Suryaa.co.in

Andhra Pradesh

అనైతిక జర్నలిజానికి ఒక కేస్ స్టడీ

(కృష్ణారావు)

రాజధానిపై చేసిన వ్యాఖ్యల వల్ల భారతి గారికి, జగన్ గారికి ఇబ్బంది కలిగితే మన్నించాలని, అవసరమైతే రాజీనామా చేయగలనని కెఎస్ఆర్ ప్రకటించారు. ఇందులో ఆయన క్షమాపణ భారతి, జగన్ లకే తప్ప రాజధాని అమరావతి పౌరులకు, స్త్రీలకు కానేకాదు. అంతేకాకుండా “తమ వల్ల ఇబ్బంది కలిగివుంటే” అనే ప్రస్తావనతో యజమానులను తగాదాలోకి ఈడ్చుకొచ్చేశారు.

స్త్రీలపట్ల అవమానకరంగా మాట్లాడిన ఈ దుర్షటనపై విచారం వెలిబుచ్చి బేషరతుగా క్షమాపణ చెప్పవలసిన నైతిక బాధ్యత సాక్షి టివి, సాక్షి పత్రిక ల అధినేత భారతి గారి మీద వుంది. రాజకీయాలు, వ్యాపారాలను పక్కనపెట్టి ఒక స్త్రీగా అయినా స్పందించాల్సిన కనీస బాధ్యత ఆమె మీద వుంది.

ఎక్కడైనా చెల్లెళ్ళూ, తల్లులూ అని ఉపన్యాసం మొదలు పెట్టే జగన్ గారు కూడా ఈ సంఘటనపై నోరు తెరవకపోవడం గమనార్హం!

ఇష్టంలేని అమరావతిని ఎవరు ఎలా అవమానించినా వెకిలినవ్వులు నవ్వే జగన్ నుంచి ఏమి ఆశించగలం?

కెఎస్ఆర్, కృష్ణంరాజు వంటివారికి సాక్షి ఎక్స్ లెన్స్ అవార్డులు ఇచ్చిన భారతి పాటించే జర్నలిజం ప్రమాణాల నుంచి ఏమి ఆశించగలం?
కొన్ని వాస్తవాలను వక్రీకరించి వాటికి అమరావతి పేరు జోడించి అత్యంత అవమానకరమైన నిందను ప్రసారంచేయడం యజమాని ఆనందం కోసమేనని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

ఆ ఇద్దరికీ అరెస్టు, తదుపరి చర్యలు తప్పవు. చట్టబద్దమైన చర్యలను ఇద్దరూ ఎదుర్కొంటారు.

జర్నలిజం వేదికను ఉద్దేశ్యపూర్వకంగా దుర్వినియోగం చేసిన సీనియర్ జర్నలిస్ట్ ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్ కెఎస్ఆర్, – బరితెగించిన కృష్ణంరాజు (అతగాడిని జర్నలిస్ట్ అనడం కుదరదు) ల తీరుపై పెద్ద చర్చ జరగాలి. విస్తృత ప్రచారంలో వున్న ఈ ఉదంతం జర్నలిజంలో అనైతికత కు ఈ ఒక కేస్ స్టడీ కావాలి. ఈ ఇద్దరి వ్యాఖ్యలను, పర్యవసానాలను జర్నలిస్టుల పాఠంగా నమోదు చేయాలి.

LEAVE A RESPONSE