– జగన్ జీవో నెంబర్ 217 తెచ్చి చెరువుల్లో చేపలు పట్టుకునే అవకాశం లేకుండా చేశారు
– పది రూపాయిలిచ్చి వంద దోస్తున్నాడు
– టీడీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే జగన్ సర్కారు తెచ్చిన జీవో 217ను రద్దు చేస్తాం
– పెందుర్తిలో మత్స్యకారులతో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆత్మీయ సమావేశం
చంద్రబాబు నాయుడు ఇంకా ఏమన్నారంటే..
తెలుగు దేశం ఆవిర్భావం తరువాత బిసిలకు రాజకీయ అవకాశాలు వచ్చాయి. బిసి వర్గాలకు తెలుగు దేశం ఇచ్చిన రాజకీయ రిజర్వేషన్ల వల్లనే వారి నాయకత్వం పెరిగింది.మన హయాంలో 34 శాతం ఉన్న బిసిల రిజర్వేషన్లు జగన్ అసమర్థత కారణంగా 24 కు శాతానికి తగ్గాయి.మత్స్యకారుల పడవలకు డీజిల్ పై ఆరు రూపాయలు సబ్సిడీ ఇచ్చిన ఏకైక ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం.
స్థానిక చేపల చెరువులోని చేపలను పట్టుకునే హక్కు స్థానిక మత్స్యకారులకే ఉండేలా నాడు అనుమతులు ఇచ్చాం. జగన్ జీవో నెంబర్ 217 తెచ్చి మత్సకారులు స్థానిక నీటివనరులు, చెరువుల్లో చేపలు పట్టుకునే అవకాశం లేకుండా చేశారు. టీడీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే జగన్ సర్కారు తెచ్చిన జీవో 217ను రద్దు చేస్తాం.మత్స్యకారులను బోట్లు కొనుక్కోడానికి సబ్సిడీ ఇచ్చింది టీడీపీనే. నేడు సవాలక్ష ఆంక్షలు, షరతులతో మత్స్యకారుల వృత్తినే దెబ్బతీశారు. ఈ నాలుగేళ్లలో జగన్ రెడ్డి బీసీలకు ఏం చేశాడు? ఒక్క పథకం అయినా ఇచ్చాడా?
పది రూపాయిలిచ్చి వంద దోస్తున్నాడు. పప్పు, ఉప్పూ, గ్యాస్ సహా అన్నింటిలో ధరలు పెంచేశారు. మద్యంపై జే ట్యాక్స్ వేసి దోచుకుంటున్నాడు. నాణ్యత లేని మద్యంతో మీ ఆరోగ్యంతో ఆడుకుంటున్నాడు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సహజ వనరులను దోచుకుంటున్నారు. విశాఖను దాదాపుగా కబ్జా చేసేశారు. మత్స్యకారుల సమస్యలపై చర్చించి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి ఆదుకుంటాం.