం
– ఏ సీజన్లో నష్టపోయిన పంటకు అదే సీజన్లో పరిహారం
– ప్రజా ముఖ్యమంత్రికి రోల్‌మోడల్ జగన్
– ప్రచార ముఖ్యమంత్రికి రోల్‌మోడల్ చంద్రబాబు
– అంచనాలు వదిలేసి ముఖ్యమంత్రి కోసం ఏర్పాట్లు చేయాలా..?
– ఉపన్యాసాలు, వీడియో కాన్ఫరెన్స్‌ల నైజం మాది కాదు
– చెప్పుకోడానికి చేసిందేమీ లేక జగనన్న కాలనీలపై దుష్ప్రచారం
– కాలనీలు, ఊళ్లకు ఊళ్లు రావడం అబద్దమా..?:
సజ్జల రామకృష్ణారెడ్డి
ఏ నివాసప్రాంతమైనా పేదలుంటారు
– అన్యాయమైన డిమాండ్‌తో వేసిన ఒక పిటీషన్‌కు న్యాయం ఎలా ఉంటుందో చూపించిన తీర్పు ఇది.
– ఇది సహజంగా జరగాల్సిన విధానం. ఈ రోజు ప్రధాన న్యాయమూర్తి మాటల్లో కూడా ఎందుకు ఇది అన్యాయమైన పిటీషన్ అనేది స్పష్టమైంది.
– రాజధానే కాదు…ఏ నివాస ప్రాంతాల్లోనైనా అన్ని వర్గాల వారుంటారు..పేదలు కూడా ఉంటారు.
– ప్రభుత్వం పూనుకుని నిర్మిస్తున్న ఒక రాజధానిలో పేదలు నివసించడానికి వీల్లేదు అనే ఆలోచన, ప్రయత్నం ఏ సమాజంలోనూ ఆమోదించాల్సిన విషయం కాదు.
– ప్రపంచంలోనే పెద్ద ప్రజాస్వామ్యం అని చెప్పుకునే ఈ దేశంలో అలాంటి ప్రయత్నమే దుస్సాహసం.
– రైతుల పేరుతో ఒక పిటిషన్ వేసి, రియల్ ఎస్టేట్ ప్రయోజనాల కోసం టీడీపీకి కొమ్ముకాస్తున్న వర్గాలు చేసిన ప్రయత్నానికి బ్రేక్ పడింది.
– ఇప్పటికే రాష్ట్రంలో 31 లక్షల మందికి ఇళ్ల స్థలాల పంపిణీ చేస్తున్నాం. రాజధాని ప్రాంతంలోనే మిగిలిపోయింది.
– హైకోర్టు తీర్పుతో రాజధాని ప్రాంతంలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి మార్గం సుగమమం అయ్యింది. ఆ ప్రక్రియ ప్రారంభిస్తాం.
– అక్కడ త్వరలో ఇళ్ల నిర్మాణం కూడా పూర్తి చేసే ప్రయత్నం చేస్తాం.
సామాజిక అసమతుల్యత అనే మాటే పాపం:
– సామాజిక అసమతుల్యత అనే మాట రావడమే అత్యంత పాపం, నేరం, రాజ్యాంగ వ్యతిరేకం.
– అలాంటి మాట వాడిన పిటీషనర్లు, వారిని కొమ్ము కాస్తున్న తెలుగుదేశం పార్టీ బోనులో నిలబడి సంజాయిషీ ఇవ్వాల్సిన అంశం.
– ఇప్పుడున్న ఆధునిక సమాజంలో ఆ మాటే రాకూడదు.
– ఆలాంటిది వాళ్లు పెద్ద ఫైటర్స్ కింద ఫోజులివ్వడం జరిగింది. అలాంటి వారికి చెంపచెల్లుమనిపించే తీర్పు ఈ రోజు వచ్చింది.
కష్టజీవుల నివాసాలతోనే నిజమైన రాజధాని:
– రాజధాని ప్రాంతంలో ఇళ్ల స్థలాల కోసం 50వేల వరకూ పేదలు దరఖాస్తు చేసుకున్నారు.
– రాజధాని నిర్మాణానికి చంద్రబాబు ఆనాడు అనుకున్నది ఏదీ జరగలేదు.
– నగరం విస్తరణ జరగడానికి, మంచి జనావాసం కావడానికి పునాధి ఇప్పుడు పడుతుంది.
– శ్రామికులు, కష్టజీవులు లేని నగరం ఎలా ఉంటుంది..? విలాసాలతో జూబ్లీ హిల్స్ సొసైటీలా పెట్టుకోవాలనుకుంటే ఎలా..?
– సమసమాజం దిశగా అడుగులు వేసే ప్రయత్నంలో భాగంగా ఇదో యజ్ఞంలా ప్రభుత్వం చేపడుతుంది.
