Suryaa.co.in

Andhra Pradesh

భారతి రెడ్డి క్షమాపణ చెప్పాలి

– అమరావతి వేశ్యల రాజధాని వ్యాఖ్యలపై భారతి రెడ్డి, జగన్ బాధ్యత వహించాలి
– ఇవి బేస్ లెస్ అండ్ సెన్స్ లెస్ కామెంట్స్
– పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి

“అమరావతి మన రాజధాని. అమరావతి రాజధానిగా ఉండటం మనకు గర్వకారణం. గత పదేళ్లుగా ఇప్పటి వరకు రాజధాని లేదు. ఇలాంటి సమయంలో అమరావతిని మన రాజధానిగా నిర్మించుకునే సమయం ఇది. ఇలాంటి సమయంలో రాజధాని గురించి వ్యతిరేకంగా మాట్లాడిన ఏ అంశం కూడా క్షమించరానిది” అని షర్మిల పేర్కొన్నారు. “వేశ్యల రాజధాని” అనే వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుందని, ఇలాంటి మాటలు క్షమించరానివి, దురదృష్టకరమని ఆమె అన్నారు.

సాక్షి ఛానెల్, భారతి రెడ్డి, జగన్ క్షమాపణ చెప్పాలి

YCP పార్టీకి చెందిన సాక్షి ఛానెల్‌లో ఈ వ్యాఖ్యలు ప్రసారం చేసినందుకు సాక్షి హౌస్ క్షమాపణ చెప్పాలని వైఎస్ షర్మిలా రెడ్డి డిమాండ్ చేశారు. సాక్షి మీడియా హౌస్ నడుపుతున్న భారతి రెడ్డి క్షమాపణ చెప్పాలని, భారతి రెడ్డి క్షమాపణ చెప్పడంలో తప్పు లేదని, నామోషీ చెందాల్సిన అవసరం అంతకన్నా లేదని ఆమె అన్నారు.

సాక్షి ఛానెల్ YCP మీడియా కాబట్టి జగన్ కూడా క్షమాపణ చెప్పాలని షర్మిల కోరారు. “మహిళల మనోభావాలు దెబ్బతీసినందుకు క్షమాపణ చెప్పడంలో జగన్ ఎందుకు వెనకడుగు వేస్తున్నారు?” అని ఆమె ప్రశ్నించారు.

“ఇలాంటి నీచపు వ్యాఖ్యల వల్ల రాజధాని అమరావతి మీద ఎలాంటి ప్రభావం పడదు. ఇలాంటి వాక్యాల్లో వాస్తవం లేదు. అక్కడ వేశ్యలు కాదు.. అందరూ ఉంటారు.. అన్ని వర్గాల వారు ఉంటారు. ఇవి బేస్ లెస్ అండ్ సెన్స్ లెస్ కామెంట్స్” అని షర్మిల తేల్చిచెప్పారు.

గతంలో కొడుకు పెళ్లి ఆహ్వాన పత్రికను పసుపు చీరలో చంద్రబాబు గారి ఇంటికి వెళ్లి ఇచ్చి ఆహ్వానించింది అనే అక్కసుతో.. షర్మిళ మీద నీతి బాహ్యమైన వాఖ్యలు చేసింది వైకాపా.

సొంత ఇంటి ఆడపడుచుల నుండి ఆంధ్ర రాష్ట్ర మహిళల వరకు వీరికి మహిళలు అంటే చులకన. వీరికి ఒక్క భారతి రెడ్డి గారు మాత్రమే మహిళ. మిగిలిన వారిని ఏది పడితే అలా అనే అలవాటుగా మారింది. మహిళల పట్ల వైకాపా, సాక్షి తమ పద్ధతి మార్చుకొనే వరకు, క్షమాపణలు చెప్పేవరకు పోరాటం ఆపకూడదు.

-బాబు.బి

LEAVE A RESPONSE