– ఇప్పుడు ఎడారిలా ఉంది..రేపు రాజధాని ప్రాంతం కళకళలాడుతుంది.
తగుదునమ్మా అంటూ చంద్రబాబు డ్రామాలు:
– చంద్రబాబు ఏనాడూ రైతుల గురించి ఆలోచించింది లేదు.
– ఆయన రైతులకు ఇవ్వాల్సిన సొమ్ము కూడా బకాయిలు పెట్టి వెళ్లిన ఘనుడు.
– జగన్మోహన్‌రెడ్డి గారు వచ్చిన తర్వాత చంద్రబాబు పెట్టిన బకాయిలు చెల్లించారు.
– రైతులకు విత్తనం నుంచి విక్రమం వరకూ ప్రతి అడుగులోనూ చేయూతను ఇస్తున్నాం.
– ఇప్పుడు చంద్రబాబు ప్రత్యేకంగా వచ్చి మాకు నష్టాన్ని చూపాల్సిన అవసరం ఏమీ లేదు.
– వర్షం వస్తే అన్నీ తడుస్తాయి..నష్టం అంచనా వేయడం, సేకరణ చేపట్టడం మన బాధ్యత. ఆ తర్వాత అంచనాల ప్రకారం నష్టపరిహారం ఇవ్వాలి.
– ఒక క్యాలెండర్ ప్రకారం ఏ సీజన్లో నష్టపోయిన పంటకు అదే సీజన్లో పంట నష్టపరిహారం అందిస్తున్నది సిఎం శ్రీ వైఎస్ జగన్ గారే.
– ఈ క్రాప్ బుకింగ్ చేసి ప్రభుత్వం నుంచి రైతులకు రావాల్సినవన్నీ అందిస్తున్నది జగన్మోహన్‌రెడ్డి గారు
– అధికారులు తమ పని తాను చేసుకుపోతుంటే తగుదునమ్మా అంటూ చంద్రబాబు అక్కడకు వెళ్లి డ్రామా చేస్తున్నాడు.
– చంద్రబాబు గతంలో జరిగిన నష్టానికి ఏమీ ఇవ్వకపోయినా ఈనాడు, ఆంధ్రజ్యోతి వాళ్లకు కనిపించలేదు.
– ఏ రోజూ రైతులను చంద్రబాబు పట్టించుకోకపోయినా ఆ పచ్చ పత్రికలకు కనిపించలేదు.
– ఎలా నష్టపరిహారం ఇస్తారు..అంచనా ఎలా వేస్తారు..అనేది చంద్రబాబుకు తెలియదా..?
– చంద్రబాబుకు అసలు రైతుల గురించి మాట్లాడే అర్హతే లేదు. 2014–19 మధ్య ఆయన ఎలా నష్టపరిహారం ఇచ్చాడో చెప్తే బాగుండేది.
– నువ్వు ఏమీ ఇవ్వకపోగా..అక్కడకు వెళ్లి ప్రచార యావతో ఫోటోలు తీసుకుంటే ఎవరూ పట్టించుకోరు.
– రైతులకు చంద్రబాబు గురించి బాగా తెలుసు. రుణమాఫీ అంటూ ఆయనేం చేశాడో కూడా వారికి తెలుసు.
ప్రజా ముఖ్యమంత్రికి రోల్‌మోడల్ జగన్ :
– ఒక ముఖ్యమంత్రి ఎలా పనిచేయాలో జగన్మోహన్‌రెడ్డి గారిని చూసి నేర్చుకోవాలి. ఒక రోల్ మోడల్‌గా జగన్ గారిని తీసుకోవాలి.
– ప్రచారం మాత్రమే ఎలా చేసుకోవాలో చంద్రబాబును చూసి నేర్చుకోవాలి. హుద్ హుద్ తుఫాను సమయంలో ఆయన చేసింది అందరికీ తెలుసు.
– ఎవర్నీ పనిచేయనీయకుండా ఉపన్యాసాలు, వీడియో కాన్ఫరెన్స్‌లకే చంద్రబాబు తాపత్రయపడ్డాడు.
– అధికార యంత్రాంగం అంచనాలు వేయాలా..? ముఖ్యమంత్రి వస్తున్నారని ఏర్పాట్లు చేయాలా..?
– వర్షం పడగానే వెంటనే ఎలా పర్యటిస్తారనేది కనీసంగా ఆలోచించాలి.
అసలు నువ్వేనాడన్నా గోనెసంచులు ఇచ్చావా..?:
– అసలు రైతులకు గోనె సంచులు ఇచ్చే ప్రయత్నమే చంద్రబాబు చేయలేదు
– సేకరణ బాధ్యత మాది అని చెప్తున్న ప్రభుత్వం జగన్ గారిది. రంగుమారినా, తడిసినా..ఎలా ఉన్నా సరే మేం కొనుగోలు చేస్తున్నాం.
– రైతు నష్టం భరించకుండా అవసరమైతే ఎంతైనా ఖర్చు చేసి ధాన్యం సేకరణ చేపడుతున్నాం.
– ఇప్పటికే 4 లక్షల టన్నుల సేకరణ ఎలా జరిగింది. ఇవన్నీ గోనెసంచులు ఇస్తేనే జరిగింది కదా…
– ఆ సంచులు చంద్రబాబు ఇచ్చాడా..? ఆయన హయాంలో ఆ ప్రయత్నమే చేయలేదు.
– ప్రభుత్వం చేయాల్సిన దాంట్లో నూటికి నూరు శాతం చేస్తోంది.
– మధ్యలో వీళ్లు చేసే హడావుడి, చిన్నదాన్ని బూతద్దంలో చూపడం తప్ప ఏమీ లేదు.
కాలనీలు, ఊళ్లకు ఊళ్లు రావడం అబద్దమా..?:
– వర్షాలు పడితే అమరావతి ప్రాంతం ఎలా ఉంటుంది..? నీటితో నిండిపోయి సముద్రాన్ని తలపిస్తుంది.
– చంద్రబాబు అసెంబ్లీ కట్టాడు..అప్పుడు ప్రతిపక్ష నేత జగన్ గారి చాంబర్ ఎలా కారిందో అందరూ చూశారు.
– అదీ నిర్లక్ష్యం, లెక్కలేని తనం అంటే. జగనన్న ఇళ్ల విషయంలో లేని దాన్ని ఉన్నట్లు చూపించే ప్రయత్నం చేశారు.
– వాళ్లు కట్టిన టిడ్కో ఇళ్లు చెరువులు కాక ఏమిటి..?
– ఢిల్లీ అయినా, హైదరాబాద్ అయినా, ముంబై అయినా లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతూ ఉంటాయి.
– ఎక్కడైనా లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతుంటాయి..వెంటనే నీళ్లు వెళ్లి పోతుంటాయి.
– వాళ్లు తీసిన ఫోటోల్లో కూడా అవాస్తవాలు ఉన్నాయి. కాలనీల పక్కన నీరు నిల్వ ఉన్న ఫోటోలు తీసి పెట్టారు.
– వాళ్లు ఏది చెప్పినా 30 లక్షల ఇళ్ల స్థలాలు అనేది అబద్ధమా..?
– నువ్వు కట్టిన టిడ్కో ఇళ్లు కూడా ఉచితంగా ఇవ్వాలనుకోవడం అబద్దమా..?
– కాలనీలు..ఊర్లకు ఊర్లు రావడం అబద్దమా..?
– వందకు వంద శాతం హామీలను అమలు చేసిన జగన్ గారిని ఎలా ఎదుర్కోవాలో అర్ధం కాక ఇలాంటి ప్రచారం చేస్తున్నారు.
– చంద్రబాబు ఏం చేశాడో చెప్పుకునే పరిస్థితి ఆ పత్రికలకు లేక చిన్నపాటి సమస్యలను బూతద్దంలో చూపిస్తున్నారు.
– ఆనాడు వాళ్లు చేసిన తప్పులను మావైపు చూపే ప్రయత్నం చేస్తున్నారు.
– అవేమీ ప్రజలు నమ్మడం లేదు కాబట్టే మేం నిర్వహించిన జగనన్నే మా భవిష్యత్తు అనే కార్యక్రమానికి విశేష స్పందనే నిదర్శనం.
– ప్రజల కోసం పాలకులు వారివైపు నిలిచినప్పుడు ప్రజలు కూడా పూర్తిగా ఆ ప్రభుత్వం వైపు ఉంటారనడానికి ఇదే నిదర్శనం.
కమ్యూనిస్టుల తీరు దిగ్భాంతిని కలిగిస్తోంది:
– దున్నేవాడిదే భూమి అని ఇదే చల్లపల్లి ప్రాంతంలో భూముల కోసం పోరాడిన పార్టీ కమ్యూనిస్టు పార్టీ
– ఇప్పుడు వారి తీరు దిగ్భాంతిని కలిగిస్తోంది. ప్రభుత్వం ఇస్తుంటే సామాజిక అసమతుల్యత వస్తుందన్న వారితో గొంతుకలపడం వారు ఏ స్థాయికి దిగజారారో ప్రూవ్ చేసుకున్నారు.
– తమను కమ్యూనిస్టులు అనడానికి వీళ్లేదు అని వారికి వారే ప్రూవ్ చేసుకుంటున్నారు.